The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో నిర్మిస్తున్న ఒక స్మారక కట్టడం పేరు స్టాట్యూ ఆఫ్ యూనిటీ. దీనిని తెలుగులో ఐక్యతా ప్రతిమ లేక ఐక్యతా విగ్రహం అని అంటారు. ఈ విగ్రహాన్ని గుజరాత్లో నర్మదానది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు నిర్ణయించి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంను నవంబరు 1వ తేదీగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్ర ప్రదేశ్ గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది.
కొమురం భీమ్, (అక్టోబర్ 22, 1901 - అక్టోబర్ 27, 1940) హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.
జాతీయ ఐక్యతా దినోత్సవం ను భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31న జరుపుకోవాలని భారత ప్రభుత్వం గుర్తించి 24-10-2014న ప్రకటించింది. గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్దం నరేంద్రమోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నర్మదా నదితీరంలో ప్రపంచంలోనే ఎతైన ఐక్యతా ప్రతిమ అనే లోహ విగ్రహాన్ని నిర్మించడానికి సిద్దమయ్యారు. ఈ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర, జిల్లా అన్ని స్థాయిల్లో కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని భారత హోంమంత్రి రాజ్ నాథ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
బ్రిటిషు పరిపాలనా కాలంలో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ బ్రిటిషు పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ ప్రెసిడెన్సీ నుండి విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని కోరుతూ తెలుగువారు ఉద్యమించారు. పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో ఉచ్ఛస్థాయికి చేరిన ఈ ఉద్యమం ఆయన మరణం తర్వాతనే సఫలీకృతమైంది.
మార్టిన్ లూథర్ (ఆంగ్లం : Martin Luther) (1483 నవంబరు 10 - 1546 ఫిబ్రవరి 18) జెర్మనీకి చెందిన ఒక సన్యాసి, మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్, ప్రొటెస్టెంటిజంకు చెందిన ఒక ఫాదర్,, చర్చి సంస్కర్త, ఇతడి ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పశ్చిమ నాగరికతను మార్చివేసాయి.లూథర్ యొక్క ధర్మ శాస్త్రము పోప్ యొక్క ఆధిక్యతను ప్రశ్నించింది, లూథర్ ప్రకారం క్రైస్తవ ధర్మశాస్త్రము బైబిల్ ఆధారంగా మాత్రం పొందగలమని, చర్చీలు, పోపు ద్వారా కాదని ప్రకటించాడు. క్రీస్తుద్వారా బాప్తిజం పొందినవారు మాత్రమే విశ్వవ్యాపిత విశ్వాసులు అని చాటాడు. లూథర్ ప్రకారం, మోక్షము అనునది దైవ ప్రసాదము, దీనిని సత్యవంత 'పశ్చాత్తాపం', యేసు పట్ల విశ్వాసము ఉంచేవారే పొందగలరు.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 1500 BC లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ .కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు.పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్ లో కొత్త వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన అతను బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి.
భారత రాజ్యాంగం (అధికారికంగా భారత సంవిధానము సంస్కృతం: भारतस्य संविधानम् నుండి; హిందీ: भारत का संविधान; English: Constitution of India) భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం.
మూస:Masturbation ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పోతుంది. ఇది సహజ ప్రక్రియ. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కలిగించడం, లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని స్వయంతృప్తి /హస్త ప్రయోగం (ఆంగ్లం: మాస్టర్బేషన్) అంటారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
"భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చే ఋగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం, హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక, నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు.
భారతదేశంలోని జంతు వేటను ప్రధాన వృత్తిగా కలిగియున్న అటవీతెగల్లో బోయ ఒకటి. బోయలను కన్నడబాషలో బేడర అని మలయాళములో"నాయర్"అని పిలుస్తారు.భారతీయ కులవ్యవస్థ విభాగం ప్రకారము సెంట్రల్ లిస్టులో O.B.C లుగా, తమిళ నాడు, కేరళ లలో B.C లుగా, ఆంధ్ర ప్రదేశ్ B.C-A గా,కర్ణాటకలో కేటగిరి 1 గా,అనగా వెనుకబడిన తరగతులుగా గుర్తింపబడుచున్నారు. వీరు అడవులలో నుండి వచ్చిన ట్రైబులు గా ST లుగా 1964 వరకూ భారత రాజ్యాంగములో తెలుప బడినారు.
'మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్‌కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో , ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది, పేద ప్రజల, నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల, కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం, మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి, విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ IIచే దైవ ఆశీర్వాదం ( బీటిఫికేషన్), బ్లెస్డ్ తెరెసా అఫ్ కలకత్తా బిరుదు పొందారు.
ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2005లో 93 కులాలున్న బీసీ కులాల జాబితా ఇప్పుడు 140 కి చేరింది. 'గ్రూప్ ఏలో 54, 'గ్రూప్ బిలో 28, 'గ్రూప్ సిలో 1, గ్రూప్ డిలో 47, గ్రూప్ ఇలో 14 కులాలున్నాయి.వెనుకబడిన కులాలకు మొత్తం ఉన్న 25% రిజర్వేషన్లలో గ్రూపు-ఏకు 7శాతం, గ్రూ పు-బీకి 10 శాతం, గ్రూపు-సీకి 1శాతం, గ్రూపు-డీకి 7శాతం రిజర్వేషన్లుంటాయి..
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ (Martin Luther King, Jr. ) (జనవరి 15, 1929 - ఏప్రిల్ 4, 1968) అమెరికాకు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు, ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు. ఇతడి ముఖ్య ఉద్దేశం అమెరికాలో పౌర హక్కులను కాపాడడంలో అభివృద్ధి సాధించడం,, ఇతడిని మానవహక్కుల పరిరక్షణా ప్రతినిధిగా నేటికినీ గుర్తింపు ఉంది.
కలర్ ఫోటో 2020, అక్టోబరు 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పానేని నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. సుహాస్ తొలిసారిగా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష, 'కంచరపాలెం' సుబ్బారావు తదితరులు నటించారు.
మలవిసర్జన కష్టతరమైనా, మామూలుగా కాక తక్కువసార్లు మలవిసర్జన జరుగుతున్నా దానిని ‘మలబద్దకం’గా పరిగణించాలి. ఈ విధంగా ఉన్నప్పుడు, మలవిసర్జన ప్రక్రియ కష్టతరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మలవిసర్జన చేసినప్పుడు, ఎక్కువ ముక్కినప్పుడు, అన్నవాహిక చివరి భాగంలో, మలద్వారానికి పైన పురీషనాళం చివరన వాచిపోయిన రక్తనాళాలను ‘‘మొలలు’’ (హెమరాయిడ్స్) అంటారు.