The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మద్య వ్యసనం అనేది మద్యాన్ని అధికంగా సేవించడం అని కూడా అంటారు, మద్య వ్యసనపరులు, వారి ఆరోగ్యంపై సంభవించే ప్రతికూల ప్రభావాలు మరియు అతని మరియు ఆమె జీవితంపై చెడు సామాజిక పరిణామాలతో సంబంధం లేకుండా మద్యాన్ని బలవంతంగా మరియు అత్యధికంగా తీసుకునే గుణం గల ఒక అశక్త వ్యసన క్రమరాహిత్యంగా చెప్పవచ్చు. ఇతర మత్తు మందు వ్యసనాలు వలె, మద్య వ్యసనాన్ని వైద్యపరంగా చికిత్స చేయగల వ్యాధి వలె పేర్కొంటారు. 19వ మరియు ప్రారంభ 20వ శతాబ్దాల్లో, మద్యాన్ని అధికంగా సేవించడం అనే వ్యాధిని తాగుడు పిచ్చి అని పిలిచేవారు, తర్వాత దీనిని మద్య వ్యసనం అనే పదంగా మార్చారు.
జపాన్ ( జపాన్ భాషలో నిప్పన్ లేదా నిహన్ 日本国 నిప్పన్-కోక్ అనేది తూర్పు ఆసియా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది చైనా, కొరియా, రష్యా దేశాలకు తూర్పు దిశగా ఉంది. జపాన్ దేశపు ఉత్తరాన ఉన్న సముద్ర భాగాన్ని ఓఖోట్స్క్ సముద్రం అని, దక్షిణాన్న ఉన్న సముద్ర భాగాన్ని తూర్పు చైనా సముద్రం అనీ అంటారు.
భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రం తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది.
విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం మరియు హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడ దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు .
2001 లో మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతమై, ప్రజాదరణ పొందిన వెబ్సైటులలో 2011 నాటికి 5వ స్థానంలో ఉ౦ది.
సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతి లోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం (scattering) చెంది (చెదిరి) మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ సిద్ధాంతీకరించారు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు.
భీంరావ్ రాంజీ అంబడ్కర్ (మరాఠీ : डॊ.भीमराव रामजी आंबेडकर ) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) "బాబాసాహెబ్" అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్ , చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాధలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న ను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాధ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.
సమ్మక్క సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా, తాడ్వాయి (వరంగల్ జిల్లా మండలం) మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. వరంగల్లు జిల్లా కేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములో తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కస్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, యావదాంద్ర దేశములోనే గాక అఖిల భారత దేశములోనే వనదేవతులుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
మూస:Science విజ్ఞానశాస్త్రం (Latin: scientia నుండి అర్థం "విజ్ఞానం") అనేది ప్రపంచం గురించి పరీక్షించదగిన వివరణలు మరియు భావి కథనాలు రూపంలో విజ్ఞానాన్ని రూపొందించే మరియు నిర్వహించే ఒక రంగం. నేటికి కూడా వాడుకలో ఉన్న ఒక పురాతన మరియు సమీప అర్థం ఏమిటంటే అరిస్టాటిల్ ప్రకారం, శాస్త్రీయ విజ్ఞానం అనేది తార్కికంగా మరియు హేతుబద్ధంగా వివరించగల విశ్వసనీయ విజ్ఞాన రంగం (కింది "చరిత్ర మరియు వ్యుత్పత్తి శాస్త్రం" విభాగం చూడండి ). ఒక రకం విజ్ఞానం వలె ప్రామాణిక పురాతనత్వ విజ్ఞాన శాస్త్రం అనేది తత్త్వ శాస్త్రానికి సమీప సంబంధాన్ని కలిగి ఉంది.
సుభాష్ చంద్రబోస్ (బెంగాలీ:সুভাষ চন্দ্র বসু) (జనవరి 23, 1897 ) నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
భూగోళం యొక్క వేడిమి అంటే భూమికి దగ్గరగా ఉన్న ఉపరితలము, దగ్గర లోనున్న సముద్రాలు, దాని చుట్టూ ఉన్న గాలి 20 వ శతాబ్దపు తొలి నాళ్ళ నుండి వేడెక్కడం మొదలై అది ఇక ముందు కూడా కొనసాగుతుందన్న అంచన.గత శతాబ్దం నుండి భూగోళ ఉపరితలం 0.74 ± 0.18 °C (1.33 ± 0.32 °F) వరకు వేడెక్కింది.[6] 20 వ శతాబ్దపు మధ్య కాలంలో అడవులను నరికి వేయడం వలన, శిలాజపు ఇంధనాల వినియోగం వలన భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడంలో ప్రధాన పాత్రను పోషించాయని శీతోష్ణ స్థితి మార్పులపై ఏర్పాటైన అంతర ప్రభుత్వ విభాగం (ఐపిసిసి) తెలిపింది. ఐపిసిసి ఇంకా ఈ విధమైన తీర్మానాలు కూడా చేసింది. అవి ఏమిటంటే సహజ జీవన శైలి అనగా సూర్య రశ్మి ధార్మికత, అగ్ని పర్వతాల నుండి వెలువడే లావాలు, 1950 కాలం కన్నా ముందున్న పారిశ్రామిక యుగం కంటె ఎక్కువగా ఈ భూమిని వేడేక్కించాయని తీర్మానించారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (నవంబరు 19, 1828 – జూన్ 17, 1858) (హిందీ- झाँसी की रानी మరాఠీ- झाशीची राणी), మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం లో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన లో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు.
