The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (మరాఠీ : डॊ.भीमराव रामजी आंबेडकर ) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) "బాబాసాహెబ్" అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త. బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్.
'మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్‌కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.
2001 లో మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతమై, ప్రజాదరణ పొందిన వెబ్సైటులలో 2011 నాటికి 5వ స్థానంలో ఉంది.
భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
జవాహర్ లాల్ నెహ్రూ, (Jawaharlal Nehru) (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.
'నేతాజీ' సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) అతను గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2 అక్టోబర్ 2014 ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 24 సెప్టెంబర్ 2014న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ అక్టోబర్ 2, 2014నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.
విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం మరియు హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 500 B.C లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
భూగోళం యొక్క వేడిమి అంటే భూమికి దగ్గరగా ఉన్న ఉపరితలము, దగ్గర లోనున్న సముద్రాలు, దాని చుట్టూ ఉన్న గాలి 20 వ శతాబ్దపు తొలి నాళ్ళ నుండి వేడెక్కడం మొదలై అది ఇక ముందు కూడా కొనసాగుతుందన్న అంచనా.గత శతాబ్దం నుండి భూగోళ ఉపరితలం 0.74 ± 0.18 °C (1.33 ± 0.32 °F) వరకు వేడెక్కింది.[6] 20 వ శతాబ్దపు మధ్య కాలంలో అడవులను నరికి వేయడం వలన, శిలాజపు ఇంధనాల వినియోగం వలన భూగోళ ఉష్ణోగ్రతలు పెరగడంలో ప్రధాన పాత్రను పోషించాయని శీతోష్ణ స్థితి మార్పులపై ఏర్పాటైన అంతర ప్రభుత్వ విభాగం (ఐపిసిసి) తెలిపింది. ఐపిసిసి ఇంకా ఈ విధమైన తీర్మానాలు కూడా చేసింది. అవి ఏమిటంటే సహజ జీవన శైలి అనగా సూర్య రశ్మి ధార్మికత, అగ్ని పర్వతాల నుండి వెలువడే లావాలు, 1950 కాలం కన్నా ముందున్న పారిశ్రామిక యుగం కంటే ఎక్కువగా ఈ భూమిని వేడేక్కించాయని తీర్మానించారు.
ఇందిరా ప్రియదర్శిని గాంధీ (హిందీ: इन्दिरा प्रियदर्शिनी गान्धी) (Indira Priyadarshini Gandhi) (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది.
అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (International Standard Book Number - ISBN) అనేది ఒక విశిష్ట సంఖ్యా వాణిజ్య పుస్తక గుర్తింపు. ఐఎస్బిఎన్ అనేది ప్రతి ఎడిషన్ మరియు వైవిధ్యానికి (పునర్ముద్రణకు తప్ప) కేటాయించబడుతుంది. ఉదాహరణకు, ఇ-పుస్తకం, పేపర్‌బ్యాక్ మరియు అదే పుస్తకం యొక్క గ్రంథాలయ ప్రతి -ప్రతిదీ ఒక విభిన్న ISBN కలిగి వుంటుంది.
ఝాన్సీ లక్ష్మీబాయి (నవంబరు 19, 1828 – జూన్ 17, 1858) (హిందీ- झाँसी की रानी మరాఠీ- झाशीची राणी), మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు.
సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి . సరోజినీ దేవి 1925డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు కూడా.
అమరావతి (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని) భారత దేశం లోని, విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రణాళికాబద్దమైన రాజధాని నగరంగా నిర్మింపబడుతున్న ప్రాంతానికి సమీపం లో గల పంచారామ క్షేత్రం అమరావతి గ్రామాం పేరునే కొత్త రాజధాని పేరుగా నిర్ణయం చేయబడింది. కృష్ణా నది దక్షిణపు ఒడ్డున నిర్మింపబడుతున్న నదీ ముఖ రాజధాని మరియు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతం యొక్క భాగంగా ఉంది.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము, శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది.
పూసర్ల వెంకట సింధు (జననం: జూలై 5, 1995) ఒక అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2016 లో జరిగిన రియో ఒలంపిక్స్ లో రజత పతకం సాధించి ఒలంపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. సెప్టెంబరు 21, 2012 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.
నరేంద్ర మొది 1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర దామొదర్దాస్ మోది (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారత దేశంకి ప్రస్త్తత ప్రధాని. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి.
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.
అయోమయ నివృత్తి పేజీ కృష్ణమాచార్యులు చూడండి తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) . దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
{{Infobox holiday |holiday_name = బతుకమ్మ |type = గౌరీ దేవి పండగ |image = Bathukamma.jpg |caption = |official_name = |nickname = పుష్పాల పండగ |observedby = తెలంగాణ రాష్ట్రములో జరుపుకొనే పండగ |begins = మహాలయ అమావాస్య |ends = దుర్గాష్టమి |date = సెప్టెంబరు/అక్టోబరు |date2006 = |date2007 = |celebrations = 9 రోజులు |observances = |relatedto = దసరా |duration = 9 రోజులు ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను) అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశం అనేకదమ్ తమ్ భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే (అగజ) పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాధనం హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రథమముగా పూజింపవలసినవాడు.
