The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికలు ప్రకటించింది. ఈ ప్రకటన ననుసరించి 2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్సభకు రాష్ట్రమంతటా పోలింగు జరిగింది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరుగుతుంది.
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (జూలై 8, 1949 - సెప్టెంబర్ 2, 2009) ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4 సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు .
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లేదా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లోని ఒకానొక రాజకీయ పార్టీ. కే.శివ కుమార్ ద్వారా స్థాపించబడి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ వై.యస్.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2014)
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2014 సార్వత్రిక ఎన్నికలతో సహా 2014 రాష్ట్రంలో ఎన్నికలు ఏడవ దశ (30 ఏప్రిల్, 2014), ఎనిమిదవ దశ (7 మే, 2014)ల్లో నిర్వహించారు. అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన చివరి ఎన్నికలు ఇవే, విభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో తెదేపా, భాజపా కలసి జనసేన మద్ధతుతో పోటీ చేసి అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణలో తెరాస ఏకపక్షంగా పోటీచేసి అధికారంలోకి వచ్చింది.
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (బ-భ-మ)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (వ-శ-ష)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ను ది.2-3-2017న అమరావతిలో ప్రారంభించారు [1] ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ (అసెంబ్లీ) చరిత్రలో, రెండు సభలతోను మరియు ఒక సభతోను, రెండు విధాలుగా నిర్వహించబడింది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసనసభ అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసన మండలి సభ అని అంటారు. శాసనసభను దిగువసభ అని, శాసన మండలి సభను ఎగువ సభ అని కూడా అంటారు.
1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర దామోదర్దాస్ మోదీ (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ఠ్రానికి చెందిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీని ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)
తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ ఎన్నికలు 2018 డిసెంబరు 7న జరిగాయి. ఈ ఎన్నికలలో పాల్గొన్నవాటిలో మొదటి శాసనసభలోని అదికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి, భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ జనసమితి మరియు తెలుగుదేశం పార్టీలు ప్రధానమైనవి. గతంలో అధికారంలోఉన్న తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని ఓడించడానికి నాలుగు ప్రతిపక్ష పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీ మరియు సి.పి.ఐ పార్టీలు కలసి "మహా కూటమి" గా ఏర్పడి పోటీ చేసాయి.
ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు :ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన జరగక ముందు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 294 నియోజకవర్గాలున్నాయి. శాసనసభలో మొత్తం 295 మంది శాసనసభ్యులు (ఎమ్.ఎల్.ఎ. లు) ఉండేవారు.
ప్రత్తిపాడు (తూ.గో జిల్లా) శాసనసభ నియోజకవర్గం
తూర్పు గోదావరిజిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం ఒకటి.
పొంగూరు నారాయణ (జననం: జూన్ 15, 1956) ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు, నాలుగేళ్ల కిందట వచ్చిన ఈ పదవి కన్నా ముందే ఆసియాలో అతిపెద్ద విద్యాసంస్థకు బీజం వేసిన విద్యావేత్తగా ఆయన తెలుగు ప్రజలకు చిరపరిచితం. విద్యారంగంలో పి.నారాయణ సాధించిన విజయాలు ఆయనలోని ఓ పార్శ్వాన్ని స్పృశిస్తే, ఇప్పుడు నూతన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలు నారాయణ లోని ఇంకో కోణాన్ని చూపిస్తున్నాయి. ఎంచుకున్న రెండు రంగాల్లో అద్వితీయ విజయాలు సాధించిన పొంగూరు నారాయణ జీవితం పూల పాన్పు కాదు.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 15000 AC లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గం
తెలంగాణ లోని 17 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గంలు ఉన్నాయి.
రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం
తూర్పు గోదావరి జిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిపాలనకి ములస్తంభం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాబినెట్. జూన్ 8, 2014 న సంయుక్త రాష్ట్రల గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాబినెట్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 20 మంది మంత్రులు ప్రమాణం చేసారు.
ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం
తూర్పు గోదావరి జిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం ఒకటి. ముమ్మిడివరం షెడ్యులు కులాల వారికి ప్రత్యేకించబడింది. 1999 ఎన్నికల సమయానికి నియోజకవర్గంలో 1,35,049 ఓటర్లు ఉన్నారు.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
తూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం
విశాఖపట్నం జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో తూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం
విశాఖపట్నం జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం ఒకటి.
రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం
తూర్పు గోదావరి జిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం ఒకటి. గతంలో ఉన్న కడియం నియోజకవర్గానికి బదులుగా, 2009 శాసనసభల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేసారు.