The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2 అక్టోబర్ 2014 ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 24 సెప్టెంబర్ 2014న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ అక్టోబర్ 2, 2014నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.
భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది.
2001 లో మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతమై, ప్రజాదరణ పొందిన వెబ్సైటులలో 2011 నాటికి 5వ స్థానంలో ఉంది.
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (మరాఠీ : डॊ.भीमराव रामजी आंबेडकर ) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) "బాబాసాహెబ్" అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త. బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్.
విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం మరియు హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 500 B.C లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్' ('సిఎస్ఇ) అనేది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) సహా భారత ప్రభుత్వం యొక్క పలు భారతీయ సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చే నిర్వహించబడే భారతదేశంలోని దేశవ్యాప్త పోటీ పరీక్ష. ఈ పరీక్ష భారతదేశంలో అత్యంత క్లిష్ట పరీక్ష, ఈ పరీక్షకు 9,00,000 కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటారు, విజయం రేటు 0.1%-0.3%, ప్రపంచంలో అతి తక్కువ విజయవంత రేటు కలిగిన పరీక్షలలో ఇది ఒకటి. ఈ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు - ప్రాథమిక పరీక్ష రెండు ఆబ్జెక్టివ్-రకం పేపర్లను (సాధారణ అధ్యయనాలు మరియు ఆప్టిట్యూడ్ టెస్ట్) కలిగి ఉంటుంది, మరియు మెయిన్ పరీక్ష వ్యక్తిత్వ పరీక్ష (ఇంటర్వ్యూ) ననుసరించి సంప్రదాయ (వ్యాసం) రకం యొక్క తొమ్మిది పేపర్లను కలిగి ఉంటుంది.
500, 1000 రూపాయల నోట్ల రద్దు అన్నది భారత ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయం. 8 నవంబర్ 2016 అర్థరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500, 1000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోతాయి. 8 నవంబర్ 2016న జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగం ద్వారా దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
నరేంద్ర మొది 1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర దామొదర్దాస్ మోది (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారత దేశంకి ప్రస్త్తత ప్రధాని. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి.
'మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.
మొదట అంతర్జాతీయ మహిళా శ్రామికమహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమలగురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా మరియు పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది.
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment)ను కలుషితం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును. వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth )పై నున్న జీవరాశులకు అనుకూలమైనది.
భూగోళం యొక్క వేడిమి అంటే భూమికి దగ్గరగా ఉన్న ఉపరితలము, దగ్గర లోనున్న సముద్రాలు, దాని చుట్టూ ఉన్న గాలి 20 వ శతాబ్దపు తొలి నాళ్ళ నుండి వేడెక్కడం మొదలై అది ఇక ముందు కూడా కొనసాగుతుందన్న అంచనా.గత శతాబ్దం నుండి భూగోళ ఉపరితలం 0.74 ± 0.18 °C (1.33 ± 0.32 °F) వరకు వేడెక్కింది.[6] 20 వ శతాబ్దపు మధ్య కాలంలో అడవులను నరికి వేయడం వలన, శిలాజపు ఇంధనాల వినియోగం వలన భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడంలో ప్రధాన పాత్రను పోషించాయని శీతోష్ణ స్థితి మార్పులపై ఏర్పాటైన అంతర ప్రభుత్వ విభాగం (ఐపిసిసి) తెలిపింది. ఐపిసిసి ఇంకా ఈ విధమైన తీర్మానాలు కూడా చేసింది. అవి ఏమిటంటే సహజ జీవన శైలి అనగా సూర్య రశ్మి ధార్మికత, అగ్ని పర్వతాల నుండి వెలువడే లావాలు, 1950 కాలం కన్నా ముందున్న పారిశ్రామిక యుగం కంటే ఎక్కువగా ఈ భూమిని వేడేక్కించాయని తీర్మానించారు.
జవాహర్ లాల్ నెహ్రూ, (Jawaharlal Nehru) (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.
కూచిపూడి నృత్యము, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన ఒక భారతీయ నాట్యం. ఇది కృష్ణా జిల్లాలో దివి తాలూకాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించింది. క్రీ పూ 2వ శతాబ్దంలో ఆంధ్ర చారిత్రాత్మక నగరమైన శ్రీకాకుళంకు సుమారు 450 కిలోమీటరుల దూరంలో బంగాళాఖాతము పై ఉన్న ఈ ప్రాంతము లోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించటంతో దీనికి ఈ పేరు వచ్చింది.
వెబ్ సర్వర్ అనగా HTTP ప్రోటోకాల్ ద్వారా అభ్యర్థనలను మన్నించే ఒక సాంకేతిక పరిజ్ఞానం. HTTP అనేది వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా పత్రాలను కంప్యూటరు నెట్వర్కుల్లోకి పంచిపెట్టడం లాంటి పనులకు వాడే ప్రాథమిక నియమావళి. వెబ్ సర్వర్ అనే పదం ఒక కంప్యూటరుకు, లేదా ఒక అప్లయన్సుకు, లేదా HTTP అభ్యర్థనలను స్వీకరించే సాఫ్ట్ వేరుకు వాడుతూ ఉంటారు.
'నేతాజీ' సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) అతను గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మూస:Disclaimer header Wikipedia is an online open-content collaborative encyclopedia; that is, a voluntary association of individuals and groups working to develop a common resource of human knowledge. The structure of the project allows anyone with an Internet connection to alter its content. Please be advised that nothing found here has necessarily been reviewed by people with the expertise required to provide you with complete, accurate or reliable information.
