The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రం తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది.
భీంరావ్ రాంజీ అంబడ్కర్ (మరాఠీ : डॊ.भीमराव रामजी आंबेडकर ) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) "బాబాసాహెబ్" అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్ , చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త.
2001 లో మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతమై, ప్రజాదరణ పొందిన వెబ్సైటులలో 2011 నాటికి 5వ స్థానంలో ఉ౦ది.
విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం మరియు హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడ దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు .
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్‌కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాధలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న ను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాధ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (నవంబరు 19, 1828 – జూన్ 17, 1858) (హిందీ- झाँसी की रानी మరాఠీ- झाशीची राणी), మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం లో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన లో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 400 B.C లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కధ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
బిస్మత్ ఆక్సీక్లోరైడ్ ఒక రసాయన సంయోగ పదార్ధం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్ధం.బిస్మత్,ఆక్సిజన్,మరియు క్లోరిన్ పరమాణువుల సంయోగం వలన ఈ సమ్మేళనపదార్థ మేర్పడినది.బిస్మత్ ఆక్సీక్లోరైడ్ యొక్క రసాయన సంకేత పదం BiOCl.ఈ సంయోగ పదార్థం ను పురాతన కాలం నుండి,పురాతన ఇజిప్టుచరిత్ర కాలంనుండి మానవుడు ఉపయోగించిన దాఖాలాలు ఉన్నాయి.
సుభాష్ చంద్రబోస్ (బెంగాలీ:সুভাষ চন্দ্র বসু) (జనవరి 23, 1897 ) నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఆంధ్రతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పరచినపుడు, తెలంగాణా ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న కోరిక ప్రజల్లో ఉండేది. అయితే అధిక సంఖ్యాక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉండటంతో ఇది సాధ్యపడలేదు. అయితే, తెలంగాణా సర్వతోముఖాభివృద్ధికి ప్రతిబంధకాలు ఏర్పడకుండా ఒక ఒప్పందం కుదుర్చుకున్న తరువాతే వారు సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించారు.
ఇందిరా ప్రియదర్శిని గాంధీ (హిందీ: इन्दिरा प्रियदर्शिनी गान्धी)(Indira Priyadarshini Gandhi) (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది.
డెబ్భై అయిదు సంవత్సరాలకి పైబడిన తెలుగు సినీ చరిత్రలో ఎందరో నటీమణులు తమ అంద చందాలతో, నటనా వైదుష్యంతో వెండితెరపై వెలుగులు విరజిమ్మారు. ఈ క్రింది జాబితాలో వారి పేర్లు పొందుపరచబడ్డాయి. వీరిలో కొందరు దశాబ్దాలుగా చిత్రరంగంలో రాణిస్తూ వందల కొద్దీ సినిమాలలో నటించినవారు, మరికొందరు ఒకటి రెండు చిత్రాలతోనే కనుమరుగయినవారు.
తెలుగు-తెలుగు నిఘంటువు (ఆంగ్లం: Telugu-Telugu Dictionary) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు అకాడమి వారు ప్రచురించిన నిఘంటువు. తెలుగు అకాడమి వారు తెలుగు భాషకు ఒక సమగ్ర నిఘంటువు ప్రచురించాలనే లక్ష్యంతో "తెలుగు శబ్ద సాగరం" అనే పేరిట ఒక బృహన్నిఘంటువు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిఘంటువు నుంచి దాదాపు 65,000 ఆరోపాలు ఎంపిక చేసి కళాశాల స్థాయి విద్యార్ధుల కోసం తెలుగు-తెలుగు నిఘంటువు పేరిట ఒక చిన్న నిఘంటువును ముందుగా ప్రచురించాలని అకాడమి సంకల్పించింది.
హైదరాబాదు, తెలంగాణ రాజధాని మరియు ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని, హైదరాబాదు జిల్లా మరియు రంగారెడ్డి జిల్లాల ముఖ్యపట్టణం . దీనిని భాగ్యనగరము అని కూడా పిలుస్తారు. హైదరాబాదు నగరము సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు, దేవాలయములకు, చక్కని కళలకు, హస్తకళలకు మరియు నాట్యానికి ప్రసిద్ధి.
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.
గోదావరి నది భారత దేశము లో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజమబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతము లో సంగమిస్తుంది.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము, శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్నది.
ముద్రారాక్షసం విశాఖదత్తుడు రచించిన సంస్కృత చారిత్రక నాటకం. భారతదేశ చక్రవర్తిగా చంద్రగుప్త మౌర్యుడు రాజ్యం చేపట్టాకా జరిగిన రాజకీయపు ఎత్తుగడలను, పరిణామాలను నాటకం చిత్రీకరించింది. నందవంశాన్ని చాణక్యుని నీతి చతురత సహాయంతో నిర్మూలించి చంద్రగుప్తుడు పాటలీపుత్రాన్ని పరిపాలిస్తున్న నేపథ్యంలో నాటకం ప్రారంభం అవుతుంది.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (1923 మే 28 - 1996 జనవరి 18) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
గుదద్వారములో (గుదము, ముడ్డి)లో సంభోగం జరపడాన్ని గుద మైథునం లేదా గుదరతి అంటారు. ఈ రకమైన సంభోగంలో ఎక్కువగా స్వలింగసంపర్కులు పాల్గొన్నా, ఈ మథ్యకాలంలో చాలామంది బార్యా-భర్తలు కూడా ఈ రకమయిన సంభోగం (గుద మైథునం) ద్వారా భావప్రాప్తి చెందుతున్నట్టు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ఇదివరకు మగవారు మాత్రమే ఈ తరహా సంభోగం ద్వారా సుఖ పడతారని అనే అపోహ ఉండేది.
ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయము తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది.
ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పోతుంది. ఇది సహజ ప్రక్రియ. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కలిగించడం, లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని స్వయంతృప్తి /హస్త ప్రయోగం (ఆంగ్లం: మాస్టర్బేషన్) అంటారు.
కొలెస్ట్రాల్ అనేది కణ త్వచములలో కనుగొనబడి అన్ని జంతువుల రక్తపు ప్లాస్మాలో రవాణా అయ్యే ఒక మైనపు ఉత్ప్రేరక జీవప్రక్రియపదార్ధం.[3] ఇది క్షీరదాల కణ త్వచాల యొక్క ముఖ్యమైన నిర్మాణ అంశం, ఇది అక్కడ సరిఅయిన త్వచ పారగమ్యత మరియు ద్రవత్వములను స్థాపించటానికి అవసరమవుతుంది. దానికి తోడు, కొలెస్ట్రాల్, పైత్య రసాలు, ఉత్ప్రేరక హార్మోన్లు, మరియు కొవ్వులో కరిగే అనేక విటమిన్ల తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. కొలెస్ట్రాల్, జంతువుల చేత ఉత్పత్తి చేయబడే ప్రధాన స్టెరాల్, కానీ మొక్కలు మరియుబూజు వంటి ఇతర యూకార్యోట్స్ లో తక్కువ పరిమాణంలో తయారవుతుంది.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పని చేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడు గా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిఙ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.
రిచర్డ్ మాథ్యూ స్టాల్మన్ (మార్చి 16, 1953 న జన్మించారు) ఇతడు ఒక అమెరికన్ సాఫ్టువేర్ స్వేచ్ఛ కార్యకర్త మరియు కంప్యూటర్ ప్రోగ్రామర్. 1983 సెప్టెంబరులో, అతను యునిక్స్-వంటి ఒక ఉచిత కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థను సృష్టించుటకై గ్నూ పరియోజనను ప్రారంభించాడు. గ్నూ పరియోజన ప్రారంభంతో పాటుగా, ఫ్రీ సాఫ్టువేర్ ఉద్యమాన్ని కూడా ఆరంభించాడు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950, ఏప్రిల్ 20 వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంకు తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రి గా పనిచేసిన చంద్రబాబు,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభాజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రస్తుతం భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. చంద్రబాబు అనేక పర్యాయాలు దేశరాజకీయాలలో చక్రం తిప్పి తనదైన ఉనికిని చాటిచెప్పాడు.
శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.
దేశాల జాబితా – సంపద (ఆదాయం, జన విస్తరణ) క్రమంలో
వివిధ దేశాల జిడిపి మరియు ఇతర జనవిస్తరణా సూచికలు (List of countries by GDP demographics comparison). దేశం పేరుకు ఎడమ వైపున వివిధ అంశాల సూచికలలో ఆ దేశం ర్యాంకు, కుడి వైపున ఆ సూచికల విలువలు ఇవ్వబడ్డాయి. ఒకో కాలమ్ శీర్షిక పక్కన ఉన్న 'పెట్టె'ను క్లిక్ చేయడం ద్వారా పట్టిక క్రమాన్ని మార్చవచ్చును (Re-sort the table).
మూస:Infobox German location కొలోన్ (German: Köln, pronounced [ˈkœln] ( ); కోల్స్స్చ్ ఉచ్ఛరణ: కోల్ మూస:IPA2) జర్మనీ యొక్క నాల్గవ-అతిపెద్ద నగరం (బెర్లిన్, హాంబర్గ్ మరియు మ్యూనిచ్ తరువాత ఇది ఉంది), మరియు ఇది పెద్ద నగరంగా నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా యొక్క జర్మన్ సమాఖ్య రాష్ట్రం మరియు రైన్-రుహ్ర్ మెట్రోపాలిటన్ ఏరియాలో ఉంది, పది మిలియన్ల కన్నా ఎక్కువ మందిని కలిగి ఉన్న అతిపెద్ద ఐరోపా మహానగర ప్రాంతాలలో ఇది ఒకటి. జర్మనీలోని అతిపురాతనమైన నగరాలలో ఒకటి, దీనిని ఉబి క్రీపూ 38లో స్థాపించారు. ఈ పేరును రోమన్ జనవాసం కొలోనియా క్లాడియా అరా అగ్రిప్పీనెన్సియం నుండి పొందబడింది.
భూగోళం యొక్క వేడిమి అంటే భూమికి దగ్గరగా ఉన్న ఉపరితలము, దగ్గర లోనున్న సముద్రాలు, దాని చుట్టూ ఉన్న గాలి 20 వ శతాబ్దపు తొలి నాళ్ళ నుండి వేడెక్కడం మొదలై అది ఇక ముందు కూడా కొనసాగుతుందన్న అంచన.గత శతాబ్దం నుండి భూగోళ ఉపరితలం 0.74 ± 0.18 °C (1.33 ± 0.32 °F) వరకు వేడెక్కింది.[6] 20 వ శతాబ్దపు మధ్య కాలంలో అడవులను నరికి వేయడం వలన, శిలాజపు ఇంధనాల వినియోగం వలన భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడంలో ప్రధాన పాత్రను పోషించాయని శీతోష్ణ స్థితి మార్పులపై ఏర్పాటైన అంతర ప్రభుత్వ విభాగం (ఐపిసిసి) తెలిపింది. ఐపిసిసి ఇంకా ఈ విధమైన తీర్మానాలు కూడా చేసింది. అవి ఏమిటంటే సహజ జీవన శైలి అనగా సూర్య రశ్మి ధార్మికత, అగ్ని పర్వతాల నుండి వెలువడే లావాలు, 1950 కాలం కన్నా ముందున్న పారిశ్రామిక యుగం కంటె ఎక్కువగా ఈ భూమిని వేడేక్కించాయని తీర్మానించారు.
జ్యోతీరావ్ ఫులే లేదా జ్యోతీబా గోవిందరావ్ ఫులే (ఆంగ్లం : Jotiba Govindrao Phule) (మరాఠీ: जोतीबा गोविंदराव फुले ) (జననం ఏప్రిల్ 11, 1827 - మరణం నవంబరు 28, 1890), మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త. థామస్ పెయిన్ రాసిన రైట్స్ ఆఫ్ మాన్ ఆయన్ని చాలా ప్రభావితం చేసింది. ఇతడు స్త్రీలకు విద్య నిషేధమని ప్రవచించిన మనుస్మృతిని తిరస్కరించాడు.