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment)ను కలుషితం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును. వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth )పై నున్న జీవరాశులకు అనుకూలమైనది.
ఇందిరా ప్రియదర్శిని గాంధీ (హిందీ: इन्दिरा प्रियदर्शिनी गान्धी)(Indira Priyadarshini Gandhi) (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది.
ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పోతుంది. ఇది సహజ ప్రక్రియ. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కలిగించడం, లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని స్వయంతృప్తి /హస్త ప్రయోగం (ఆంగ్లం: మాస్టర్బేషన్) అంటారు.
1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర దామొదర్దాస్ మోడి (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారత దేశంకి ప్రస్త్తత ప్రధాని. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగినారు. 2001లో కేశూభాయి పటేల్ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి.
మొదట అంతర్జాతీయ మహిళా శ్రామికమహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమలగురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటన గా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు యూరప్, రష్యా మరియు పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (1923 మే 28 - 1996 జనవరి 18) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
శివాజీ రాజా (ఫిబ్రవరి 27 1972) ఒక ప్రముఖ తెలుగు నటుడు. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన నాటిక 'కళ్ళు' ఆధారంగా రూపొందిన 'కళ్ళు' చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు.
This article incorporates information from this version of the equivalent article on the English Wikipedia. ఆల్బర్ట్ ఐన్స్టీన్( pronounced /ˈælbərt ˈaɪnstaɪn/[3]; జర్మన్: [ˈalbɐt ˈaɪ̯nʃtaɪ̯n] [4]; 14 మార్చ్ 1879 – 18 ఏప్రిల్ 1955) జర్మనీ-లో పుట్టిన, జ్యుఇష్, 20 వ శతాబ్దానికి చెందిన సైద్ధాంతిక భౌతికవేత్త .ఇతని పేరుతో విలసిల్లిన శాఖలు: ప్రత్యేక సాపేక్షతా వాదము , సాధారణ సాపేక్షతా వాదము . ఆయన ముఖ్యంగా గణాంక యాంత్రిక శాస్త్రం, అతని వ్యవహారవిధానం బ్రోవ్నియన్ మోషన్ తో, మూల పదార్థాలను విడదీసే స్పెసిఫిక్ హీట్స్ మీద ఆయన విరోధాభావము, ఇంకా అస్థిరతకు వ్యాపించటానికి మధ్యనున్న సంబంధాన్ని చక్కగా వివరించగలిగాడు.
హైదరాబాదు, తెలంగాణ రాజధాని మరియు ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని, హైదరాబాదు జిల్లా మరియు రంగారెడ్డి జిల్లాల ముఖ్యపట్టణం . దీనిని భాగ్యనగరము అని కూడా పిలుస్తారు. హైదరాబాదు నగరము సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు, దేవాలయములకు, చక్కని కళలకు, హస్తకళలకు మరియు నాట్యానికి ప్రసిద్ధి.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము, శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్నది.
జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్ (మూస:Ur4 జలాల్ ఉద్దీన్ ముహమ్మద్ అక్బర్ ), అక్బర్ ద గ్రేట్ గా కూడా ప్రసిద్దుడు. (నవంబర్ 23, 1542 - అక్టోబర్ 27, 1605). పుట్టినప్పుడు, బద్రుద్దీన్ ముహమ్మద్ అక్బర్ గా ఉన్న అతని పేరు జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ గా మార్చబడింది మరియు అతను పుట్టిన తేది ఆధికారికంగా అక్టోబర్ 15, 1542 కి మార్చబడింది.
సౌర ఘటం అనేది కాంతివిపీడన ప్రభావం ద్వారా సూర్యకాంతి శక్తిని నేరుగా విద్యుత్తుగా మార్చే పరికరం చెప్పవచ్చు. కొన్నిసార్లు సౌర ఘటం అనే పదం ప్రత్యేకంగా సూర్య ఫలకాలు మరియు సూర్య ఘటాలు వంటి సూర్యకాంతి నుండి శక్తిని సంగ్రహించే పరికరాలు కోసం ప్రత్యేకించబడింది, అయితే కాంతివిపీడన ఘటం అనే పదాన్ని ఉపయోగిస్తున్న కాంతి వనరు తెలియనప్పుడు ఉపయోగిస్తారు. ఘటాల కూర్పును సౌర ఫలకాలు, సౌర వ్యవస్థలు లేదా కాంతివిపీడన శ్రేణుల తయారీలో ఉపయోగిస్తారు.
భారతదేశం యొక్క రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం ఇరవై-తొమ్మిది రాష్ట్రములు మరియు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన ఒక సంయుక్త రాష్ట్ర కూటమి. ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలుగా పునర్విభజించబడ్డాయి.
సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి. సరోజినీ దేవి 1935 డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెష్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు కూడా.
సింధు లోయ నాగరికత (క్రీ.పూ2700 - క్రీ.పూ.1750) ప్రస్తుత పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది.
అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.