The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
'మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్‌కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ IIచే దైవ ఆశీర్వాదం ( బీటిఫికేషన్)మరియు బ్లెస్డ్ తెరెసా అఫ్ కలకత్తా బిరుదు పొందారు.
జవాహర్ లాల్ నెహ్రూ, (Jawaharlal Nehru) (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.
సింగ్ (పంజాబీ: ਭਗਤ ਸਿੰਘ بھگت سنگھ, (సెప్టెంబరు 22, 1907 –మార్చి 23, 1930) స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు.గొప్ప కమ్యూనిస్టు ఢిల్లీ వీదిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు.విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.భారత స్వాతంత్ర్యోద్యమము లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు. ఈ కారణంగానే 'షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు'. చరిత్రకారుడు కె.ఎన్.
'నేతాజీ' సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) అతను గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (మరాఠీ : डॊ.भीमराव रामजी आंबेडकर ) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) "బాబాసాహెబ్" అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగికుడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త.
ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు.
నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (ఆంగ్లం Nelson Rolihlahla Mandela, (18 జూలై, 1918 - డిసెంబర్ 5, 2013) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకమునుపు ఇతను జాతి వివక్ష వ్యతిరేఖ ఉద్యమ కారుడు మరియు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు.
తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
ఇందిరా ప్రియదర్శిని గాంధీ (హిందీ: इन्दिरा प्रियदर्शिनी गान्धी) (english:Indira Priyadarshini Gandhi) (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది.
సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి . సరోజినీ దేవి 1925డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.
క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రధానంగా డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ.క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాల తర్వాత వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ (చారిత్రకంగా పశ్చిమాన పన్నెండు రోజుల పాటు ఉండే పండుగ రోజులు ఇవి, పన్నెండవ రోజు రాత్రికి ఇవి తారాస్థాయికి చేరుకుంటాయి.) అని పిలిచే సీజన్ ఆరంభంగా నిలుస్తుంది.కొత్త నిబంధనలోని సంప్రదాయిక క్రిస్మస్ కథనం ప్రకారం, రక్షకుని గురించిన జోస్యాలను అనుసరించి జోసెఫ్, మేరీ బెత్లెహాం వచ్చినప్పుడు వసతి గృహం (ఇన్)లో గదులు లభ్యం కాకపోవడంతో పశువుల పాకలో వారికి ఆశ్రయం దొరుకింది, అక్కడే క్రీస్తు జన్మించాడు దేవదూతలు ఈ విషయాన్ని పశువుల కాపరులకు చెప్పగా, వారు సమాచారం మిగిలినవారికి చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రిస్మస్ సెలవు రోజు, ఈ పండుగను క్రైస్తవుల్లో అత్యధికులు మతపరంగానూ, క్రైస్తవేతరులు సాంస్కృతికంగానూ జరుపుకుంటారు, పశ్చిమదేశాల్లో సెలవుల సీజన్లో అత్యంత ముఖ్యమైన భాగం. క్రీస్తు ఏ నెలలో, ఏ తేదీన జన్మించాడన్న విషయం తెలియకపోయినా, నాలుగవ శతాబ్ది మధ్యభాగం నాటికల్లా పశ్చిమ క్రైస్తవ చర్చి క్రిస్మస్ ను డిసెంబరు 25 నాటికి నిర్వహించడం సాగించింది, ఇదే తేదీని తర్వాత తూర్పు క్రైస్తవం కూడా స్వీకరించింది.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
ఫీఫా ప్రపంచ కప్ (FIFA World Cup), లేదా క్లుప్తంగా ప్రపంచ కప్ (World Cup), అని పేరొందిన కాల్బంతి (Football) పోటీ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడా పోటీ అని చెప్పవచ్చు. ఈ పోటీలో కాల్బంతి ఆటలో వాసికెక్కిన జాతీయ జట్లు, తమ దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ఆటలపోటీలు 1930 లో మొదలయ్యి, నాలుగేళ్ళకోసారి (1942,46 లో ద్వితీయ ప్రపంచ యుద్ధం మూలాన తప్ప) కొనసాగుతూ వస్తున్నాయి.
2001, జనవరి 15న మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞానసర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతమై, ప్రజాదరణ పొందిన వెబ్సైటులలో 2017 నాటికి 5వ స్థానంలో ఉంది.
పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి.
సామాజిక శాస్త్రంలోనూ, జీవ శాస్త్రంలోనూ జనాభాా (population) అన్న పదాన్ని ఒక జాతికి (species) చెందిన సంఖ్యను చెప్పడానికి వాడుతారు. population అన్న పదాన్ని గణాంక శాస్త్రంలోనూ, ఇతర విజ్ఞానశాస్త్రాలలోనూ 'సముదాయం' అన్న అర్ధంలో కూడా వాడుతారు. ఈ వ్యాసంలో మానవజాతి జనసంఖ్య అన్న అర్ధంలో జనాభాా అన్న పదం వాడబడింది.
మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2 అక్టోబర్ 2014 ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 2014 సెప్టెంబరు 24న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ 2014 అక్టోబర్ 2నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.
1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి.
పూసర్ల వెంకట సింధు (జననం: జూలై 5, 1995) ఒక అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2016 లో జరిగిన రియో ఒలంపిక్స్ లో రజత పతకం సాధించి ఒలంపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.సెప్టెంబరు 21, 2012 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆగస్టు 10, 2013 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి అలా గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 500 B.c లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేతెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను) అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశం అనేకదమ్ తమ్ భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే(అగజ) పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాధనం హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రథమముగా పూజింపవలసినవాడు.
లాల్ బహాదుర్ శాస్త్రి ( వినండి ) (1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి , భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు.
ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ (ICC Cricket World Cup) అనేది పురుషుల ఒక రోజు అంతర్జాతీయ (ODI) క్రికెట్‌కు సంబంధించిన ప్రధాన అంతర్జాతీయ పోటీలను సూచిస్తుంది. ఈ ప్రపంచ కప్‌ను క్రీడా పాలక సంస్థ అంతర్జాతీయ క్రికెట్ సంగము (ICC) నిర్వహిస్తుంది, ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే తుది టోర్నమెంట్‌కు ముందుగా ప్రాథమిక అర్హత పోటీలు జరుగుతాయి. ఈ టోర్నమెంట్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మరియు అత్యధిక మంది వీక్షించే క్రీడా కార్యక్రమంగా గుర్తింపు పొందింది.
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
గురజాడ అప్పారావు (1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి.
తాజ్ మహల్ (ఆంగ్లం:Taj Mahal (/ˈtɑːdʒ məˈhɑːl/) (హిందీ: ताज महल) (ఉర్దూ: تاج محل ) అనే ఒక అద్భుతమైన సమాధి] భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. తాజ్ మహల్ (ఇంకా "తాజ్") |మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది, ఇది పర్షియా, భారతీయ మరియు ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది. 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చినదీ మరియు "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదాహరించింది అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది." తెల్లటి పాల రాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం, నిజానికి తాజ్ మహల్ ఒక మిశ్రమ సమన్వయ నిర్మాణం.
మిషన్ కాకతీయ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, కాలువలు నీటితో కళకళలాడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ (మన ఊరు, మన చెరువు) ను ప్రారంభించింది. వేల ఏండ్లపాటు తెలంగాణను సస్యశ్యామలం చేసి, కొన్ని దశాబ్దాలుగా పూడుకుపోయిన దాదాపు 46 వేలకుపైగా చెరువులను మళ్లీ పునరుద్ధరించడమే మిషన్ కాకతీయ ప్రధాన లక్ష్యం.
బొద్దు పాఠ్యం ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ్య అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని(అరణ్య పర్వము) పూర్తి చేసాడు. నన్నయ్య భారతాన్ని చదివి ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడా అనిపిస్తుంది, అలాగే తిక్కన్న భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కన్నే వ్రాసినాడా అనిపిస్తుంది. సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది.
కొమురం భీము (అక్టోబర్ 22, 1901 - అక్టోబర్ 27, 1940) హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.. ఈయన ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ-సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో కొమరం భీమ్ 1901 సంవత్సరంలో జన్మించాడు.
తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ (ఆగష్టు 6, 1934 - జూన్ 21, 2011) వరంగల్ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు.
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment)ను కలుషితం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును. వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth )పై నున్న జీవరాశులకు అనుకూలమైనది.
Kumar.G | name = కందుకూరి వీరేశలింగం పంతులు | residence = | other_names = | image = | imagesize = 175 px | caption = నవయుగ వైతాళికుడు | birth_name = | birth_date = ఏప్రిల్ 16, 1848 | birth_place = రాజమండ్రి | native_place = | death_date =మే 27, 1919 | death_place = | death_cause = | known = సంఘసంస్కర్త, రచయిత | occupation = | title = రావుబహద్దూర్ | salary = | term = | predecessor = | successor = | party = | boards = | religion = | spouse = బాపమ్మ (కందుకూరి రాజ్యలక్ష్మమ్మ) | partner = | children = | father = సుబ్బారాయుడు | mother = పున్నమ్మ | website = | footnotes = | employer = | height = | weight = }} కందుకూరి వీరేశలింగం (ఏప్రిల్ 16, 1848 - మే 27, 1919) గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. సాహితీ వ్యాసంగంలోను కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.
భారత రక్షణ వ్యవస్థలో ఒకటయిన భారత సైనిక దళం (ఇండియన్ ఆర్మీ) ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం, అనగా ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది.