The most-visited English Wikipedia articles, updated daily. Learn more...
సుభాష్ చంద్రబోస్ (బెంగాలీ:সুভাষ চন্দ্র বসু) (జనవరి 23, 1897 ) నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్‌కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాధలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న ను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాధ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.
ఝాన్సీ లక్ష్మీబాయి (నవంబరు 19, 1828 – జూన్ 17, 1858) (హిందీ- झाँसी की रानी మరాఠీ- झाशीची राणी), మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం లో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన లో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు.
సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి. సరోజినీ దేవి 1935 డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెష్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు కూడా.
కరీంనగర్ జిల్లా తెలంగాణా రాష్ట్రంలోని 10 జిల్లాలలో ఒకటి. జిల్లాకు ఉత్తరాన ఆదిలాబాదు జిల్లా, ఈశాన్యమున మహారాష్ట్ర మరియు చత్తీసుగఢ్ రాష్ట్రాలు, దక్షిణాన వరంగల్ జిల్లా, ఆగ్నేయాన మెదక్ జిల్లా, మరియు పశ్చిమాన నిజామాబాదు జిల్లా సరిహద్దులు. పి.వి.నరసింహారావు, సి.నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జి.వెంకట స్వామి, సి.హెచ్.ప్రశాంత్, సి.హెచ్.విద్యాసాగర్ రావు, జువ్వాడి చొక్కారావు, ఎం.సత్యనారాయణ, సీహెచ్.హనుమంతరావు[ఘంటా చక్రపాణీ] లాంటి ప్రముఖులు ఈ జిల్లాకు చెందినవారు.
భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రం తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది.
ఇందిరా ప్రియదర్శిని గాంధీ (హిందీ: इन्दिरा प्रियदर्शिनी गान्धी)(Indira Priyadarshini Gandhi) (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది.
తజికిస్తాన్ అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్ (ఆంగ్లం : Tajikistan) (తజక్ భాష : Тоҷикистон), (పర్షియన్ : تاجیکی ) పూర్వపు తజిక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, మధ్య ఆసియాలోని ఒక దేశము. దీనికి ఆఫ్ఘానిస్తాన్, చైనా, కిర్గిజ్ స్తాన్, మరియు ఉజ్బెకిస్తాన్లతో సరిహద్దులు కలవు. దక్షిణంలో ఉన్న పాకిస్థాన్‌ను వాఖన్ కారిడార్ వేరు చేస్తుంది.
భీంరావ్ రాంజీ అంబడ్కర్ (మరాఠీ : डॊ.भीमराव रामजी आंबेडकर ) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) "బాబాసాహెబ్" అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్ , చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త.
ఆస్ట్రియా (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా) మధ్య ఐరోపాలోని ఒక భూపరివేష్టిత దేశం. ఈ దేశము స్లొవేనియా మరియు ఇటలీలకు ఉత్తర దిశలో, స్విట్జర్లాండ్ మరియు లీక్టెన్స్టెయిన్లకు తూర్పులో, స్లొవేకియా మరియు హంగేరీలకు పశ్చిమాన, జర్మనీ మరియు చెక్ రిపబ్లిక్లకు దక్షిణ దిశలో ఉన్నది. ఈ దేశ రాజధాని నగరమైన వియన్నా డానుబే నదీ తీరాన ఉన్నది.
సిడ్నీ (pronounced /ˈsɪdni/) ఆస్ట్రేలియాలో అతిపెద్ద మరియు అధిక జనసాంద్రతగల నగరం మరియు ఇది న్యూ సౌత్ వేల్స్ యొక్క రాష్ట్ర రాజధానిగా ఉంది. తస్మాన్ సముద్రం యొక్క ఆగ్నేయ ఆస్ట్రేలియా తీరంలో సిడ్నీ ఉంది. సిడ్నీలో నివసించేవారిని సిడ్నీసైడర్స్ అని పిలుస్తారు, ఇక్కడ ప్రపంచం నలుమూలలో ఉన్న అనేకప్రాంతాల నాగరికమైన మరియు అంతర్జాతీయమైన జనసమూహం ఉంది.
ఒక ఈత కొలను , బహిరంగ ఈత కొలను , లోతు తక్కువ కొలను , లేదా ఒక సాధారణ కొలను , అనేది ఈత కొట్టే ఉద్దేశ్యంతో నీటితో నింపబడి ఉండే ప్రదేశం లేదా నీటి సంబంధించిన ఒక వినోదం. వీటిలో పలు నియమిత పరిమాణాలు ఉన్నాయి; అతి పెద్దది మరియు లోతైనది ఒలింపిక్-పరిమాణ ఈత కొలను. ఒక కొలనుని భూమి ఉపరితలం మీద కాని లేదా లోపల కాని నిర్మించవచ్చు, లోహం, ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్ లేదా కాంక్రీటు వంటి సామాగ్రితో నిర్మించవచ్చు.
