The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.
జీవిత విశేషాలు భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్పాల్, భీమాబాయ్ దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు.అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం (మందనగడ్ తాలూకాలో) కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు వంశీకులు మహార్ కులానికి చెందినవారు. బ్రిటీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ యొక్క సైన్యంలో అంబేద్కర్ పూర్వీకులు పనిచేశారు.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు
భారతదేశంలో ప్రాథమిక హక్కులు (ఆంగ్లం : Fundamental Rights in India' ref>
ఐక్యరాజ్య సమితి (ఆంగ్లం: United Nations) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (వ-శ-ష)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 15000 AC లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
2001, జనవరి 15న మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞానసర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్ మరియు లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియు మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. పలువురి ఆదరాభిమానాలు చూరగొని వీక్షకుల వలన విజయవంతమై,అంతర్జాలంలో ప్రజాదరణ పొందిన వెబ్ సైట్లలో 2017 నాటికి మన వికీపీడియా 5వ స్థానంలో ఉంది.
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (బ-భ-మ)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
ఝాన్సీ లక్ష్మీబాయి' అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు.
కళ్యాణలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకం. 2017, మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ లో ఈ పథక ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుండి రూ.75,116 లకు పెంచారు. 2018, మార్చి 19న రూ.1,00,116 కు పెంచారు.
యూట్యూబు అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (జూలై 8, 1949 - సెప్టెంబర్ 2, 2009) ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4 సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
వాతావరణ శాస్త్రంలో, భూమి తిరిగే దిశలో భ్రమణం చేసే మూయబడిన, వృత్తాకార ద్రవ చలనాలను తుఫాన్ అని అంటారు . దీన్ని సాధారణంగా భూమి యొక్క ఉత్తర అర్ధ గోళంలో లోపలకి అపసవ్య దిశలో భ్రమించే సర్పిలాకార గాలులుగా మరియు దక్షిణ అర్ధ గోళంలో సవ్య దిశలో భ్రమించే గాలులుగా పేర్కొనబడతాయి. భారీ తుఫాను వ్యాప్తి దాదాపు ఎల్లప్పుడూ తక్కువ వాతావరణ పీడనం గల ప్రాంతాలపై కేంద్రీకృతమవుతాయి.
'మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ IIచే దైవ ఆశీర్వాదం ( బీటిఫికేషన్)మరియు బ్లెస్డ్ తెరెసా అఫ్ కలకత్తా బిరుదు పొందారు.
" భారతదేశ చరిత్ర " భారత ఉపఖండంలో చరిత్రపూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం మరియు హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు.
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం మరియు రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత . అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం మరియు బద్ధకం దీని ముఖ్య లక్షణాలు.
మానవ హక్కులు (Human Rights) అనేవి "మానవులకు సంక్రమించే హక్కులు మరియు స్వేచ్ఛలు." ఈ భావనను ప్రతిపాదించిన వారు సాధారణంగా ప్రతి ఒక్కరు వారు కేవలం మానవులు అయిన కారణంగానే కొన్ని హక్కులకు అర్హులని పేర్కొన్నారు. కాబట్టి మానవ హక్కులు అనేవి ఒక సార్వత్రిక మరియు సమసమాజ శైలికి చెందినవి. వాస్తవ మానవ నైతికత యొక్క భాగంగా మాత్రమే అటువంటి హక్కులు ఉంటాయి, ఎందుకంటే న్యాయబద్ధ నైతిక సూత్రాలు లేదా సహజ హక్కులు బలమైన కారణాలచే లభిస్తాయి, లేదా అంతర్జాతీయ చట్టం పరిధిలో లేదా జాతీయ స్థాయిలో చట్టబద్ధమైన హక్కులుగానో లభిస్తాయి.
1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర దామోదర్దాస్ మోదీ (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి.
హైదరాబాదు, తెలంగాణ రాజధాని మరియు ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని, హైదరాబాదు జిల్లా మరియు రంగారెడ్డి జిల్లాల ముఖ్యపట్టణం. హైదరాబాదు నగరము సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు, దేవాలయములకు, చక్కని కళలకు, హస్తకళలకు మరియు నాట్యానికి ప్రసిద్ధి. హైదరాబాదు భారత దేశములో ఐదవ అతిపెద్ద మహానగరము.
ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశాన్ని గ్రంథాలయము అని అంటారు. తెలుగులో గ్రంథాలయాల కొరకు ఉద్యమము నడిపి, దానిని వ్యాప్తి చేసి గ్రంథాలయ పితామహుడు అనే పేరు పొందినవాడు అయ్యంకి వెంకట రమణయ్య. అతని తదనంతరం ఉద్యమాన్ని ఉధృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.
లైంగిక విద్య (ఆంగ్లం: Sex Education) అనగా మానవ లైంగికత (మానవ లైంగిక శరీరనిర్మాణశాస్త్రముతో సహా), లైంగిక పునరుత్పత్తి, సంభోగము, పునరుత్పత్తి ఆరోగ్యం, భావోద్రేక సంబంధాలు, పునరుత్పత్తి హక్కులు మరియు విధులు, లైంగిక సన్యాసం మరియు కుటుంబ నియంత్రణల గురించి తెలిపే విధివిధానాలు. తద్వారా లైంగిక వ్యాధులు రాకుండా ఎలా జాగ్రత్తవహించాలో కూడా అర్ధం చేసుకోవడానికి వీలుకలుగుతుంది. పలు సాంప్రాదాయాలలో లైంగిక జ్ఞానం నిషిద్ధం అనే భావన నెలకొని ఉండటం మూలాన కౌమారదశలో ఉన్న బాలబాలికలకు లైంగిక విద్యను నేర్పేవారు కారు.
పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత మరియు లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం.
దేశాల జాబితా - ఐక్య రాజ్య సమితి సభ్యులు
ఐక్య రాజ్య సమితిలో సభ్యులు (List of countries in the United Nations) ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి. 2017 నాటికి ఐక్య రాజ్య సమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రతి సభ్య దేశమూ ఐ.రా.స.
భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 – 1931 మార్చి 23) స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీదిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు.విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.భారత స్వాతంత్ర్యోద్యమము లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు.
అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (International Standard Book Number - ISBN) అనేది ఒక విశిష్ట సంఖ్యా వాణిజ్య పుస్తక గుర్తింపు. ఐఎస్బిఎన్ అనేది ప్రతి ఎడిషన్ మరియు వైవిధ్యానికి (పునర్ముద్రణకు తప్ప) కేటాయించబడుతుంది. ఉదాహరణకు, ఇ-పుస్తకం, పేపర్బ్యాక్ మరియు అదే పుస్తకం యొక్క గ్రంథాలయ ప్రతి -ప్రతిదీ ఒక విభిన్న ISBN కలిగి వుంటుంది.