ఝాన్సీ లక్ష్మీబాయి (నవంబరు 19, 1828 – జూన్ 17, 1858) (హిందీ- झाँसी की रानी మరాఠీ- झाशीची राणी), మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు.
అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (International Standard Book Number - ISBN) అనేది ఒక విశిష్ట సంఖ్యా వాణిజ్య పుస్తక గుర్తింపు. ఐఎస్బిఎన్ అనేది ప్రతి ఎడిషన్ మరియు వైవిధ్యానికి (పునర్ముద్రణకు తప్ప) కేటాయించబడుతుంది. ఉదాహరణకు, ఇ-పుస్తకం, పేపర్బ్యాక్ మరియు అదే పుస్తకం యొక్క గ్రంథాలయ ప్రతి -ప్రతిదీ ఒక విభిన్న ISBN కలిగి వుంటుంది.
గమనిక భగవద్గీత అధ్యాయానుసారం పూర్తి పాఠము వికి సోర్స్లో ఉంది. భగవద్గీత ఒక్కో శ్లోకానికీ తెలుగు అనువాదం వికీసోర్స్లో ఉన్నది: భగవద్గీత (తెలుగు అనువాదము) భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది.
భరతనాట్యం దక్షిణ భారతదేశంలో నాట్య శాస్త్రం రచించిన భరతమువి పేరుతో పుట్టి, ప్రసిద్ధి గాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం. దక్షిణ భారతదేశం లోని పురాతవ దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరలు నాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దబడి ఉంటాయి. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము, శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది.
{{Infobox holiday |holiday_name = బతుకమ్మ |type = గౌరీ దేవి పండగ |image = Bathukamma.jpg |caption = |official_name = |nickname = పుష్పాల పండగ |observedby = తెలంగాణ రాష్ట్రములో జరుపుకొనే పండగ |begins = మహాలయ అమావాస్య |ends = దుర్గాష్టమి |date = సెప్టెంబరు/అక్టోబరు |date2006 = |date2007 = |celebrations = 9 రోజులు |observances = |relatedto = దసరా |duration = 9 రోజులు ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.
సౌర ఘటం అనేది కాంతివిపీడన ప్రభావం ద్వారా సూర్యకాంతి శక్తిని నేరుగా విద్యుత్తుగా మార్చే పరికరం చెప్పవచ్చు. కొన్నిసార్లు సౌర ఘటం అనే పదం ప్రత్యేకంగా సూర్య ఫలకాలు మరియు సూర్య ఘటాలు వంటి సూర్యకాంతి నుండి శక్తిని సంగ్రహించే పరికరాలు కోసం ప్రత్యేకించబడింది, అయితే కాంతివిపీడన ఘటం అనే పదాన్ని ఉపయోగిస్తున్న కాంతి వనరు తెలియనప్పుడు ఉపయోగిస్తారు. ఘటాల కూర్పును సౌర ఫలకాలు, సౌర వ్యవస్థలు లేదా కాంతివిపీడన శ్రేణుల తయారీలో ఉపయోగిస్తారు.
అయోమయ నివృత్తి పేజీ కృష్ణమాచార్యులు చూడండి తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) (Dasaradhi Krishnamacharya). దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు.
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.
పూసర్ల వెంకట సింధు (జననం: జూలై 5, 1995) ఒక అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2016 లో జరిగిన రియో ఒలంపిక్స్ లో రజత పతకం సాధించి ఒలంపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. సెప్టెంబరు 21, 2012 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.
ఒక పర్యావరణ వ్యవస్థ, జీవ వ్యవస్థ, జీవారణ్య ప్రాంతాలు లేదా మొత్తం భూమిపై ఉన్న జీవ రూపాల యొక్క భేదమే జీవవైవిధ్యం . జీవశాస్త్ర వ్యవస్థల స్వస్థతా పరిమాణంగా జీవవైవిధ్యం తరచూ ఉపయోగించబడుతుంది. నేడు భూగోళంపై ఉన్న అనేక మిలియన్ల విభిన్నజాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం నుండి అభివృద్ధి చెందింది.
బుర్రకథ {Burrakadha} పల్లెపదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకొంటూ సరదా సరదాగా సాగిపోయే ఒక జానపద కళారూపం. పరిమితమైన ఆహార్యంతో, ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జన సామాన్యానికి చేరువగా వెళ్లే కళారూపాలలో హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవది. హరికథలో కొంత సంప్రదాయముద్ర ఉండి బుర్రకథ పూర్తిగా జానపద కళారూపం.
మిషన్ కాకతీయ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, కాలువలు నీటితో కళకళలాడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ (మన ఊరు, మన చెరువు) ను ప్రారంభించింది. వేల ఏండ్లపాటు తెలంగాణను సస్యశ్యామలం చేసి, కొన్ని దశాబ్దాలుగా పూడుకుపోయిన దాదాపు 46 వేలకుపైగా చెరువులను మళ్లీ పునరుద్ధరించడమే మిషన్ కాకతీయ ప్రధాన లక్ష్యం.
<tr class="mergedrow"> <tr class="mergedbottomrow"> ఇతరవాడుకలు రిపబ్లిక్ ఆఫ్ చైనా లేదాతైవాన్ చైనా అని సాధారణంగా పిలువబడే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తూర్పు ఆసియాలో అతిపెద్ద దేశం, మరియు ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి. 130 కోట్ల (1.3 బిలియన్) పైగా జనాభాతో ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల దేశంగా చైనా ఉంది. చైనా రాజధాని నగరం బీజింగ్ (Beijing).అతిపెద్ద నగరం షాంఘై (shangai).చైనా ఏక పార్టీ పాలిత దేశం.