The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ .కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు.పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్ లో కొత్త వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు.
చేజర్ల హేమంత కుమార్, శ్రీకాళహస్తి శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 15000 AC లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది . రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు.
భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి (2020)
భారతదేశంలో 2019–2020 కరోనా వైరస్ మొదటి కేసు 2020 జనవరి 30 న నమోదైనది.
నర్తనశాల (ఆంగ్లం: NarthanaSala) మహాభారతంలోని విరాట పర్వం కథాంశం ఇతివృత్తంగా నిర్మితమై 1963 సంవత్సరములో విడుదలైన తెలుగు సినిమా. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో దర్శకులకున్న ప్రతిభను ఈ సినిమా మరొక్కసారి ఋజువు చేసింది. నటులు, దర్శకుడు, రచయిత, గీత రచయిత, సంగీత కళాదర్శకులు - ఇలా అందరి ప్రతిభనూ కూడగట్టుకొని ఈ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
ఐక్యరాజ్య సమితి (ఆంగ్లం: United Nations) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి , మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
దేశాల జాబితా – జనసంఖ్య క్రమంలో
ఇది జనసంఖ్య క్రమంలో ప్రపంచంలోని దేశాల జాబితా. ఈ పట్టికలో స్వాధిపత్య రాజ్యాలూ, ఇతర దేశాలమీద ఆధారపడినా గాని స్వపరిపాలన సౌకర్యం కలిగిన భూభాగాలూ ఇవ్వబడ్డాయి. ఈ పట్టికలోని వివరాలు తీసుకొన్న వివిధ వనరులనుండి సేకరిచబడ్డాయి.
ఇతరవాడుకలు రిపబ్లిక్ ఆఫ్ చైనా లేదాతైవాన్ చైనా అని సాధారణంగా పిలువబడే చైనా ప్రజల గణతంత్రం (ఆంగ్లము: People's Republic of China పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) తూర్పు ఆసియాలో అతిపెద్ద దేశం, ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి. 130 కోట్ల (1.3 బిలియన్) పైగా జనాభాతో ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల దేశంగా చైనా ఉంది. చైనా రాజధాని నగరం బీజింగ్ (Beijing).అతిపెద్ద నగరం షాంఘై (shangai).చైనా ఏక పార్టీ పాలిత దేశం.
జీవిత విశేషాలు భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్పాల్, భీమాబాయ్ దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు.అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం (మందనగడ్ తాలూకాలో) కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు వంశీకులు మహార్ కులానికి చెందినవారు. బ్రిటీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ యొక్క సైన్యంలో అంబేద్కర్ పూర్వీకులు పనిచేశారు.
భారత జాతీయ పతాకం అన్నది దీర్ఘ చతురస్రాకారంలో కాషాయం, తెలుపు, పచ్చ రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది. 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది, 1947 ఆగస్టు 15న భారత డొమినియన్కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ భారత గణతంత్రానికి అధికారిక పతాకంగా స్వీకరించారు.
తెలుగు వ్యాకరణము పై సిద్ధాంత గ్రంథము నన్నయ్య సంస్కృతంలో ఆంధ్రశబ్దచింతామణి అనే పేరుతో వ్రాశారు. ఆ తరువాత అధర్వణ, ఆహోబల సూత్రాలు, వార్తికాలు, భాష్యాలు వ్రాశారు.19వ శతాబ్దంలో చిన్నయసూరి సులభమైన తెలుగు వ్యాకరణంను బాలవ్యాకరణం అనే పేరుతో రాశారు.. నన్నయ ప్రకారం నియమాలు లేని భాషను గ్రామ్యం లేక అపభ్రంశం కావున సాహిత్యానికి పనికిరాదనేవారు.
దేశాల జాబితా – వైశాల్యం క్రమంలో
వైశాల్య క్రమంలో ప్రపంచ దేశాల జాబితా ( List of countries and outlying territories by total area) ఇక్కడ ఇవ్వబడింది. ఈ జాబితాలో స్వాధిపత్య దేశాలు, స్వతంత్ర పాలనాధికారం కలిగిన అధీన దేశాలు కూడా పరిగణించబడ్డాయి. ఇక్కడ "మొత్తం దేశం వైశాల్యం" అంటే దేశంలో భూభాగం, ఆ భూభాగంలో ఉన్న జలాశయాలు, నదులు వంటి వాటి వైశాల్యం కూడా కలిపి లెక్కించబడింది.
ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసం తెలుగులో పోతన రచించిన గ్రంధాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి. భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ.
మూస:Masturbation ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పోతుంది. ఇది సహజ ప్రక్రియ. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కలిగించడం, లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని స్వయంతృప్తి /హస్త ప్రయోగం (ఆంగ్లం: మాస్టర్బేషన్) అంటారు.
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (వ-శ-ష)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి.
రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం (Second World War) అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం.
తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (బ-భ-మ)
This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002. You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
కొమురం భీము (అక్టోబర్ 22, 1901 - అక్టోబర్ 27, 1940) హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.. ఈయన ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ-సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో కొమరం భీమ్ 1901 సంవత్సరంలో జన్మించాడు.
"భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.
దేశాల జాబితా - ఐక్య రాజ్య సమితి సభ్యులు
ఐక్య రాజ్య సమితిలో సభ్యులు (List of countries in the United Nations) ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి. 2017 నాటికి ఐక్య రాజ్య సమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రతి సభ్య దేశమూ ఐ.రా.స.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను జిల్లాలు గాను, వాటిని తాలూకా, మండలం వంటి మరింత చిన్న పరిపాలనా విభాగాలుగా విభజించారు .
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
లి వెన్లియాంగ్ (చైనీస్: 李文亮; 1986 అక్టోబరు 12 - 2020 ఫిబ్రవరి 7) ఒక చైనీస్ నేత్ర వైద్య నిపుణుడు, వుహాన్ సెంట్రల్ హాస్పిటల్ వైద్యుడు. కరోనావైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు. లీ తన సహచరులను 2019 డిసెంబరులో తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) ను పోలి ఉండే అనారోగ్యం గురించి హెచ్చరించాడు, తరువాత దీనిని COVID-19 గా గుర్తించారు.
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వానరవీరులు. వీరి పాత్రలు రామాయణం కిష్కింధకాండములో వస్తాయి. కబంధుడు చేతులను శ్రీరామ చంద్రమూర్తి నరికేశాక కబంధుడు శాప విమోచనము పొంది రామా నీకు స్నేహితుడు అవసరము అందువలన నీవు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడితో మైత్రి చేసుకొ అని చెబుతాడు ఆవిధంగా అరణ్యకాండ ముగుస్తుంది కిష్కిందకాండము ప్రారంభిం అవుతుంది.