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment)ను కలుషితం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును. వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth )పై నున్న జీవరాశులకు అనుకూలమైనది.
గురజాడ అప్పారావు (సెప్టెంబర్ 21, 1862 - నవంబర్ 30, 1915) గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి. గురజాడ అప్పారావు గారు (1862-1915) తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు.గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు.
సంబంధిత ఇతర వ్యాసాల కోసం అయోమయ నివృత్తి పేజీ సాయిబాబా చూడండి షిర్డీ సాయిబాబా (సెప్టెంబర్ 28, 1835 - అక్టోబరు 15, 1918)దేవుడు సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు.
అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ�జాయ్ చరిత్ర సృష్టించారు. భారతీయుడు కైలాశ్ సత్యార్థితో పాటు 17 ఏళ్ల మలాలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు మహిళా విద్యకు తన మద్దతును ప్రకటించడమే కాకుండా, పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తిన మలాలా యూసుఫ్ జాయ్ (Malala Yousafzai) ను హత్య చేస్తామని తెహ్రీక్ ఈ తాలిబన్ తీవ్రవాద సంస్థ తాజాగా ప్రకటించింది. ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు ఆమెపై తీవ్రవాదులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషంయ తెల్సిందే.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950, ఏప్రిల్ 20 వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంకు తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభాజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చంద్రబాబు అనేక పర్యాయాలు దేశరాజకీయాలలో చక్రం తిప్పి తనదైన ఉనికిని చాటిచెప్పాడు.
మూస:Disclaimer header Wikipedia is an online open-content collaborative encyclopedia; that is, a voluntary association of individuals and groups working to develop a common resource of human knowledge. The structure of the project allows anyone with an Internet connection to alter its content. Please be advised that nothing found here has necessarily been reviewed by people with the expertise required to provide you with complete, accurate or reliable information.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సవరణల) బిల్లు, నేర విచారణ పూర్తైన తర్వాత నేరబాధితుల పునరావాసానికి అవసరమైన నష్టపరిహారాన్ని కోర్టులు సె-357 ప్రకారం చెల్లించమని ఆదేశించే అవకాశం ఉంది. ఒక వేళ ఆవిధంగా అదేశించిన మొత్తం బాధితుల పునరావాసానికి సరిపోదని కోర్టు భావించినప్పుడు వాళ్లకి తగిన నష్టపరిహారం చెల్లించమని సిఫారసు చేసే అవకాశం ఉంది. ముద్దాయిలపై ఉన్న కేసులను కొట్టివేసినప్పుడు, అట్లాగే వాళ్ళని విముక్తం చేసినప్పుడు కూడా కోర్టులు నష్టపరిహారం చెల్లించమని సిఫారసుచేసే అవకాశం ఉంది.కొన్ని సందర్భాలలో ముద్దాయి దొరకకపోవచ్చు.
గుదద్వారములో (గుదము,)లో సంభోగం జరపడాన్ని గుద మైథునం లేదా గుదరతి అంటారు. ఈ రకమైన సంభోగంలో ఎక్కువగా స్వలింగసంపర్కులు పాల్గొన్నా, ఈ మథ్యకాలంలో చాలామంది బార్యా-భర్తలు కూడా ఈ రకమయిన సంభోగం (గుద మైథునం) ద్వారా భావప్రాప్తి చెందుతున్నట్టు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ఇదివరకు మగవారు మాత్రమే ఈ తరహా సంభోగం ద్వారా సుఖ పడతారని అనే అపోహ ఉండేది.
తాజ్ మహల్ (ఆంగ్లం:Taj Mahal (/ˈtɑːdʒ məˈhɑːl/) (హిందీ: ताज महल) (ఉర్దూ: تاج محل ) అనే ఒక అద్భుతమైన సమాధి] భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. తాజ్ మహల్ (ఇంకా "తాజ్") |మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది, ఇది పర్షియా, భారతీయ మరియు ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది. 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మారింది మరియు "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదహరించింది అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది." తెల్లటి పాల రాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం, నిజానికి తాజ్ మహల్ ఒక మిశ్రమ సమన్వయ నిర్మాణం.
ఇంగ్లీషు భాష (English) పశ్చిమ జెర్మేనిక్ భాష, ఇండో-యూరోపియన్ భాష, ఇంగ్లాండులో జన్మించింది. యునైటెడ్ కింగ్డం, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఐర్లాండ్ మరియు ఆంగ్లోఫోనిక్ కరీబియన్ ప్రజల మొదటి భాష. ఇది, రెండవ భాష గానూ మరియు అధికార భాషగా ప్రపంచం మొత్తంమీద ఉపయోగిస్తున్నారు, మరీ ముఖ్యంగా అలీన దేశాలలోనూ మరియు అనేక అంతర్జాతీయ సంస్థలలోనూ ఉపయోగిస్తున్నారు.