భారతదేశంలో మూడవ పెద్ద నది, దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది అయిన కృష్ణా నదిని తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ కు ఉత్తరంగా మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించిన కృష్ణానది ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (ఆంగ్లం Nelson Rolihlahla Mandela, (18 జూలై, 1918 - డిసెంబర్ 5, 2013) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకమునుపు ఇతను జాతి వివక్ష వ్యతిరేఖ ఉద్యమ కారుడు మరియు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు.
2001 లో మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతమై, ప్రజాదరణ పొందిన వెబ్సైటులలో 2011 నాటికి 5వ స్థానంలో ఉ౦ది.
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.
బుర్రకథ {Burrakadha} పల్లెపదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకొంటూ సరదా సరదాగా సాగిపోయే ఒక జానపద కళారూపం. పరిమితమైన ఆహార్యంతో, ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జన సామాన్యానికి చేరువగా వెళ్లే కళారూపాలలో హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవది. హరికథలో కొంత సంప్రదాయముద్ర ఉండి బుర్రకథ పూర్తిగా జానపద కళారూపం.
మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2 అక్టోబర్ 2014 ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 24 సెప్టెంబర్ 2014న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్చ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ అక్టోబర్ 2, 2014నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.
అమరావతి (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని) భారత దేశం లోని, విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రణాళికాబద్దమైన రాజధానిగా నగరంగా నిర్మింపబడుతున్న ప్రాంతానికి సమీపం లో గల పంచారామ క్షేత్రం అమరావతి గ్రామాం పేరునే కొత్త రాజధాని పేరుగా నిర్ణయం చేయబడింది. కృష్ణా నది దక్షిణపు ఒడ్డున నిర్మింపబడుతున్న నదీ ముఖ రాజధాని మరియు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం యొక్క భాగంగా ఉంది.
సానియా మీర్జా (జననం:15 నవంబరు 1986) భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రస్తుతం ఆమె మహిళల డబుల్స్ లో నెం.1 ర్యాంకు పొందిన క్రీడాకారిణి. 2003 నుండి 2013లో సింగిల్స్ నుండి విరమణ తీసుకునేదాకా విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకారం భారతదేశంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నెం.1 క్రీడాకారిణిగా గుర్తింపబడ్డారు.
పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం : Pakistan) (ఉర్దూ : پاکستان) : దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రం లను సరిహద్దులుగా కలిగి ఉంది. 16 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది.
This article incorporates information from this version of the equivalent article on the English Wikipedia. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్( pronounced /ˈælbərt ˈaɪnstaɪn/[3]; జర్మన్: [ˈalbɐt ˈaɪ̯nʃtaɪ̯n] [4]; 14 మార్చ్ 1879 – 18 ఏప్రిల్ 1955) జర్మనీ-లో పుట్టిన, జ్యుఇష్, 20 వ శతాబ్దానికి చెందిన సైద్ధాంతిక భౌతికవేత్త .ఇతని పేరుతో విలసిల్లిన శాఖలు: ప్రత్యేక సాపేక్షతా వాదము , సాధారణ సాపేక్షతా వాదము . ఆయన ముఖ్యంగా గణాంక యాంత్రిక శాస్త్రం, అతని వ్యవహారవిధానం బ్రోవ్నియన్ మోషన్ తో, మూల పదార్థాలను విడదీసే స్పెసిఫిక్ హీట్స్ మీద ఆయన విరోధాభావము, ఇంకా అస్థిరతకు వ్యాపించటానికి మధ్యనున్న సంబంధాన్ని చక్కగా వివరించగలిగాడు.
భారత ఉపఖండం లో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్ర్యోద్యమము" (Indian Freedom Struggle) గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్ర్యోద్యమములో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్ మరియు ఇతర వలసపాలకుల పాలనను అంతమొందంచటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి.
భారత దేశపు ఉక్కు మనిషి గా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడిగానే కాకుండా స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు జిల్లా. ఈ జిల్లా ముఖ్య పట్టణం నెల్లూరు. ఈ జిల్లా వరి సాగుకు, ఆక్వా కల్చర్ కు ప్రసిద్ధి.
