The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
ది ప్యారడైజ్ 2026లో విడుదలకానున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి.
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ / ఆళ్ల నాని (1969 డిసెంబరు 30 - 2026 సెప్టెంబరు 15), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆళ్ల నాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.
అనంతిక సనిల్‌కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2020లో కరోనా సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం ప్రారంభించి 2022లో తెలుగు సినిమా రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత 2023లో విడుదలైన మ్యాడ్ సినిమాలో తన నటనతో విమర్శుకుల ప్రశంసలు అందుకుంది. అనంతిక సనిల్‌కుమార్ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.
సుప్రియ యార్లగడ్డ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటి, నిర్మాత. ఆమె 1996లో పవన్ కళ్యాణ్‌తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. ఆమె సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యురాలు కూడా.
అన్నదానం, అనేది రెండు పదాలతో రూపొందించబడింది,'అన్నం' అంటే ఆహారం, 'దానం' అంటే ఇవ్వడం లేదా దానం చేయడం. అన్నదానాన్ని వివిధ రకాల దానంలో 'మహాదానం' అంటారు.ప్రతి జీవికి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని ప్రాథమిక అంశాలు అవసరం. బట్టలు, ఆశ్రయం వంటి అంశాలు జీవన నాణ్యతను ప్రభావితం చేస్తున్నప్పటికీ, ఆహారం లేకపోతే జీవితమే లేదు.అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.
కొరియన్ కనకరాజు 2026లో విడుదలైన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 13న, ట్రైలర్‌ను ఆగష్టు 4న విడుదల చేసి, సినిమాను 2026 ఆగష్టు 7న విడుదల చేశారు.
రాధాష్టమి కృష్ణ భగవానుడి ప్రధాన భార్య రాధా దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని హిందూ ధార్మిక దినం). చాంద్రమాన మాసం (ఆగస్టు - సెప్టెంబర్) ప్రకాశవంతమైన (వ్యాక్సింగ్) సగం ఎనిమిదవ రోజున (అష్టమి) ఆమె జన్మస్థలం బర్సానా , మొత్తం బ్రజ్ ప్రాంతంలో జరుపుకుంటారు. కృష్ణ జన్మాష్టమి తర్వాత పదిహేను రోజుల తర్వాత రాధాష్టమి వస్తుంది.
వినాయకుడు, / గణపతి/విఘ్నేశ్వరుడు హిందూ దేవుళ్లల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుని స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయాలు ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు.
వినాయకుడు, లేదా గణేశుడు, వినాయక, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ వినాయకని ఆరాధించడం కద్దు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం ponnu pottan (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
డ్రింకర్ సాయి ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్' 2024లో విడుదలైన ప్రేమకథా సినిమా. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన ఈ సినిమాకు కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించాడు. ధర్మ కాకాని, ఐశ్వర్యశర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 15న, ట్రైలర్‌ను డిసెంబర్ 9న విడుదల చేయగా సినిమా డిసెంబర్ 27న విడుదలైంది.
హైదరాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలలో ఒకటైన ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖమైనది. పునర్విభజనకు పూర్వం ఈ నియోజకవర్గం జనాభా పరంగా, ఓటర్ల పరంగా రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉండేది. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా ఈ నియోజకవర్గం అనేక శాసనసభ నియోజకవర్గాలుగా విడిపోయింది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
హిందీ భాషా దినోత్సవం ను ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14న జరుపుకుంటారు. భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహద పడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున హిందీ భాషా దినోత్సవమును జరుపుకుంటారు.
ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
సింధు లోయ నాగరికత (సా.పూ 2500-1750) ప్రస్తుత భారత దేశం, పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా, సింధు నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాథమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.
ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 18న నిర్వహించబడుతుంది. నీరు పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న ఉద్ధేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.
తా భూమి – జలము – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర –సూర్య – నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను.భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ భగవానుడు తనంత తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునకే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుజు, సహస్ర శిర్షుడు! సగుణ బ్రహ్మం, అంగుష్ట మాతృడు, జగద్రక్షకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన అనంతనామనులు – అనంతరూపములు కలిగినై.
బోయి భీమన్న, సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్ తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే.
రాఘవ్ జుయల్ (జననం 10 జూలై 1991) భారతీయ నటుడు, నృత్యకారుడు, కొరియోగ్రాఫర్ & టెలివిజన్ ప్రెజెంటర్. స్లో మోషన్ శైలిలో తన సర్రియల్ డ్యాన్స్ మూవ్‌లకు & భారతదేశంలో స్లో మోషన్ వాక్‌ను తిరిగి ఆవిష్కరించినందుకు అతను "క్రోక్రోక్స్" లేదా "కింగ్ ఆఫ్ స్లో మోషన్" అని ప్రసిద్ధి చెందాడు. జీ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్ 3లో పోటీదారుగా, ఫైనలిస్ట్‌గా, డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్ 2, డాన్స్ కే సూపర్కిడ్స్లలో రాఘవ్ కే రాక్‌స్టార్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న తర్వాత గుర్తింపు పెరిగింది, అక్కడ అతని జట్టు అతని కెప్టెన్షిప్లో విజేతగా ప్రకటించబడింది.
ఎత్తైన దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ, చరిత్రలో శాతవాహన (230 BCE నుండి 220 CE వరకు), కాకతీయ (1083-1323), ముసునూరి నాయకుల (1326-1356), ఢిల్లీ సుల్తానేట్ బహమనీ సుల్తానేట్ (1347-1512), గోల్కొండ సుల్తానేట్ (1512-1687), అసఫ్ జాహీ రాజవంశం (1724-1950) మొదలైన రాజవంశీయుల పాలనలో ఉంది. 1724లో ముబారిజ్ ఖాన్‌ను ఓడించిన నిజాం-ఉల్-ముల్క్, హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత అతని వారసులు హైదరాబాదు నిజాములుగా చాలాకాలంపాటు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు.
విశ్వనాథ్ అండ్ సన్స్ 2026లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సూర్య, మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చ్ 16న, ట్రైలర్‌ను ఆగష్టు 7న విడుదల చేసి, సినిమాను ఆగష్టు 14న విడుదల అయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలు, 28 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పోలవరం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
ప్రీతి ముకుందన్ భారతీయ సినిమా నటి. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కథానాయికగా తెరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి సినిమాను మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన, ఈ సినిమా ఏప్రిల్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
తెలంగాణ పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా అసిఫ్ జాహిలు పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అఖిలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని రాజబహదూర్ గౌర్ ప్రకటించారు. ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు.