The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (బ-భ-మ)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (వ-శ-ష)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
జీవిత విశేషాలు భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్పాల్, భీమాబాయ్ దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు.అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం (మందనగడ్ తాలూకాలో) కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు వంశీకులు మహార్ కులానికి చెందినవారు. బ్రిటీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ యొక్క సైన్యంలో అంబేద్కర్ పూర్వీకులు పనిచేశారు.
కళ్యాణలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకం. 2017, మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ లో ఈ పథక ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుండి రూ.75,116 లకు పెంచారు. 2018, మార్చి 19న రూ.1,00,116 కు పెంచారు.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 15000 AC లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
'మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్‌కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ IIచే దైవ ఆశీర్వాదం ( బీటిఫికేషన్)మరియు బ్లెస్డ్ తెరెసా అఫ్ కలకత్తా బిరుదు పొందారు.
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.
భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు
భారతదేశంలో ప్రాథమిక హక్కులు (ఆంగ్లం : Fundamental Rights in India' ref>
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (జూలై 8, 1949 - సెప్టెంబర్ 2, 2009) ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
యూట్యూబు అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
మూస:Infobox Prepared Food హాట్ డాగ్ (ఫ్రాంక్‌ఫర్టర్ , వీనర్ ) అనేది రుచి మరియు ఆకృతిలో కూడా తడిగా ఉండే మాంసం కూర, తరచుగా దీనిని మాంసపు ముద్దతో చేస్తారు, ముఖ్యంగా గొడ్డు మాంసం మరియు పంది మాంసం ఉంటాయి, అయినను ఇటీవల వీటి స్థానంలో కోడి లేదా గిన్నెకోడి రకాలను ఉంచబడుతున్నాయి. చాలావరకు రకాలు పూర్తిగా ఉడికించి, ఎండబెట్టి లేదా కాల్చబడతాయి. హాట్ డాగ్‌లను సాధారణంగా ప్రత్యేకమైన మృదుత్వాన్ని కలిగి గుండ్రంగా చుట్టబడి వేడిగా ఉండే హాట్ డాగ్ బన్నులతో తినటానికి అందిస్తారు.
ICT గా పిలువబడే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్స్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కి ప్రర్యాయంగా వాడబడుతుంది, కాని అది ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టెలీకమ్యునికేషన్స్ (టెలిఫోన్ లైన్లు మరియు వైర్లెస్ సిగ్నల్స్) యొక్క పాత్రను తెలిపుతుంది. ICT లో సమాచారాన్ని నిర్వహించుటకు మరియు సమాచార మార్పిడికి సహాయపడుటకు అన్ని సాంకేతిక సాధనాలు ఉంటాయి. వీటిలో కంప్యుటర్, నెట్వర్క్ హార్డ్‌వేర్ మరియు కావలసినంత సాఫ్ట్వేర్ కూడా ఉంటాయి.
2001, జనవరి 15న మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞానసర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. పలువురి ఆదరాభిమానాలు చూరగొని వీక్షకుల వలన విజయవంతమై,అంతర్జాలంలో ప్రజాదరణ పొందిన వెబ్ సైట్లలో 2017 నాటికి మన వికీపీడియా 5వ స్థానంలో ఉంది.
1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి.
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment)ను కలుషితం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును. వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth )పై నున్న జీవరాశులకు అనుకూలమైనది.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
'నేతాజీ' సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) అతను గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం ఆయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి . సరోజినీ దేవి 1925డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.
భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 – 1931 మార్చి 23) స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీదిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు.విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.భారత స్వాతంత్ర్యోద్యమము లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు.
మానసిక ఆరోగ్యం అనేది జ్ఞానం లేదా భావావేశముల ఆరోగ్యకరమైన స్థాయి లేదా మానసిక వైకల్యం లేకపోవడంగా నిర్వచింపబడుతుంది. సకారాత్మక మనోవిజ్ఞానశాస్త్రం లేదా సంపూర్ణత్వంల దృష్టికోణంలో మానసిక ఆరోగ్యం, జీవితాన్ని అనుభవించడానికి మరియు జీవన కార్యకలాపాలు మరియు మానసిక ఉత్తేజాన్ని సాధించే ప్రయత్నాల మధ్య సమతూకాన్ని సాధించే వ్యక్తి యొక్క సామర్ధ్యాన్ని కలిగి ఉండవచ్చు. మానసిక ఆరోగ్యం అనేది మన భావావేశాల వ్యక్తీకరణ మరియు మన కోరికల శ్రేణిని విజయవంతంగా అనుసరించడాన్ని సూచిస్తుంది.
కృష్ణా నదిపై నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు దిగువన పులిచింతల గ్రామం వద్ద నిర్మింప తలపెట్టిన సేద్యపు నీటి ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు / కె.ఎల్.రావు సాగర్ ప్రాజెక్టు (Pulichintala project / K L Rao Sagar Project). విజయవాడ వద్దగల ప్రకాశం బారేజికి ఎగువన 85 కి.మీ.ల దూరంలో ఈ ప్రాజెక్టు స్థలం ఉంది. ఈ ఆనకట్ట స్థలం నదికి కుడివైపున గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం పులిచింతల వద్ద, ఎడమ వైపున నల్గొండ జిల్లాలోని మేళ్లచెరువు మండలం వజినేపల్లి వద్ద ఉంది.
గమనిక భగవద్గీత అధ్యాయానుసారం (సంస్కృతం తెలుగు లిపిలో) పూర్తి పాఠము వికీసోర్స్లో ఉంది. భగవద్గీత ఒక్కో శ్లోకానికీ తెలుగు అనువాదం వికీసోర్స్లో ఉన్నది: భగవద్గీత (తెలుగు అనువాదము) భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది.
పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత మరియు లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం.
ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (Sachin Ramesh Tendulkar) (Marathi: सचिन रमेश तेंडुलकर). క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. 16-నవంబర్-2013 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు ప్రకటించింది.
హైదరాబాదు, తెలంగాణ రాజధాని మరియు ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని, హైదరాబాదు జిల్లా మరియు రంగారెడ్డి జిల్లాల ముఖ్యపట్టణం. హైదరాబాదు నగరము సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు, దేవాలయములకు, చక్కని కళలకు, హస్తకళలకు మరియు నాట్యానికి ప్రసిద్ధి. హైదరాబాదు భారత దేశములో ఐదవ అతిపెద్ద మహానగరము.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. [[తెలుగు సినిమా పితామహుడు]]గా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.
తాజ్ మహల్ (ఆంగ్లం:Taj Mahal (/ˈtɑːdʒ məˈhɑːl/) (హిందీ: ताज महल) (ఉర్దూ: تاج محل ) అనే ఒక అద్భుతమైన సమాధి] భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. తాజ్ మహల్ (ఇంకా "తాజ్") |మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది, ఇది పర్షియా, భారతీయ మరియు ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది. 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చినదీ మరియు "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదాహరించింది అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది." తెల్లటి పాల రాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం, నిజానికి తాజ్ మహల్ ఒక మిశ్రమ సమన్వయ నిర్మాణం.
బోయపాటి శ్రీను తెలుగు సినిమా దర్శకుడు.బోయపాటి శ్రీనివాస్ రెండు నంది పురస్కారాలు మరియు రెందు "టిఎస్ఆర్ జాతీయ అవార్డులు" అందుకున్నడు . 2005 లో రవితేజ, మీరా జాస్మిన్,, మరియు ప్రకాష్ రాజ్ నటించిన భద్ర సినిమాతో శ్రీను దర్శకుడిగా పరిచయమయ్యాడు .తులసి తన రెండవ చిత్రం .2010 లో, శ్రీను యొక్క మూడవ సినిమా నందమూరి బాలకృష్ణ, నయనతార మరియు స్నేహ ఉల్లాల్ నటించిన సింహా విడుదల.2012 లో, అతను తన నాల్గవ చిత్రం ఎన్.టి.ఆర్., త్రిష, కార్తికా నాయర్ నటించిన దమ్మువిడుదలైనది.