The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ .కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు.పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్ లో కొత్త వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు.
గూగుల్ ఇంక్, ఒక అమెరికన్ పబ్లిక్ కార్పోరేషన్. ప్రసిద్ధ అంతర్జాల శోధన యంత్రం (ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్-Google, వెబ్-ఆదారిత ఈ -మెయిల్ (G-mail, ఆన్ లైన్ మ్యాపింగ్ (maps.google, ఆఫీసు ప్రొడక్టివిటీ (Google Apps, సోషల్ నెట్ వర్కింగ్ (Orkut) ( గూగుల్ ప్లస్ ) వీడియో షేరింగ్ (youtube) మొదలగు బహుముఖ సేవలద్వారా ప్రపంచ వ్యాప్తంగా వెబ్ ట్రాఫిక్ పరంగా రెండవ స్థానములో ఉన్న సంస్థ (వెబ్సైటు) .
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన అతను బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 1500 BC లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
'మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్‌కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో , ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది, పేద ప్రజల, నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల, కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం, మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి, విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ IIచే దైవ ఆశీర్వాదం ( బీటిఫికేషన్), బ్లెస్డ్ తెరెసా అఫ్ కలకత్తా బిరుదు పొందారు.
తెలుగు వ్యాకరణము పై సిద్ధాంత గ్రంథము నన్నయ్య సంస్కృతంలో ఆంధ్రశబ్దచింతామణి అనే పేరుతో వ్రాశారు. ఆ తరువాత అధర్వణ, ఆహోబల సూత్రాలు, వార్తికాలు, భాష్యాలు వ్రాశారు.19వ శతాబ్దంలో చిన్నయసూరి సులభమైన తెలుగు వ్యాకరణంను బాలవ్యాకరణం అనే పేరుతో రాశారు.. నన్నయ ప్రకారం నియమాలు లేని భాషను గ్రామ్యం లేక అపభ్రంశం కావున సాహిత్యానికి పనికిరాదనేవారు.
భారత రాజ్యాంగం (అధికారికంగా భారత సంవిధానము సంస్కృతం: भारतस्य संविधानम् నుండి; హిందీ: भारत का संविधान; English: Constitution of India) భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
"భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
ఘట్టమనేని కృష్ణ (పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి) తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి.
కొమురం భీమ్, (అక్టోబర్ 22, 1901 - అక్టోబర్ 27, 1940) హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో కొమరం భీమ్ 1901 సంవత్సరంలో జన్మించాడు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
ఏర్నెస్టో"చే" గువేరా (జూన్ 14, 1928 – అక్టోబరు 9, 1967) చే గువేరా , ఎల్ చే , చే అని పిలుస్తారు. ఈయన ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి. ఆయన మరణించిన తరువాత, అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవభావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది.యుక్తవయసులో మెడికల్ విద్యార్థిగా ఉన్న గువేరా లాటిన్ అమెరికా అంతా పర్యటించారు, అక్కడ ఉన్న బీదరికం చూసి పరివర్తన చెందారు.
ప్రాకృతిక వ్యవసాయం (Organic Farming / సేంద్రీయ వ్యవసాయం) లో ప్రకృతిని, ప్రకృతి వనరులని పాడుచేయకుండ వ్యవసాయం చేయబడుతుంది. ప్రాంతీయ వాతావరణాన్ని, వాటి పునరుత్పాదక వనరులని అనుసరించి భారతదేశంలో ఆచరించబడుతున్నా ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతులున్నాయి. అవి మసనోబు ఫుకుఓకా (Masanobu Fukuoka / జపాన్), హ్యాన్ క్యుచో (కొరియా పద్ధతి, పాలేకర్ పద్ధతి.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
భారత జాతీయ పతాకం అన్నది దీర్ఘ చతురస్రాకారంలో కాషాయం, తెలుపు, పచ్చ రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది. 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది, 1947 ఆగస్టు 15న భారత డొమినియన్కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ భారత గణతంత్రానికి అధికారిక పతాకంగా స్వీకరించారు.
గురజాడ అప్పారావు gura jada (1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి.
ప్రపంచ తపాలా దినోత్సవం (World Post Day - వరల్డ్ పోస్ట్ డే) ను ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాపంగా అక్టోబరు 9 న జరుపుకుంటారు. స్విట్జర్లాండ్ లోని బెర్న్ లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) స్థాపనకు గుర్తుగా, ఇది స్థాపించిబడిన అక్టోబరు 9 న ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు రాయడానికి అనుమతించే గ్లోబల్ కమ్యూనికేషన్స్ విప్లవం యొక్క ఆరంభం.
మలవిసర్జన కష్టతరమైనా, మామూలుగా కాక తక్కువసార్లు మలవిసర్జన జరుగుతున్నా దానిని ‘మలబద్దకం’గా పరిగణించాలి. ఈ విధంగా ఉన్నప్పుడు, మలవిసర్జన ప్రక్రియ కష్టతరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మలవిసర్జన చేసినప్పుడు, ఎక్కువ ముక్కినప్పుడు, అన్నవాహిక చివరి భాగంలో, మలద్వారానికి పైన పురీషనాళం చివరన వాచిపోయిన రక్తనాళాలను ‘‘మొలలు’’ (హెమరాయిడ్స్) అంటారు.
అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.
లైంగిక విద్య (ఆంగ్లం: Sex Education) అనగా మానవ లైంగికత (మానవ లైంగిక శరీరనిర్మాణశాస్త్రముతో సహా), లైంగిక పునరుత్పత్తి, సంభోగము, పునరుత్పత్తి ఆరోగ్యం, భావోద్రేక సంబంధాలు, పునరుత్పత్తి హక్కులు, విధులు, లైంగిక సన్యాసం, కుటుంబ నియంత్రణల గురించి తెలిపే విధివిధానాలు. తద్వారా లైంగిక వ్యాధులు రాకుండా ఎలా జాగ్రత్తవహించాలో కూడా అర్ధం చేసుకోవడానికి వీలుకలుగుతుంది. పలు సాంప్రాదాయాలలో లైంగిక జ్ఞానం నిషిద్ధం అనే భావన నెలకొని ఉండటం మూలాన కౌమారదశలో ఉన్న బాలబాలికలకు లైంగిక విద్యను నేర్పేవారు కారు.
ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసం తెలుగులో పోతన రచించిన గ్రంధాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి. భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ.