The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రం తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది.
న్యాయ శాస్త్రం మరియు అర్థ శాస్త్రం ప్రకారం ఆపద వలన సంభవించే నష్టాన్ని నివారించేందుకు ప్రాథమికంగా ఉపయోగించే ఆపద నిర్వహణి, బీమా అంటారు. బీమా అనే దాన్ని ప్రీమియంకు బదులుగా ఒక సంస్థ యొక్క నష్టాన్ని మరొక సంస్థకు సమానంగా బదిలీ చేసేదిగా నిర్వచించవచ్చు. భారీగా వచ్చే నష్టాన్ని నివారించేందుకు చిన్న నష్టంతో సరిచేస్తుంది.
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.
2001 లో మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతమై, ప్రజాదరణ పొందిన వెబ్సైటులలో 2011 నాటికి 5వ స్థానంలో ఉ౦ది.
విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం మరియు హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడ దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు .
భీంరావ్ రాంజీ అంబడ్కర్ (మరాఠీ : डॊ.भीमराव रामजी आंबेडकर ) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) "బాబాసాహెబ్" అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్ , చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాధలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న ను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాధ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.
కొసరాజు రాఘవయ్య చౌదరి వ్రాసిన సినిమా పాటల జాబితా
ఈ క్రింది పట్టికలో కొసరాజు రాఘవయ్య చౌదరి తెలుగు సినిమాల కోసం రచించిన పాటలు, పద్యాలు,దండకాలు, యక్షగానాలు, హరికథలు, బుర్రకథల వివరాలు ఉన్నాయి.
పిఎస్ఎల్వి-సీ33 ఉపగ్రహ వాహకనౌక
పిఎస్ఎల్వి-సీ33 ఉపగ్రహ వాహకనౌక ను భారతీయ అంతరిక్ష ప్రయోగ సంస్థ,క్లుప్తంగా ఇస్రో అని పిలువబడుతున్న భారతదేశపు ప్రతిష్టాత్మకపు సంస్థ రూపొందించిన ఉపగ్రహ వాహక/ప్రయోగ నౌక.ఈ వాహకనౌక ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని క్షక్యలోకి పంపుటకు నిర్ణయించడమైనది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాల వరుసలో ఆఖరు ఏడవ ఉపగ్రహం. ఇప్పటికి వరకు ఈ సిరీస్లో వరుసగా ఆరు ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో నిర్దేశిత పరిబ్రమణ క్షక్ష్యలో ప్రవేశపెట్టారు.ఈఈ ఆరు ఉపగ్రహాలను ఆంధ్రప్రదేశ్ రాష్తంలోని,పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న సతిష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంనుండి ప్రయోగించారు.
హిందూమతం లేదా హిందూ ధర్మం (Hinduism or Hindu Dharma) భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది. పూర్వకాలమునందు భారతదేశమున ఏది ధర్మ నామముతో వ్యవహరింపబడినదో, అదియే ఇపుడు మత మను పేరుతో వాడబడుచున్నది.ధర్మము అనగా ఆచరణీయ కార్యము.మత మనగా అభిప్రాయము .
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (1923 మే 28 - 1996 జనవరి 18) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
చెన్నై - రామేశ్వరం సేతు ఎక్స్ప్రెస్
చెన్నై - రామేశ్వరం సేతు ఎక్స్ప్రెస్ భారతీయ రైల్వేలు నందు ఒక ఎక్స్ప్రెస్ రైలు. ఇది చెన్నై రైల్వే స్టేషను మరియు రామేశ్వరం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది, ఈ ఎక్స్ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 16713 చెన్నై - రామేశ్వరం సేతు ఎక్స్ప్రెస్ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.
సుభాష్ చంద్రబోస్ (బెంగాలీ:সুভাষ চন্দ্র বসু) (జనవరి 23, 1897 ) నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి. సరోజినీ దేవి 1935 డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెష్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు కూడా.
గుదద్వారములో (గుదము, ముడ్డి)లో సంభోగం జరపడాన్ని గుద మైథునం లేదా గుదరతి అంటారు. ఈ రకమైన సంభోగంలో ఎక్కువగా స్వలింగసంపర్కులు పాల్గొన్నా, ఈ మథ్యకాలంలో చాలామంది బార్యా-భర్తలు కూడా ఈ రకమయిన సంభోగం (గుద మైథునం) ద్వారా భావప్రాప్తి చెందుతున్నట్టు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ఇదివరకు మగవారు మాత్రమే ఈ తరహా సంభోగం ద్వారా సుఖ పడతారని అనే అపోహ ఉండేది.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము, శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్నది.
ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహంను భారతదేశపు ప్రతిష్తాత్మక మైన అంతరిక్ష ప్రయోగ సంస్థ క్లుప్తంగా ఇస్రో రూపకల్పన చేసి తయారు చేసినది. అంతరిక్షం నుండి జలయాన, భూయాన మరియు ఆకాశ/వాయుయాన వాహనాలను పర్యవేక్షించుటకు, నియంత్రించుటకు,మార్గదర్సన కావించుటకు అమెరికాకు జీపీఎస్,రష్యాకు గ్లోనాన్,ఐరోపాకు గెలిలీయో,చైనాకు బేయ్డోన్,జపాన్ కు క్రాసీ జెనిత్ నావిగేసన్ వ్యవస్థ లు ఉన్నాయి. అదే తరహాలో భారతదేశం కూడా తన ప్రాదేశికప్రాంతం పైన అంతరిక్షంనుండి పర్యవేక్షించు, నియంత్రించు, మార్గదర్శన కావించు స్వంత నావెగేసన్/దిక్చూచి వ్యవస్థను కల్గి ఉండు ఉద్దేశ్యంతో ఐఆర్ఎన్ఎస్ఎస్ (భారతీయ క్షేత్రియదిక్చూచి ఉపగ్రహ వ్యవస్థ-Indian Regional navigation satellite syastem:IRNSS)ప్రణాలికను రూపొందించారు.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 400 B.C లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కధ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
దేశాల జాబితా – సంపద (ఆదాయం, జన విస్తరణ) క్రమంలో
వివిధ దేశాల జిడిపి మరియు ఇతర జనవిస్తరణా సూచికలు (List of countries by GDP demographics comparison). దేశం పేరుకు ఎడమ వైపున వివిధ అంశాల సూచికలలో ఆ దేశం ర్యాంకు, కుడి వైపున ఆ సూచికల విలువలు ఇవ్వబడ్డాయి. ఒకో కాలమ్ శీర్షిక పక్కన ఉన్న 'పెట్టె'ను క్లిక్ చేయడం ద్వారా పట్టిక క్రమాన్ని మార్చవచ్చును (Re-sort the table).
This article incorporates information from this version of the equivalent article on the English Wikipedia. ఆల్బర్ట్ ఐన్స్టీన్( pronounced /ˈælbərt ˈaɪnstaɪn/[3]; జర్మన్: [ˈalbɐt ˈaɪ̯nʃtaɪ̯n] [4]; 14 మార్చ్ 1879 – 18 ఏప్రిల్ 1955) జర్మనీ-లో పుట్టిన, జ్యుఇష్, 20 వ శతాబ్దానికి చెందిన సైద్ధాంతిక భౌతికవేత్త .ఇతని పేరుతో విలసిల్లిన శాఖలు: ప్రత్యేక సాపేక్షతా వాదము , సాధారణ సాపేక్షతా వాదము . ఆయన ముఖ్యంగా గణాంక యాంత్రిక శాస్త్రం, అతని వ్యవహారవిధానం బ్రోవ్నియన్ మోషన్ తో, మూల పదార్థాలను విడదీసే స్పెసిఫిక్ హీట్స్ మీద ఆయన విరోధాభావము, ఇంకా అస్థిరతకు వ్యాపించటానికి మధ్యనున్న సంబంధాన్ని చక్కగా వివరించగలిగాడు.
విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను
దక్షిణ మధ్య రైల్వే జోనులోని ప్రధానమైన రైల్వేస్టేషనులలో విజయవాడ రైల్వేస్టేషను ఒకటి. ఇది దేశంలోని పలు ముఖ్య రైల్వే లైన్లను కలిపే రైల్వే జంక్షన్ స్టేషను.
ఇందిరా ప్రియదర్శిని గాంధీ (హిందీ: इन्दिरा प्रियदर्शिनी गान्धी)(Indira Priyadarshini Gandhi) (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది.
హైదరాబాదు, తెలంగాణ రాజధాని మరియు ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని, హైదరాబాదు జిల్లా మరియు రంగారెడ్డి జిల్లాల ముఖ్యపట్టణం . దీనిని భాగ్యనగరము అని కూడా పిలుస్తారు. హైదరాబాదు నగరము సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు, దేవాలయములకు, చక్కని కళలకు, హస్తకళలకు మరియు నాట్యానికి ప్రసిద్ధి.
గోదావరి నది భారత దేశము లో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజమబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతము లో సంగమిస్తుంది.
సుఖ వ్యాధులు లేదా లైంగిక వ్యాధులు (Venereal or Sexually transmitted disease; VD or STD) ప్రధానంగా రతి క్రియ (Sex) ద్వారా వ్యాపించే వ్యాధులు. ఇవి అతి ప్రాచీనమైన వ్యాధులు.ఈ వ్యాధుల బారిన పడిన వ్యక్తి ఏ విధమైన వ్యాధి లక్షణాలు లేకుండా బయటకు ఆరోగ్యంగా కనిపిస్తారు. అందువలన వీరితో సంబంధమున్న వారికి ఈ వ్యాధుల్ని సంక్రమింపజేస్తారు.
భారతదేశంలో మూడవ పెద్ద నది, దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది అయిన కృష్ణా నదిని తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ కు ఉత్తరంగా మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించిన కృష్ణానది ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర దామొదర్దాస్ మోడి (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారత దేశంకి ప్రస్త్తత ప్రధాని. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగినారు. 2001లో కేశూభాయి పటేల్ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి.
ఝాన్సీ లక్ష్మీబాయి (నవంబరు 19, 1828 – జూన్ 17, 1858) (హిందీ- झाँसी की रानी మరాఠీ- झाशीची राणी), మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం లో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన లో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు.
సల్ఫ్యూరిక్ ఆమ్లం(Sulfuric acid లేదాsulphuric acid) ఒక బలమైన శక్తి వంతమైన ఖనిజ ఆమ్లం.సల్ఫ్యూరిక్ ఆమ్లం పదార్థాలను తినివేయు/క్షయింపచేసే (corrosive )గుణం కల్గిన ఆమ్లం. సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క సంకేత అణుఫార్ములా H2SO4.సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క అణుభారం 98.079 గ్రాములు/మోల్.ఇది కొద్దిగా ఘాటైన వాసన కల్గి ఉన్నది. సల్ఫ్యూరిక్ ఆమ్లం రంగులేకుండా లేదా పసుపు రంగులో ఉండును.
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment)ను కలుషితం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును. వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth )పై నున్న జీవరాశులకు అనుకూలమైనది.
11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి వరంగల్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున కలదు. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలొ నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు.