The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
eddu shailaja మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment)ను కలుషితం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును. వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth )పై నున్న జీవరాశులకు అనుకూలమైనది.
2001, జనవరి 15న మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞానసర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతమై, ప్రజాదరణ పొందిన వెబ్సైటులలో 2017 నాటికి 5వ స్థానంలో ఉంది.
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (మరాఠీ : डॊ.भीमराव रामजी आंबेडकर ) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) "బాబాసాహెబ్" అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త.
మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2 అక్టోబర్ 2014 ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 2014 సెప్టెంబరు 24న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ 2014 అక్టోబర్ 2నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.
'మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్‌కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.
సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి . సరోజినీ దేవి 1925డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం మరియు హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు.
గురజాడ అప్పారావు (1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి.
'నేతాజీ' సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) అతను గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ ఉద్యమం (ఆంగ్లం : The International Red Cross and Red Crescent Movement) ఒక అంతర్జాతీయ మానవతావాద ఉద్యమం. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులు (కార్యకర్తలు) ఉన్నారు. వీరు మానవతావాదాన్ని, మానవుల జీవితాలను, ఆరోగ్యాన్ని కాపాడడానికి అనునిత్యం శ్రమిస్తూ వుంటారు.
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.
తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
బుర్రకథ {Burrakadha} పల్లెపదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకొంటూ సరదా సరదాగా సాగిపోయే ఒక జానపద కళారూపం. పరిమితమైన ఆహార్యంతో, ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జన సామాన్యానికి చేరువగా వెళ్లే కళారూపాలలో హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవది. హరికథలో కొంత సంప్రదాయముద్ర ఉండి బుర్రకథ పూర్తిగా జానపద కళారూపం.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
పర్యావరణ వ్యవస్థ అనగా భౌతిక వ్యవస్థలు లేదా జీవ క్రిములకు అస్థిరత, అసమానత, హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలని పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని కాలుష్యం అంటారు. కాలుష్యం అనేది రసాయనిక పదార్ధాలు లేదా ధ్వని, వేడిమి లేదా కాంతి శక్తి వంటి శక్తి రూపాలలో ఉండవచ్చు.కలుషితాలు, కాలుష్య కారక పదార్ధాలు, విదేశీ పదార్ధాలు లేదా శక్తులు లేదా సహజ సిద్దమైనవి; సహజ విధంగ లభిస్తున్నప్పుడు వాటి సహజ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు కలుషితాలుగా గుర్తించబడతాయి.కాలుష్యం తరచుగా మూల కేంద్ర కాలుష్యం లేదా మూల కేంద్రం లేని కాలుష్యం అని విభజింపబడుతుంది. బ్లాక్‌స్మిత్ సంస్థ ప్రతీ సంవత్సరం ప్రపంచ నీచ కలుషిత ప్రాంతాల జాబితాను విడుదల చేస్తుంది.
మహాత్మా జ్యోతిరావు భా ఫూలే 1827 పుణె దగ్గర కావడి గ్రామం లో వ్యవసాయ కులం అయిన మాలి కులానికి చెందిన చిన్నుభాయి - గోవింద రావు దంపతులకు జన్మించాడు.క్రైస్తవ మిషనరీ విద్యా సంస్థలలో చదువుకున్న ఫూలే అభ్యుదయ భావాలను కలిగి ఉండే వాడు.అగ్రవర్ణాల పీడన అంటరానితనం లకు వ్యతిరేకంగా శూద్ర , అతి శూద్రులను చైతన్య పరచడానికి అనేకమైన రచనలు చేశాడు..సావిత్రి భాయి ఫూలే నీ పెళ్ళిచేసుకుని ఆమెకు విద్య నేర్పి సావిత్రి భాయి ఫూలే నీ దేశం లోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చి దిద్దాడు...1840 పుణె లో మొదటి మహిళా స్కూల్ నీ స్థాపించి ఆ మనువాద కాలం లో విప్లవానికి నాంది పలికాడు.. సత్యాన్ని శోదించ డానికి 1874 spt 24 న సత్య శోదక్ సమాజ్ నీ స్థాపించి అనేక రచనలను చేశాడు... ధర్మ తృతీయ రత్న ,సేద్య గాని చర్ణకొల,బ్రహ్మనెంచే కసబ్ ,గులాంగిరి .వంటి రచనల ద్వారా ప్రజలను ,మహిళను చైతన్య పరిచాడు..వేద కర్మ కాండలకు వ్యతిరేకం గా ఇశారా అనే రచన ద్వారా బ్రాహ్మణులు లేకుండా పెళ్లిళ్లు ,శుభ కార్యాలు నిర్వహించి అగ్రవర్ణాల దోపిడీ నుంచి విముక్తి కావాలని పిలుపు నిచ్చాడు...విద్య లేకనే ఇలా బానిసలు గా మిగిలిపోతున్నారు అని బ్రిటీషు ప్రభుత్వం కి అర్జి లు పెట్టీ విద్య సదుపాయాలు కల్పించాలని హంటర్ కమిషన్ ముందు representation ఇచ్చాడు..మహాత్మా అని గాంధీ చేత పిలువబడిన మొదటి వ్యక్తి..
ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహణలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు సాంస్కృతిక వికాసంలో తెలంగాణ జాతి ఖ్యాతిని ప్రపంచానికి విదితం చేయాలనే సంకల్పంతో ఈ సభలు నిర్వహించినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. 2017, డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదురోజులపాటు ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
జవాహర్ లాల్ నెహ్రూ, (Jawaharlal Nehru) (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.
ఇందిరా ప్రియదర్శిని గాంధీ (హిందీ: इन्दिरा प्रियदर्शिनी गान्धी)(english:Indira Priyadarshini Gandhi) (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది.
తాజ్ మహల్ (ఆంగ్లం:Taj Mahal (/ˈtɑːdʒ məˈhɑːl/) (హిందీ: ताज महल) (ఉర్దూ: تاج محل ) అనే ఒక అద్భుతమైన సమాధి] భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. తాజ్ మహల్ (ఇంకా "తాజ్") |మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది, ఇది పర్షియా, భారతీయ మరియు ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది. 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చినదీ మరియు "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదాహరించింది అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది." తెల్లటి పాల రాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం, నిజానికి తాజ్ మహల్ ఒక మిశ్రమ సమన్వయ నిర్మాణం.
'పోలవరం పథకము' గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు.
ఆర్కిమెడిస్ (జ:క్రీ.పూ.287 - మ:క్రీ.పూ.212) ప్రముఖ గ్రీకు గణిత, భౌతిక శాస్త్రవేత్త , ఇంజనీరు, ఆవిష్కర్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు . ఆయన యొక్క జీవితం గురించి కొన్ని వివరములు మాత్రమే తెలిసినప్పటికి, ఆయన శాస్త్రీయ పురాతనత్వములో ముఖ్యమైన శాస్త్రవేత్తలలో ఒకరిగా యోచించారు. భౌతికశాస్త్రంలో ఆయన అభివృద్ధి చేసిన హైడ్రోస్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్ మరియు లేవేర్ యొక్క సిద్దాంత వివరణ ముఖ్యమైనవి.
ప్రకటన (ఆంగ్లం: Advertising) అనేది సాధారణంగా ఒక వ్యాపారాత్మక/రాజకీయ/సైద్ధాంతిక సమర్పణకి సంబంధించి వీక్షకులని ఒక చర్యని చేపట్టటానికి లేదా అప్పటికే చేపట్టిన చర్యనే కొనసాగించటానికి ఒప్పించే విపణీకరణలో భాగమైన ఒక రకమైన భావప్రకటన. ప్రకటన అనగా ఒక సంస్థ లేదా ప్రభుత్వము, అధికారికంగా ప్రజలవద్దకు చేర్చే సమాచారం. ఏ సంస్థ అయినా ప్రజలకు తెలియజేయవలసిన విషయాన్ని కొన్ని మాధ్యమాల ద్వారా ప్రజలవద్దకు తీసుకుపోయే ప్రక్రియ ప్రకటనా ప్రక్రియ.
1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి.
భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు
భారతదేశంలో ప్రాథమిక హక్కులు (ఆంగ్లం : Fundamental Rights in India' ref>
పులి (పాన్థెర టైగ్రిస్ )ఫెలిడే కుటుంబానికి చెందినది;పాన్థెరా తరగతికి చెందిన నాలుగు "పెద్ద పిల్లులలో" ఇది ఒకటి.[4] ఎక్కువగా తూర్పు మరియు దక్షిణ ఆసియాలు, మూల స్థానంగా గల పులి అత్యున్నతంగా వేటాడే జీవి మరియు విధి అయిన మాంసాహారి. [5]ల మొత్తం పొడవు మరియు 300 కిలోగ్రాముల (660 పౌండ్ల)బరువు కలిగిన, పెద్దపులి ఉపజాతులు అంతరించిన అతిపెద్ద ఫెలిడ్స్త్ తో పోల్చదగినవి.[6][8] వాటి పరిమాణం మరియు శక్తితో పాటు, తెలుపు నుంచి ఎరుపు-కాషాయ రంగు బొచ్చుతో గాఢమైన నిలువుచారలను కలిగి, తేలికైన లోపలి భాగాలను కలిగి ఉండటం వాటి గుర్తించదగిన లక్షణం. ఎక్కువ సంఖ్యలో ఉపజాతులు కలిగి ఉన్నది బెంగాల్ పులి అయితే అతిపెద్ద ఉపజాతులను కలిగి ఉన్నది సైబీరియన్ పులి.
భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి, యాంత్రీకరణకు ప్రవేశపెట్టి, రసాయనిక ఎరువులను, క్రిమిసంహారక మందులనువాడి, సంకర జాతి వంగడాలను వాడి స్వల్పకాలంలో అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానాన్ని సాంధ్ర వ్యవసాయం లేదా హరిత విప్లవం (Green Revolution) అంటారు. ఇది మొట్ట మొదటి సారిగా మెక్సికోలో 1945 లో ప్రారంభమైంది. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్ ఇందుకు సహకారమందించాయి.
గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములో సంగమిస్తుంది.