The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మౌలానా అబుల్ కలాం ఆజాద్ (నవంబర్ 11, 1888 — ఫిబ్రవరి 22, 1958) (బెంగాళీ: আবুল কালাম মুহিয়ুদ্দিন আহমেদ আজাদ, ఉర్దూ: ابو الکلام آزاد ) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించాడు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో ఒకరు.
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (బ-భ-మ)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (వ-శ-ష)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
సురేశ్ ప్రొడక్షన్స్ 'కలిసుందాం...రా' సూపర్‌హిట్టయి, బ్రహ్మాండమైన విజయం సాధించగా, ఉషాకిరణ్ మూవీస్ 'నువ్వే కావాలి' అనూహ్య విజయం సాధించి, చరిత్ర సృష్టించి, తెలుగు సినిమా కలెక్షన్లలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అత్యధిక కేంద్రాలలో 200 రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలచింది. 'అన్నయ్య', 'నువ్వు వస్తావని' సూపర్‌హిట్టయి, రజతోత్సవం జరుపుకున్నాయి.
భారత ఉపఖండంలో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్ర్యోద్యమము" (Indian Freedom Struggle) గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్ర్యోద్యమములో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్ మరియు ఇతర వలసపాలకుల పాలనను అంతమొందంచటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి.
ఝాన్సీ లక్ష్మీబాయి' అసలు పేర మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ పంచమీ నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు.
సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి . సరోజినీ దేవి 1925డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేతెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను) అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశం అనేకదమ్ తమ్ భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే(అగజ) పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాధనం హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రథమముగా పూజింపవలసినవాడు.
జీవిత విశేషాలు భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్పాల్, భీమాబాయ్ దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు.అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం (మందనగడ్ తాలూకాలో) కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు వంశీకులు మహార్ కులానికి చెందినవారు. బ్రిటీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ యొక్క సైన్యంలో అంబేద్కర్ పూర్వీకులు పనిచేశారు.
గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 15000 AC లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
'మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్‌కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ IIచే దైవ ఆశీర్వాదం ( బీటిఫికేషన్)మరియు బ్లెస్డ్ తెరెసా అఫ్ కలకత్తా బిరుదు పొందారు.
విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసంఖ్య పరంగా రెండవ పెద్దనగరం.ఇది కృష్ణా జిల్లా లో, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతంలతో, ఉత్తరాన బుడమేరు నదితో కృష్ణా నది ఒడ్డున ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది. మద్రాసు-హౌరా మరియు మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములకు విజయవాడ కూడలి.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.
తెలుగు-తెలుగు నిఘంటువు (ఆంగ్లం: Telugu-Telugu Dictionary) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు అకాడమి వారు ప్రచురించిన నిఘంటువు. తెలుగు అకాడమి వారు తెలుగు భాషకు ఒక సమగ్ర నిఘంటువు ప్రచురించాలనే లక్ష్యంతో "తెలుగు శబ్ద సాగరం" అనే పేరిట ఒక బృహన్నిఘంటువు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిఘంటువు నుంచి దాదాపు 65,000 ఆరోపాలు ఎంపిక చేసి కళాశాల స్థాయి విద్యార్థుల కోసం తెలుగు-తెలుగు నిఘంటువు పేరిట ఒక చిన్న నిఘంటువును ముందుగా ప్రచురించాలని అకాడమి సంకల్పించింది.
జవాహర్లాల్ నెహ్రూ రాజకీయ జీవితం, 1945-1947
1945 నుంచి 1947 వరకూ సాగిన జవాహర్లాల్ నెహ్రూ రాజకీయ జీవితాన్ని నమోదుచేస్తుంది ఈ వ్యాసం. 1945 జూన్ 15న రెండేళ్ళ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలపు జైలు జీవితాన్ని ముగించుకుని భారత దేశంలో రాజ్యాంగ సభ, డొమినియన్ల ఏర్పాటుకు బ్రిటీష్ వారు ప్రారంభించిన సంప్రదింపుల్లో పాల్గొనడం ప్రారంభించిన నెహ్రూ మరో రెండేళ్ళ పాటు రకరకాల రాజకీయ వ్యవహారాల్లో తలమునకలయ్యాడు. 1945లో వేవెల్ ప్రారంభించిన సంప్రదింపులకు ఆహ్వానం లేక వెళ్ళకపోయినా, తర్వాత కేంద్ర, రాష్ట్రాల శాసన సభల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసి జనరల్ నియోజకవర్గాల్లో గెలవడంలో తన పాత్ర పోషించాడు.
భారతదేశంలో మూడవ పెద్ద నదులు, దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది అయిన కృష్ణా నదిని తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించిన కృష్ణానది ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1, 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
లక్ష్మి (Lakshmi) లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. త్రిమూర్తిలలో ఒకరైన విష్ణువు నకు ఇల్లాలు.భృగు పుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపవశమున క్షీర సాగరమథన సమయంలో ఉద్భవించింది. జైనమతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టనష్టాలనుండి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుంది.
బాబ్రీ మసీదు (హిందీ: बाबरी मस्जिद, (ఉర్దూ|بابری مسجد), అనువాదం: బాబర్ మసీదు ), ఇది ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలోని నగరమైన అయోధ్యలోని రామ్‌కోట్ హిల్ ("రాముడి కోట") పైన ఉన్న ఒక మసీదు. మసీదుకు ఎలాంటి హానీ జరగదని ఊరేగింపు నిర్వాహకులు భారతీయ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ, ఒక రాజకీయ ఊరేగింపు 150,000 మంది,తో కూడిన దొమ్మీలాగా మారినప్పుడు ఇది 1992లో ధ్వంసం చేయబడింది. ముంబై మరియు ఢిల్లీతో సహా అనేక భారతీయ ప్రధాన నగరాల్లో చెలరేగిన అల్లర్లలో 2,000కు పైగా ప్రజలు, ఎక్కువమంది ముస్లింలు చంపబడ్డారు.భారత దేశపు మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశానుసారం ఈ మసీదు 1527లో నిర్మించబడింది.
ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశాన్ని గ్రంథాలయము అని అంటారు. తెలుగులో గ్రంథాలయాల కొరకు ఉద్యమము నడిపి, దానిని వ్యాప్తి చేసి గ్రంథాలయ పితామహుడు అనే పేరు పొందినవాడు అయ్యంకి వెంకట రమణయ్య. అతని తదనంతరం ఉద్యమాన్ని ఉధృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.
కార్తీకదీపం (బుల్లితెర ధారావాహిక)
కార్తీక దీపం ఒక భారతీయ తెలుగు బుల్లితెర ధారావాహిక, ఇది స్టార్ మాలో సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు ప్రసారం అవుతుంది మరియు హాట్‌స్టార్‌లో కూడా ప్రసారం అవుతుంది. ప్రెమి విశ్వనాథ్ ఈ ధారావాహికలో ప్రధాన పాత్రధారులు. ప్రదర్శన ప్రారంభమైనప్పటి నుండి రేటింగ్స్ చార్టులో స్థిరంగా అగ్రస్థానంలో ఉంది.
కల్పనా చావ్లా (మార్చి 17, 1962 – ఫిబ్రవరి 1, 2003), ఈమె ఒక ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. Samad ==బాల్యం== Samad కల్పనా చావ్లా భారత దేశంలోని హర్యానా రాష్ర్టంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17 న జన్మించింది. ఆమె పాఠశాలలో చేరినప్పుడు రికార్డుల ప్రకారం అధికార జన్మదినం జూలై 1 1961కి మార్చారు.
టైఫాయిడ్ జ్వరం, ఆంత్రిక జ్వరం, సాల్మొనెల్ల టైఫి గా కూడా పిలువబడుతుంది లేదా సాధారణంగా టైఫాయిడ్ అంటారు, ఈ వ్యాధి సాల్మొనెల్ల ఎంటేరికా సరోవర్ టైఫి అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సాధారణంగా ఉన్న ఈ వ్యాధి, వ్యాధి బారినపడ్డ వ్యక్తి యొక్క మలం ద్వారా కలుషితమైన ఆహారం లేదా నీటిని కడుపులోకి తిన్నపుడు వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా ప్రేగు గోడకు రంధ్రం చేస్తాయి మరియు మాక్రో ఫాజేస్చే ఫాగో సైటోస్ చేయబడతాయి.సాల్మొనెల్ల టైఫి అప్పుడు నాశనాన్ని ఎదుర్కోవడానికి తన రూపాన్ని మార్చుకుంటుంది మరియు మాక్రోఫేజ్ లోపల ఉండటానికి అవకాశం ఇస్తుంది.ఇది వాటిని PMNల యొక్క నాశనం నుండి రక్షిస్తుంది, పూరిస్తుంది మరియు నిరోధక ప్రతిస్పందన కలిగిస్తుంది.మాక్రోఫేజేస్ ఉన్నపుడు జీవి శోషవాహిక నుండి వ్యాపిస్తుంది.ఇది వాటికి రేటిక్యులోఎండోథెలియల్ సిస్టంలోకి ప్రవేశాన్ని కల్పిస్తుంది మరియు అక్కడి నుండి ఇతర భాగాలలోకి శరీరమంతా వ్యాపిస్తుంది.