The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రం తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది.
2001 లో మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతమై, ప్రజాదరణ పొందిన వెబ్సైటులలో 2011 నాటికి 5వ స్థానంలో ఉ౦ది.
విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం మరియు హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడ దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు .
కాల్సియం నైనమిడ్ ఒక రసాయన సంయోగ పదార్ధం.ఇది ఒక అసేంద్రియ,కర్బనయుత రసాయన సంయోగ పదార్ధం.కాల్సియం,కార్బన్,మరియు నైట్రోజన్ మూలక పరమాణువుల సంమ్మేలనం వలన కాల్సియం నైనమిడ్ సంయోగ పదార్ధంఏర్పడినది.కాల్సియంనుండి ఉత్పాదింపబడిన సైనమిడ్((CN22-)ను రసాయనిక ఎరువుగా ఉపయోగిస్తారు.కాల్సియం నైనమిడ్ ను వాణిజ్య పరంగా నైట్రోలైము(nitrolime)అందురు.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాధలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న ను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాధ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.
యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా
నందమూరి తారక రామారావు 50 సంవత్సరాలపైగా తెలుగు సినిమా రంగంలో కథా నాయకునిగా రాణించాడు. ఆయన నటించిన సిమాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది.
భీంరావ్ రాంజీ అంబడ్కర్ (మరాఠీ : डॊ.भीमराव रामजी आंबेडकर ) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) "బాబాసాహెబ్" అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్ , చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త.
ఈస్టర్ (మూస:Lang-el హిబ్రూ భాషలో పస్ఖా ,: פֶּסַח పెసఖ్, నుండి) క్రైస్తవుల ప్రార్థనా పరమైన సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ. క్రైస్తవ గ్రంథాలను బట్టి, క్రీస్తు శిలువవేయబడిన తరువాత తన మరణం నుండి మూడవ దినమున పునరుత్థానం చెందాడు. కొంతమంది క్రైస్తవులు ఈ పునరుత్థానం ఈస్టర్ దినము లేదా ఈస్టర్ ఆదివారం (పునరుత్థాన దినము లేదా పునరుత్థాన ఆదివారం అనికూడా) గుడ్ ఫ్రైడే తరువాత రెండు రోజుల పిమ్మట మరియు మౌన్డి గురువారం గడచిన మూడురోజుల తరువాత జరుపుకుంటారు.
అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు
అక్కినేని నాగేశ్వరరావు 1941 నుండి 2014 (72 సంవత్సరాలు) మధ్య కాలంలో 256 తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటించారు. వీరు నటించిన పూర్తి సినిమాల జాబితా క్రింద ఇవ్వబడినది.
ఇందిరా ప్రియదర్శిని గాంధీ (హిందీ: इन्दिरा प्रियदर्शिनी गान्धी)(Indira Priyadarshini Gandhi) (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది.
యేసు (Jesus) (క్రీ.పూ 0 నుండి క్రీ.శ 26–36 వరకు) నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన పేరిట పౌలు గారిచే అంతియొకయలో యేసు వారి శిష్యలకు క్రైస్తవులు అనే పేరు పెట్టరు. ఈయన యేసు క్రీస్తుగా కూడ వ్యవహరించబడతాడు. క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు")నుండి పుట్టింది.ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానం.
గ్రీకు అక్షరం ఇక్కడ పునర్నిర్దేశం చేస్తుంది. గ్రీకు అక్షరాలను ఉపయోగించి కొన్ని సంస్థల పేర్లు పెట్టబడినాయి, సమాజాలు మరియు మహిళా సంఘాలు చూడండి. క్రీస్తుపూర్వం తొమ్మిదవ శతాబ్దం చివర లేదా ఎనిమిదవ శతాబ్ద ప్రారంభం నుండి గ్రీకు వర్ణమాల లో గ్రీకు భాష వ్రాయడానికి మొత్తం ఇరవై-నాలుగు అక్షరాల సమితి వాడబడుతోంది.
గోదావరి నది భారత దేశము లో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజమబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతము లో సంగమిస్తుంది.
విజయనగర సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావనియెల్లా తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము.
గుడ్ ఫ్రైడే క్రీస్తును శిలువ వెయ్యటం మరియు కల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాధమికంగా ఒక సెలవు దినం. ఈ సెలవు దినం పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది మరియు తరచుగా పాసోవర్ పై యూదుల అభిప్రాయంతో సరిపోలుతుంది.
కాండ్రేగుల జోగిపంతులు క్రీ.శ 1760 వ దశాబ్దం లో మచిలీబందరు (ఇప్పటి కృష్ణాజిల్లాలోని మచిలీపట్టణం ) లో దుభాషి (ద్విభాషికి పర్యాయపదము) గా పెద్ద పలుకు బడిగల పదవిలో పనిచేసి దివిసీమ లో కొన్ని వూళ్లలో హవేలీభూమూలు ను జాగీరులుగా పొందిన ప్రముఖుడు. క్రీ.శ 1762 నవంబరు నుండీ 1766 ఆగస్టు వరకూ బందరులో ఆంగ్ల వర్తక కంపెనీ ముఖ్యసభ్యుడైన (chief in council) జాన్ ఫయిబస్(John Phybus) అను దొరగారికి జోగిపంతులు గారు సొంత స్వదుభాషి (personal Dubhashi)గా వ్యవహరించేవారు. దొరగారి తరఫున హైదరాబాదు నవాబు గారితో రాయబారము జరిపేవారు.
అంగస్తంభన (Penile erection) అనగా పురుషాంగం పరిమాణంలో పెద్దదిగా మరియు గట్టిగా తయారౌతుంది. శరీర ధర్మశాస్త్రం ప్రకారం ఈ క్లిష్టమైన ప్రక్రియలో మానసిక, నాడీ మండలం, రక్తనాళాలు మరియు వినాళగ్రంధులు విశేషమైన పాత్ర పోషిస్తాయి. ఎక్కువమందిలో ఇది శృంగార భావాల మూలంగా జరుగుతుంది అయితే మూత్రాశయం నిండుగా ఉన్నప్పుడు కూడా అంగం స్తంభించవచ్చును.
హిందూమతం లేదా హిందూ ధర్మం (Hinduism or Hindu Dharma) భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది. పూర్వకాలమునందు భారతదేశమున ఏది ధర్మ నామముతో వ్యవహరింపబడినదో, అదియే ఇపుడు మత మను పేరుతో వాడబడుచున్నది.ధర్మము అనగా ఆచరణీయ కార్యము.మత మనగా అభిప్రాయము .
ఝాన్సీ లక్ష్మీబాయి (నవంబరు 19, 1828 – జూన్ 17, 1858) (హిందీ- झाँसी की रानी మరాఠీ- झाशीची राणी), మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం లో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన లో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు.
కాల్సియం హైపోక్లోరైట్ఒక రసాయన సమ్మేళన పదార్ధం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్ధం.కాల్సియం,క్లోరిన్ మరియు ఆక్సిజన్ మూలకాల పరమాణువుల సంయోగం వలన కాల్సియం హైపోక్లోరైట్ రసాయన సమ్మేళనపదార్ధం ఏర్పడినది.కాల్సియం హైపోక్లోరైట్ రసాయన సమ్మేళన పదార్ధం యొక్క రసాయన సంకేతపదం Ca(ClO)2.సున్నం మరియు కాల్సియం క్లోరైడ్ లమిశ్ర మైన ఈ రసాయన సంయోగ పదార్థాన్ని విపణి వీధిలో క్లోరిన్ పొడి లేదా విరంజన చూర్ణం(bleaching powder)అను పేరున అమ్మబడుచున్నది.దీనిని నీటిని శుద్దికరణప్లాంటు లలో బ్లీచింగ్ కారకం గా ఉపయోగిస్తారు.సోడియం హైపోక్లోరైట్ కన్న కాల్సియం హైపోక్లోరైట్ ఎక్కువ స్థిరమైనది మరియు ఎక్కువ ప్రమాణంలో క్లోరిన్ ను కలిగి ఉన్నది.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పని చేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడు గా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిఙ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.
ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పోతుంది. ఇది సహజ ప్రక్రియ. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కలిగించడం, లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని స్వయంతృప్తి /హస్త ప్రయోగం (ఆంగ్లం: మాస్టర్బేషన్) అంటారు.
ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (Sachin Ramesh Tendulkar) (Hindi: सचिन रमेश तेंदुलकर). క్రికెట్ క్రీడకు భారతదేశం లో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. 16-నవంబర్-2013 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు ప్రకటించింది.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము, శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్నది.
1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర దామొదర్దాస్ మోడి (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారత దేశంకి ప్రస్త్తత ప్రధాని. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగినారు. 2001లో కేశూభాయి పటేల్ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 400 B.C లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కధ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
హైదరాబాదు, తెలంగాణ రాజధాని మరియు ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని, హైదరాబాదు జిల్లా మరియు రంగారెడ్డి జిల్లాల ముఖ్యపట్టణం . దీనిని భాగ్యనగరము అని కూడా పిలుస్తారు. హైదరాబాదు నగరము సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు, దేవాలయములకు, చక్కని కళలకు, హస్తకళలకు మరియు నాట్యానికి ప్రసిద్ధి.
బెల్జియం రాజ్యం /ˈbɛldʒəm/ అనేది ఉత్తర పడమర ఐరోపా ఖండంలోని ఒక దేశం. యురోపియన్ సమాఖ్య యొక్క స్థాపక సభ్యత్వం మరియు దాని ముఖ్య కార్యాలయమును కలిగిఉంది, అలానే మిగిలిన అతిపెద్ద అంతర్జాతీయ సంస్థలవి కూడా కలిగి ఉంది, దీనిలో NATO కూడా ఉంది.[4] బెల్జియం మొత్తం విస్తీర్ణం 30528 చదరపు కిలోమీటర్లు మరియు జన సంఖ్య 10.7మిల్లియన్లు ఉంది. జర్మనీయుల మరియు లాటిన్ యురోపీయుల మధ్య కల సాంస్కృతిక హద్దుకు అడ్డంగా ఉండి రెండు ముఖ్య భాషా సమూహాలైన ఫ్లెమిష్ ఇంకా ఫ్రెంచ్ మాట్లాడే ఎక్కువగా వాల్లోన్లు మరియు జర్మన్ మాట్లాడే చిన్న సమూహానికి బెల్జియం నిలయంగా ఉంది.
రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రాల్లో విభజించు, పాలించు (లేదా విభజించు, ఓడించు, లాటిన్ లో డివైడ్ ఎట్ ఇంపెరా(dīvide et īmpera)) అంటే అతిపెద్ద అధికార కేంద్రాన్ని చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టి చిన్న చిన్న విభాగాలు మొత్తం ఏక కేంద్రం కన్నా బలహీనం అయ్యాకా అధికారం, శక్తి సాధించడం, దాన్ని నిలబెట్టుకోవడం. ఈ యుక్తి ప్రస్తుతం నెలకొన్న అధికార క్రమాన్ని విచ్ఛిన్నపరిచి, ప్రత్యేకించి తద్వారా ఏర్పడ్డ చిన్న చిన్న శక్తులు ఒకదానితో మరొకటి కలిసి బలపడకుండా నిరోధించడం, ప్రజలు, గుంపుల మధ్య శత్రుత్వాలు ఏర్పరిచి వారిని విభజించడం వంటివాటిని కలిగివుంటుంది. ఇటాలియన్ రచయిత ట్రైయనో బొకాలిని లా బిలన్సియా పొలిటికా గ్రంథంలో డివైడ్ ఎట్ ఇంపెరా (విభజించి పాలించు) అన్నది రాజకీయాల్లో సాధారణ సూత్రమని పేర్కొన్నారు.
సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అనాదిగా ప్రదర్శనమౌతున్న కళారూపాలు నాటకాలు, నృత్యాలు, కథాకాలక్షేపాలు, బొమ్మలాటలు, కవితలు వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి, ఒకే మారు లక్షలాది ప్రేక్షకులముందుంచగల అపూర్వ సృష్టి సినిమా. ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమయ్యింది.
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు.
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.
మానసిక శాస్త్రము (ఆంగ్లం : Psychology సైకాలజీ) (గ్రీకు: Ψυχολογία, సాహిత్యపరంగా "మనో వైజ్ఞానిక శాస్త్రము" లేదా "మానసిక శాస్త్రము" లేదా "మనో ధర్మశాస్త్రము". గ్రీకు భాషలో ψυχή "సైక్" (psykhē) అనగా "శ్వాస, ఆత్మ, మనస్సు" అని, λογία -లాజియా అనగా "శాస్త్రము" అని అర్థం. ) ఇదొక అకాడమిక్ మరియు అప్లైడ్ విద్య, ఇందులో శాస్త్రీయ పరంగా, మనో విధానం మరియు ప్రవర్తనల అధ్యయనం ఉంటుంది.
దేశాల జాబితా – సంపద (ఆదాయం, జన విస్తరణ) క్రమంలో
వివిధ దేశాల జిడిపి మరియు ఇతర జనవిస్తరణా సూచికలు (List of countries by GDP demographics comparison). దేశం పేరుకు ఎడమ వైపున వివిధ అంశాల సూచికలలో ఆ దేశం ర్యాంకు, కుడి వైపున ఆ సూచికల విలువలు ఇవ్వబడ్డాయి. ఒకో కాలమ్ శీర్షిక పక్కన ఉన్న 'పెట్టె'ను క్లిక్ చేయడం ద్వారా పట్టిక క్రమాన్ని మార్చవచ్చును (Re-sort the table).
కూచిపూడి నృత్యము, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక భారతీయ నాట్యం. ఇది కృష్ణా జిల్లా లో దివి తాలూకాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించినది. క్రీ పూ 2వ శతాబ్దం లో ఆంధ్ర చారిత్రాత్మక నగరమైన శ్రీకాకుళం కు సుమారు 450 కిలోమీటరుల దూరంలో బంగాళాఖాతము పై ఉన్న ఈ ప్రాంతము లోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించటంతో దీనికి ఈ పేరు వచ్చినది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950, ఏప్రిల్ 20 వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంకు తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రి గా పనిచేసిన చంద్రబాబు,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభాజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రస్తుతం భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. చంద్రబాబు అనేక పర్యాయాలు దేశరాజకీయాలలో చక్రం తిప్పి తనదైన ఉనికిని చాటిచెప్పాడు.