The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
జవాహర్లాల్ నెహ్రూ రాజకీయ జీవితం, 1945-1947
1945 నుంచి 1947 వరకూ సాగిన జవాహర్లాల్ నెహ్రూ రాజకీయ జీవితాన్ని నమోదుచేస్తుంది ఈ వ్యాసం. 1945 జూన్ 15న రెండేళ్ళ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలపు జైలు జీవితాన్ని ముగించుకుని భారత దేశంలో రాజ్యాంగ సభ, డొమినియన్ల ఏర్పాటుకు బ్రిటీష్ వారు ప్రారంభించిన సంప్రదింపుల్లో పాల్గొనడం ప్రారంభించిన నెహ్రూ మరో రెండేళ్ళ పాటు రకరకాల రాజకీయ వ్యవహారాల్లో తలమునకలయ్యాడు. 1945లో వేవెల్ ప్రారంభించిన సంప్రదింపులకు ఆహ్వానం లేక వెళ్ళకపోయినా, తర్వాత కేంద్ర, రాష్ట్రాల శాసన సభల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసి జనరల్ నియోజకవర్గాల్లో గెలవడంలో తన పాత్ర పోషించాడు.
విస్తారమైన భౌగోళిక, విభిన్న నైసర్గిక ఆకృతి వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశ వాతావరణాన్ని ఒకేలా వివరించడం కష్టతరం చేస్తుంద. కోపెను వాతావరణ వర్గీకరణ ఆధారితంగా భారతదేశ వాతావరణం ఆరు ప్రధాన విభాగాలుగా విభజించబడింది: పశ్చిమప్రాంతంలో శుస్క ఎడారి, ఉత్తరాన హిమానీనదాలు, ఆల్పైను టండ్రా, నైరుతిప్రాంతంలోని ద్వీప భూభాగాల్లో వర్షారణ్యాలకు మద్దతు ఇస్తున్న తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో వివిధ రకాల మైక్రోక్లిమేట్లు ఉంటాయి.
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (బ-భ-మ)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
భారత స్వాతంత్ర్యోద్యమంలో జవాహర్ లాల్ నెహ్రూ
1920ల్లో ప్రారంభించి 1945-47 వరకూ జవాహర్ లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర్యోద్యమంలో వహించిన పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. తండ్రి మోతీలాల్ నెహ్రూ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కావడంతో పాటుగా కేంబ్రిడ్జిలో చదువుకున్న రోజుల్లోనే వలసవాద వ్యతిరేకత మొగ్గతొడిగింది.
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (వ-శ-ష)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆదేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే "జాతీయ పండుగ" దినం. భారతదేశంలో గణతంత్ర దినోత్సవము మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవంగా జరుపు కుంటారు.ఈ రోజున బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటయింది.భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యము వచ్చింది. దేశానికి రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది.
20వ శతాబ్దం పూర్వభాగంలో పల్లెల్లో తెలుగు ప్రజల జీవనవిధానం
భారత దేశ జనాభాలో ఎనబై శాతం వ్యవసాయ దారులే. వీరిలో వ్యవసాయదారులు, వ్యవసాయ సంబంధిత పనులలో పనిచేసే వారు ఉన్నారు. సాంప్రదాయ వ్యవసాయం రాను రాను యాంత్రీకరణం వైపు పరుగిడుతున్నది.
సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి . సరోజినీ దేవి 1925డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.
ఇతరవాడుకలు రిపబ్లిక్ ఆఫ్ చైనా లేదాతైవాన్ చైనా అని సాధారణంగా పిలువబడే చైనా ప్రజల గణతంత్రం (ఆంగ్లము: People's Republic of China పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) తూర్పు ఆసియాలో అతిపెద్ద దేశం, మరియు ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి. 130 కోట్ల (1.3 బిలియన్) పైగా జనాభాతో ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల దేశంగా చైనా ఉంది. చైనా రాజధాని నగరం బీజింగ్ (Beijing).అతిపెద్ద నగరం షాంఘై (shangai).చైనా ఏక పార్టీ పాలిత దేశం.
విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసంఖ్య పరంగా రెండవ పెద్దనగరం.ఇది కృష్ణా జిల్లా లో, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతంలతో, ఉత్తరాన బుడమేరు నదితో కృష్ణా నది ఒడ్డున ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది. మద్రాసు-హౌరా మరియు మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములకు విజయవాడ కూడలి.
ఝాన్సీ లక్ష్మీబాయి' అసలు పేర మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ పంచమీ నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు.
గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 15000 AC లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (ఆంగ్లం:International Men's Day లేదా IMD) ప్రతి సంవత్సరం నవంబరు 19 న అంతర్జాతీయా స్థాయిలో జరుపబడే ఉత్సవం. 7 ఫిబ్రవరి 1992న ప్రొఫెసర్ థామస్ ఓస్టర్ చే ఈ దినము ప్రారంభించబడిననూ, ట్రినిడాడ్ మరియు టొబాగో దేశస్థులు దీనికి కొత్త ఊపిరులు ఊదారు. దక్షిణ ఐరోపాకు చెందిన మాల్టా దీవిలో ఈ ఉత్సవాన్ని 7 ఫిబ్రవరి 1994 నుండి క్రమం తప్పక జరుపుతున్నారు.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.
జీవిత విశేషాలు భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్పాల్, భీమాబాయ్ దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు.అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం (మందనగడ్ తాలూకాలో) కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు వంశీకులు మహార్ కులానికి చెందినవారు. బ్రిటీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ యొక్క సైన్యంలో అంబేద్కర్ పూర్వీకులు పనిచేశారు.
ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశాన్ని గ్రంథాలయము అని అంటారు. తెలుగులో గ్రంథాలయాల కొరకు ఉద్యమము నడిపి, దానిని వ్యాప్తి చేసి గ్రంథాలయ పితామహుడు అనే పేరు పొందినవాడు అయ్యంకి వెంకట రమణయ్య. అతని తదనంతరం ఉద్యమాన్ని ఉధృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.
ఘట్టమనేని కృష్ణ (పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి, కృష్ణ అన్న పేరుతో ప్రఖ్యాతుడు) ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం : Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ.1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఈ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది - పంజాబ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ మరియు ఛత్తీస్‌ఘఢ్.
రాజకీయ నాయకునిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా మాత్రమే కాక జవాహర్లాల్ నెహ్రూ రచయితగా విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1928 నుంచి పలుమార్లు తాను అనుభవించిన జైలు జీవితంలో ఖాళీ సమయాన్ని అధ్యయనంతో పాటుగా తన కుమార్తె ఇందిరకు ప్రపంచ చరిత్ర మీద ఉత్తరాలుగా రాయడంతో ప్రారంభించి క్రమేపీ పలు విశిష్టమైన, ప్రాచుర్యం పొందిన రచనలు చేశాడు. 1918 నాటికే తండ్రి ప్రారంభించిన ఇండిపెండెంట్ పత్రిక సంపాదకత్వ బాధ్యతలతో పాటు వ్యాసరచన కూడా చేసేవాడు.
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేతెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను) అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశం అనేకదమ్ తమ్ భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే(అగజ) పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాధనం హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రథమముగా పూజింపవలసినవాడు.
టిక్ టాక్ యాప్ అనేది 15 సెకన్ల వీడియోను సృష్టించడానికి ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ పరిమాణం 72 MB. టిక్ టాక్ యాప్ 38 భాషలు భాషల్లో అందుబాటులో ఉంది.అరబిక్, బెంగాలీ, బర్మీస్, సేబుఆనో, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, గుజరాతి, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, జావనీస్, కన్నడ, కొరియన్, మలయ్, మలయాళం, మరాఠీ, ఒరియా, పోలిష్, పోర్చుగీస్, పంజాబీ, రష్యన్, సరళీకృత చైనీస్, స్పానిష్ , స్వీడిష్, తగలోగ్, తమిళం, తెలుగు, థాయ్, చైనీస్, టర్కిష్, ఉక్రేనియన్, వియత్నామీస్ భాషల్లో ఉంది.
గమనిక భగవద్గీత అధ్యాయానుసారం (సంస్కృతం తెలుగు లిపిలో) పూర్తి పాఠము వికీసోర్స్లో ఉంది. భగవద్గీత ఒక్కో శ్లోకానికీ తెలుగు అనువాదం వికీసోర్స్లో ఉన్నది: భగవద్గీత (తెలుగు అనువాదము) భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది.
కార్తీకదీపం (బుల్లితెర ధారావాహిక)
కార్తీక దీపం ఒక భారతీయ తెలుగు బుల్లితెర ధారావాహిక, ఇది స్టార్ మాలో సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు ప్రసారం అవుతుంది మరియు హాట్‌స్టార్‌లో కూడా ప్రసారం అవుతుంది. ప్రెమి విశ్వనాథ్ ఈ ధారావాహికలో ప్రధాన పాత్రధారులు. ప్రదర్శన ప్రారంభమైనప్పటి నుండి రేటింగ్స్ చార్టులో స్థిరంగా అగ్రస్థానంలో ఉంది.
శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.