జర్మనీ అధికారికంగా జర్మనీ గణతంత్ర సమాఖ్య (జర్మన్: Bundesrepublik Deutschland, బుండెస్రెపుబ్లిక్ డాయిచ్లాండ్) మధ్య ఐరోపాలోని ఒక దేశం. దీని సరిహద్దులలో ఉత్తరాన ఉత్తర సముద్రం, డెన్మార్క్, మరియు బాల్టిక్ సముద్రం; తూర్పున పోలాండ్ మరియు చెక్ గణతంత్రం; దక్షిణాన ఆస్ట్రియా మరియు స్విట్జర్లాండ్; ఇంకా పశ్చిమాన ఫ్రాన్సు, లక్సెంబర్గ్, బెల్జియం, మరియు నెదర్లాండ్స్ ఉన్నాయి. జర్మనీ యొక్క భూభాగం మరియు సమశీతోష్ణ వాతావరణంచే ప్రభావితం చేయబడుతుంది.
ఆర్మేనియా లేదా ఆర్మీనియా (ఆంగ్లం : Armenia) (ఆర్మీనియన్ భాష : Հայաստան , "హయాస్తాన్") అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా" (Հայաստանի Հանրապետություն, హయాస్తానీ హన్రపెతూత్ యూన్), ఒక భూపరివేష్టిత దేశం, దక్షిణ కాకసస్ పర్వతాల తో చుట్టబడి నల్లసముద్రం మరియు కాస్పియన్ సముద్రం ల మధ్య ఉన్నది. ఈ దేశం తూర్పు యూరప్ మరియు పశ్చిమ ఆసియాల నడుమ ఉన్నది. దీని సరిహద్దులలో పశ్చిమాన టర్కీ, ఉత్తరాన జార్జియా, తూర్పున అజర్బైజాన్, దక్షిణాన ఇరాన్ మరియు అజర్బైజాన్ కు చెందిన నక్షివాన్ ఎన్క్లేవ్ లు ఉన్నాయి.
రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ (ఐరిష్: Poblacht na hÉireann), గా పిలువబడే ఐర్లాండ్ (pronounced /ˈaɪərlənd/ ( ), ఐరిష్: Éire, pronounced [ˈeːɾʲə] ( )), వాయవ్య ఐరోపాలోని ఒక దేశం. ఈ ఆధునిక సార్వభౌమ రాజ్యం ఐర్లాండ్ ద్వీపంలో సుమారు ఆరింట ఐదువంతులను ఆక్రమించి ఉంటుంది, 1921లో ఇది రెండు అధికార ప్రాంతాలుగా విభజింపబడింది. ఈ దేశం ఆగ్నేయ దిక్కున యునైటెడ్ కింగ్డంలో భాగమైన నార్తరన్ ఐర్లాండ్ ను, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రము, ఐరిష్ సముద్రమును, ఆగ్నేయంలో సెయింట్ జార్జ్'స్ ఛానల్, మరియు దక్షిణాన సెల్టిక్ సముద్రములను సరిహద్దులుగా కలిగి ఉంది.
తూర్పు తైమూర్ (/ˌiːst ˈtiːmɔr/) లేక తైమూర్- లెస్తె (/tiˈmɔr ˈlɛʃteɪ/), టేటం భాష: తైమూర్ లొరోసె అధికారికంగా డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ తైమూర్- లెస్తె (పోర్చుగీసు: " రిపబ్లిక డెమొక్రటిక డీ తైమొర్- లెస్తె " టటం: రిపబ్లిక డెమొక్రటిక డీ తైమొర్- లెస్) మేరీటైం ఈశాన్య ఆసియాలో సార్వభౌమాధికారం కలిగిన దేశం. ఇది తైమూర్ ద్వీపం పూర్వార్ధభూభాగంలో (ఈస్ట్ హాఫ్) ఉంది. దీనికి సమీపంలో అటౌరో ద్వీపం, ఒఎక్యూస్ మరియు జాకో ద్వీపం ఉన్నాయి.
ప్రతీ దేశానికీ పరుల పాలన/ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆగష్టు పదిహేను (August 15) భారత దేశపు స్వాతంత్ర్య దినోత్సవం గా జరుపుకోబడుతోంది. 1947 ఆగష్టు పదిహేనున భారత దేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.
ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ్య అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని(అరణ్య పర్వము) పూర్తి చేసినాడు. నన్నయ్య భారతాన్ని చదివి ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడా అనిపిస్తుంది, అలాగే తిక్కన్న భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కన్నే వ్రాసినాడా అనిపిస్తుంది. సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది.
విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం మరియు హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడ దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు .
ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయము తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో మరియు కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది.
ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (లేదా PwC) ప్రపంచంలోని అతిపెద్ద వృత్తి సేవల సంస్థల్లో ఒకటి మరియు ఇది బిగ్ ఫోర్ ఆడిటింగ్ కంపెనీల్లో అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. లండన్‌లో స్థాపించబడిన ప్రైస్ వాటర్‌హౌస్ మరియు కూపర్స్ & లైబ్రాండ్ కంపెనీల విలీనం ద్వారా దీనిని 1998లో ఏర్పాటు చేశారు. 2009 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ ఆదాయం US$26.2 బిలియన్లు వద్ద ఉంది, ఈ సంస్థలో 151 దేశాల్లో 163,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ�జాయ్ చరిత్ర సృష్టించారు. భారతీయుడు కైలాశ్ సత్యార్థితో పాటు 17 ఏళ్ల మలాలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు మహిళా విద్యకు తన మద్దతును ప్రకటించడమే కాకుండా, పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తిన మలాలా యూసుఫ్ జాయ్ (Malala Yousafzai)ను హత్య చేస్తామని తెహ్రీక్ ఈ తాలిబన్ తీవ్రవాద సంస్థ తాజాగా ప్రకటించింది. ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు ఆమెపై తీవ్రవాదులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషంయ తెల్సిందే.
సుదీర్ఘ చరిత్ర, విలక్షణ భౌగోళిక స్వరూపం, విభిన్న జనాభాలు మరియు వేషధారణలు, సంప్రదాయాలు, సింధూ లోయ నాగరికత సమయంలో ఏర్పడి వేద యుగాల సందర్భంగా అభివృద్ధి చెందిన పురాతన వారసత్వం, కొన్ని పొరుగుదేశాల నుంచి స్వీకరించిన భావాలు, బౌద్ధ మత ఉన్నతి, పతనం, స్వర్ణ యుగం, భారత్ లో ముస్లింల ప్రవేశం మరియు ఐరోపా కాలనీల ఏర్పాటులచే భారతదేశ సంస్కృతి మలచబడింది. గొప్ప భిన్నత్వం కలిగివున్న భారతదేశ మతాచారాలు, భాషలు, వేషధారణలు మరియు సంప్రదాయాలు గత ఐదు వేల సంవత్సరాలుగా ఇక్కడ నిరుపమాన సహజీవనానికి ఉదాహరణలుగా ఉన్నాయి. ఈ సమ్మేళనాల ద్వారా సృష్టించబడిన భారతదేశంలోని వివిధ మతాలు మరియు సంప్రదాయాలు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలను కూడా ప్రభావితం చేశాయి.
తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్‌లోని నల్గొండ జిల్లా,గుంటూర్ జిల్లాల మధ్య కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయాన్ని నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) అంటారు. అయితే ఈ పదాన్ని ఆ జలాశయానికి, ఆ మొత్తం ప్రాజెక్టుకు, అక్కడి వూరికి కూడా వర్తింపజేయడం జరుగుతుంది. ఇది దేశంలోనే రిజర్వాయర్లలో రెండవ స్థానం లొ ఉంది మరియు పొడవులో మొదటిది.దీని నర్మాణ కాలము 1955 - 1967.
కూచిపూడి నృత్యము, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక భారతీయ నాట్యం. ఇది కృష్ణా జిల్లా లో దివి తాలూకాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించినది. క్రీ పూ 2వ శతాబ్దం లో ఆంధ్ర చారిత్రాత్మక నగరమైన శ్రీకాకుళం కు సుమారు 450 కిలోమీటరుల దూరంలో బంగాళాఖాతము పై ఉన్న ఈ ప్రాంతము లోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించటంతో దీనికి ఈ పేరు వచ్చినది.
1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర దామొదర్దాస్ మోడి (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారత దేశంకి ప్రస్త్తత ప్రధాని. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగినారు. 2001లో కేశూభాయి పటేల్ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి.
గోదావరి నది భారత దేశము లో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజమబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతము లో సంగమిస్తుంది.
మొహంజో-దారో (సింధీ:موئن جو دڙو ఉర్దూ: موئن جو دڑو), అనగా చనిపోయినవారి గుట్ట ప్రస్తుత పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతానికి చెందిన చారిత్రకంగా, నాగరికతపరంగా అత్యంత ప్రాముఖ్యత గల ప్రాంతం. క్రీ.పూ 2500 లో నిర్మించబడిన ఈ నగరం సింధు లోయ నాగరికత లో అత్యధిక స్థిరత్వం పొందిన, పురాతన ఈజిప్టు, మెసొపొటేమియా నాగరికత, మినోవా మరియు నార్టే చీకో నాగరికతలకు సమకాలీనమైనది. క్రీ.పూ 19వ శతాబ్దంలో సింధు నాగరికత అంతరించిపోయినపుడు, ఈ నగరం పరిత్యజించబడినది.
కిరణ్ బేడీ (Kiran Bedi) భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో ఆప్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది.