The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
కొమురం భీమ్, (అక్టోబర్ 22, 1901 - అక్టోబర్ 27, 1940) హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.
నవ్రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి (సంస్కృతము, హిందీ : नवरात्रि, బెంగాలీ : নবরাত্রি, గుజరాతీ : નવરાત્રી, కన్నడ :ನವರಾತ್ರಿ, తెలుగు : విజయ దశమి, మలయాళం: നവരാത്രി, మరాఠి : नवरात्रि, తమిళం: நவராத்திரி) అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ, ఇందులో నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగం. నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.
గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుష్యడి తాలూకు విత్తనానికి (లేక వీర్యకణానికి) జన్మనిచ్చేది మాత్రం పురుషుడే కాబట్టి గోత్రము మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది.గోత్రము అనగా గో అంటే గోవు, గురువు, భూమి, వేదము అని అర్థములు. ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు, కపిలగోవువారు, తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు.ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట, భరద్వాజ, వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు.తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ .కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు.పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్ లో కొత్త వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 1500 BC లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
లకుముకి పిట్ట ( ఆంగ్లము Kingfisher) అందమైన రంగుల పక్షి.ఇవి అందమైన రంగురంగుల పక్షులజాతికి (కొరాసిఫార్మ్స్) చెందింది. ఇవి లేత, మధ్య తరహా నుండి ముదురు రంగులతో అనేక సైజుల్లో ఉన్న ఈ సమూహాన్ని 'ఆల్సెడినిడె' అనే ఒకే ఒక కుటుంబంగానూ, మూడు ఉప కుటుంబాలుగానూ ఉంటాయి.ఇవి ఆల్సెడినిడె అనే నదీ కింగ్ ఫిషర్లు, హల్క్యోనిడె అనే చెట్టు కింగ్ ఫిషర్లు, సెరిలిడె అనే నీటి కింగ్ ఫిషర్లు అని మూడు కుటుంబాలుగా ఉన్నట్లు తెలుస్తుంది కింగ్ ఫిషర్లు జాతులలో సుమారు 90 రకాలు ఉన్నట్లు తెసుస్తుంది.
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
వయస్సు , అంతస్తు తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తైదువులు, ఆడపిల్లలంతా అంబరాన్ని అంటే సంబరముతో కలిసి ఆడుకునే , పాడుకొనే తెలంగాణ బతుకమ్మ పాట
అశోక చక్రవర్తి (హిందీ: अशोक) (అశోక ది గ్రేటు) ; (క్రీ.పూ.304–క్రీ.పూ.232) (రాచరిక మకుటము: "దేవానాంప్రియ ప్రియదర్శీ'" అనగా "దేవతల ప్రీతిపాత్రుడు, చూపులకు అందమైనవాడు") క్రీ.పూ.273 నుండి క్రీ.పూ.232 వరకు మౌర్య సామ్రాజ్యంను పరిపాలించిన గొప్ప చక్రవర్తి. అశోకుడు (బ్రహ్మి: 𑀅𑀲𑁄𑀓, అశోకా ఇ.ఎ.ఎస్.టి: అకోకా, ఇంగ్లీషు ఉచ్చారణ: / əˈʃoʊkə /) కొన్నిసార్లు అశోక ది గ్రేట్, మౌర్య రాజవంశం భారతీయ చక్రవర్తి, ఆయన దాదాపు అన్ని భారత ఉపఖండాలను క్రీ.పూ. 268 నుండి 232 వరకు పరిపాలించాడు.
యేసు (Jesus) (క్రీ.పూ 0 నుండి క్రీ.శ 26–36 వరకు) యేసు అనగా రక్షకుడు అని అర్థం.... ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన మాట యేసు అనే పదము ఎందుకంటే అనేకమంది ఏసు అనే పేరు గల వారు ఆ ప్రాంతంలో ఉన్నను ఏసుక్రీస్తు అనే మాట ప్రపంచ గమనాన్ని మార్చింది. దుర్మార్గుని శిక్షించు సన్మార్గుని రక్షించు అని అని ఇతర మత గ్రంథాలు చెబుతుంటే ఏసుప్రభు మాత్రము పాపిని ప్రేమించిన మహా మనిషి దేవుని కుమారుడైన యేసు ....
భారత రాజ్యాంగం (అధికారికంగా భారత సంవిధానము సంస్కృతం: भारतस्य संविधानम् నుండి; హిందీ: भारत का संविधान; English: Constitution of India) భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన అతను, తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
మార్టిన్ లూథర్ (ఆంగ్లం : Martin Luther) (1483 నవంబరు 10 - 1546 ఫిబ్రవరి 18) జెర్మనీకి చెందిన ఒక సన్యాసి, మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్, ప్రొటెస్టెంటిజంకు చెందిన ఒక ఫాదర్,, చర్చి సంస్కర్త, ఇతడి ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పశ్చిమ నాగరికతను మార్చివేసాయి.లూథర్ యొక్క ధర్మ శాస్త్రము పోప్ యొక్క ఆధిక్యతను ప్రశ్నించింది, లూథర్ ప్రకారం క్రైస్తవ ధర్మశాస్త్రము బైబిల్ ఆధారంగా మాత్రం పొందగలమని, చర్చీలు, పోపు ద్వారా కాదని ప్రకటించాడు. క్రీస్తుద్వారా బాప్తిజం పొందినవారు మాత్రమే విశ్వవ్యాపిత విశ్వాసులు అని చాటాడు. లూథర్ ప్రకారం, మోక్షము అనునది దైవ ప్రసాదము, దీనిని సత్యవంత 'పశ్చాత్తాపం', యేసు పట్ల విశ్వాసము ఉంచేవారే పొందగలరు.
శ్రీదేవీ భాగవత పురాణము, ఒక శాక్తేయ పురాణము. ఇదీ, మార్కండేయ పురాణములోని దేవీ మహాత్మ్యము శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇది ఒక ఉప పురాణము అని కొందరు అన్నప్పటికీ, గ్రంథంలో మాత్రం ఇది మహా పురాణము అని ఉంది.ఈ గ్రంథాలలో పరాశక్తియైన శ్రీమాతయే సకల సృష్టిస్థితిలయకారిణియైన పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పబడింది.
వేణుమాధవ్ (సెప్టెంబరు 28, 1969 - సెప్టెంబరు 25, 2019) తెలుగు సినిమా హాస్యనటుడు. మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్, 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి, 400లకు పైగా సినిమాల్లో నటించాడు. 2006 లో లక్ష్మి సినిమాకు గాను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు.
కార్తికేయ గుమ్మకొండ, దక్షిణాది చిత్రాలతో పేరొందిన నటుడు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆర్ఎక్స్ 100 తో తన మొదటి విజయం సాధించడమే కాక తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. హీరో నాని నటించిన నాని గ్యాంగ్ లీడర్ లో ప్రతినాయకుడిగా నటించడమే కాక, గుణ 369, 90ఎంఎల్ చిత్రాల ద్వారా కమర్షియల్ హీరోగా కూడా మంచి విజయాలు సాధించాడు.