The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
పట్టణం (Town) : సాధారణంగా ఇది ఒక జనావాస ప్రాంతం.ఇది గ్రామం కంటే పెద్దదిగానూ నగరం కంటే చిన్నదిగానూ ఉంటుంది.దీని జనాభా వేలసంఖ్యలోనూ, కొన్నిసార్లు లక్షల సంఖ్యలోనూ వుండవచ్చు. సాధారణంగా పురపాలక సంఘం (మునిసిపాలిటి) కలిగిన జనావాస ప్రాంతాన్ని పట్టణంగా వ్యవహరిస్తారు. పట్టణాలు సాధారణంగా గ్రామాల కంటే పెద్దవి, నగరాల కంటే చిన్నవే కానీ వాటిని వేరుచేసే ప్రమాణాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల మధ్య గణనీయంగా మారుతుంటాయి.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కోల్‌కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించారు. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.
నవ్రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడుతోంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్ రూజ్వెల్ట్, 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్ర్తీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్ అన్న పదాన్ని పీపుల్‌గా మార్చింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (ఆంగ్లం Nelson Rolihlahla Mandela, (18 జూలై, 1918 - డిసెంబర్ 5, 2013) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కారుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (African National Congress) కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న , ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు.
జయలలిత (జ.ఫిబ్రవరి 24, 1948—మ.డిసెంబరు 5, 2016) ప్రముఖ రాజకీయనాయకురాలు, తమిళనాడు రాష్ట్రానికి 2015 మే నుంచి 2016 డిసెంబరులో మరణించే దాకా ముఖ్యమంత్రిగా పనిచేసింది. అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. రాజకీయాలలోకి రాకమునుపు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు.అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు.
హార్దిక్ పాండ్యా (1993 అక్టోబరు 11 జననం) బరోడా క్రికెట్ టీంకు చెందిన భారత ఆటగాడు . ఇతను కుడి చేయి ఆటగాడు, బౌలర్. 2015 పెప్సీ ఐపియల్ లో ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ ను పది లక్షలు పెట్టి కొనుకుంది.చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో 12 బంతి లో 30 పరుగులు కావాలి అన్నప్పుడు హార్దిక్ 8 బంతి ల లొనే 21 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించారు.కె కె ఆర్ తో డూ ఆర్ డై మ్యాచ్ లో 30 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించారు.ఈ ప్రదర్శనకు హార్దిక్ భారత్ ఏ కు ఎంపిక అయ్యాడు.2016 లో ఆస్ట్రేలియా తో టీ20 లో అంతర్జాతీయ క్రికెట్ కు అరంగేట్రం చేశారు.తన తొలి బంతి వేయడానికి ప్రెజర్ లో ముందు వరసగా 3 వైడ్ బాల్స్ వేసాడు.ఆ మ్యాచ్ లో హార్దిక్ 2 ఓవర్లు కి 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసాడు.
ఎం.జి.ఆర్ గా ప్రసిద్ది చెందిన మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ (1917 జనవరి 17 - 1987 డిసెంబర్ 24) తమిళనాడు రాజకీయ నాయకుడు, తమిళ చలనచిత్ర నటుడు, 1977 నుంచి 1987 మధ్యకాలంలో పదేళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను దాత, సమాజ సేవకుడు. 1988లో ఎంజిఆర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్న మరణానంతరం లభించింది.
స్వామి వివేకానంద ప్రపంచ మతసమ్మేళన ప్రసంగం
స్వామీ వివేకానంద భారతదేశానికీ, హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1893 సెప్టెంబరు 11న చికాగోలో మొదటి ప్రపంచ మత సమ్మేళనంలో చేసిన ప్రసంగం సుప్రసిద్ధమైనది. స్వామీ వివేకానంద 1893 ప్రపంచ మత సమ్మేళనానికి భారత దేశానికీ, హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించారు. 11 నుంచి 1893 సెప్టెంబరు 27లో నిర్వహించిన ఆ సమ్మేళనం మొదటి ప్రపంచ మత సమ్మేళనం.
గీతాంజలి పూర్తి అనువాదం వికిసోర్స్‌లో ఉన్నది. ఇక్కడ చూడండిభారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ లేదా రవీంద్రనాధ టాగూరు (Ravindranath Tagore, ఆంగ్ల: Rabindranath Tagore నించి (బంగ్లా లో "బ" ఇతర భారత భాషలు లో "వ" కోసం); బంగ్లా: রবীন্দ্রনাথ ঠাকুর రోబీంద్రోనాథ్ ఠాకూర్) (మే 7, 1861 – ఆగస్టు 7, 1941). ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.
భారత దేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా వుంది.
తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా
బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ పాలన నుండి భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ప్రయత్నాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో అనేక పద్ధతుల ద్వారా భారత స్వతంత్ర సంగ్రామంలో జరిగాయి.కొందరు తమ ప్రాణాలర్పించారు. మరి కొంతమంది పలుమార్లు జైలుపాలయ్యారు. ఇది ప్రత్యేకించి భారత ఉపఖండంలో వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు, సత్యాగ్రహాలు, నిరాహారదీక్షలు, సభలు, రచనలు ద్వారా రాజకీయ ప్రచారం చేసిన లేదా పరిగణించబడిన వ్యక్తుల జాబితా.
బుర్రకథ (Burrakadha), పల్లెపదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకొంటూ సరదా సరదాగా సాగిపోయే ఒక జానపద కళారూపం. పరిమితమైన ఆహార్యంతో, ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జన సామాన్యానికి చేరువగా వెళ్లే కళారూపాలలో హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవది. హరికథలో కొంత సంప్రదాయముద్ర ఉండి బుర్రకథ పూర్తిగా జానపద కళారూపం.
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
వయస్సు , అంతస్తు తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తైదువులు, ఆడపిల్లలంతా అంబరాన్ని అంటే సంబరముతో కలిసి ఆడుకునే , పాడుకొనే తెలంగాణ బతుకమ్మ పాట
తిథి అంటే : వేద సమయ గణితము ప్రకారము చంద్రమాసము లో ఒక రోజును తిథి అంటారు. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావస్య , అదే సూర్యచంద్రులు ఒకరి కి ఒకరు సమాన దూరములో వుంటే పౌర్ణమి అవుతుంది, శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు.. తిధులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు.
ఆధునిక భారతదేశ పునాది స్థాననలో భారతీయ సంఘ సంస్కర్తలు గొప్ప చరిత్రను కలిగి ఉన్నారు. కొన్ని సందర్భాలలో వీరు తమ రాజకీయ, తత్వజ్ఞాన బోధనల ద్వారా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలను ప్రభావితం చేశారు. కొంతమంది భారతీయ సంఘ సంస్కర్తలు : Veelu entho goppa vallu రాజా రామ్ మోహన్ రాయ్ (1772 మే 22 – 1833 సెప్టెంబరు 27) కబీర్ (1440 - 1518) వీరచంద్ గాంధీ (1864–1901) ) స్వామి వివేకానంద (1863 జనవరి 12 – 1902 జూలై 4) జమ్నాలాల్ బజాజ్ (1884 నవంబరు 4 – 1942 ఫిబ్రవరి 11) వినోబా భావే (1895 సెప్టెంబరు 11 - 1982 నవంబరు 15) బాబా ఆమ్టే (1914 డిసెంబరు 26 – 2008 ఫిబ్రవరి 9) శ్రీరామ్ శర్మ ఆచార్య (1911 సెప్టెంబరు 20 – 1990 జూన్ 2) ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ (1820–1891) దండో కేశవ్ కార్వే (1858 ఏప్రిల్ 18 - 1962 నవంబరు 9) బాలశాస్త్రి జంబేకర్ 1812 జనవరి 6– 1846 మే 18) బి.ఆర్.అంబేద్కర్ (1891 ఏప్రిల్ 14 — 1956 డిసెంబరు 6) అనిబీసెంట్ (1847 అక్టోబరు 1 – 1933 సెప్టెంబరు 20) విట్టల్ రాంజీ షిండే (1873 ఏప్రిల్ 23 – 1944 జనవరి 2) గోపాల్ హరి దేశ్ ముఖ్ (1823–1892) కందుకూరి విరేశలింగం16 ఏప్రిల్ 1848 - 1919 మే 27.
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం.రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది.దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.