The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కోల్‌కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించారు. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (ఆంగ్లం Nelson Rolihlahla Mandela, (18 జూలై, 1918 - డిసెంబర్ 5, 2013) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కారుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (African National Congress) కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
భారత దేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా వుంది.
నవ్రాత్రి, నవరాత్రి లేదా నవరాథ్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.
అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడుతోంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్ రూజ్వెల్ట్, 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్ర్తీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్ అన్న పదాన్ని పీపుల్‌గా మార్చింది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
లాల్ బహాదుర్ శాస్త్రి ( వినండి ) (1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి , భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న , ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు.
కొన్ని సహస్రాబ్దులుగా భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది. ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ సభాపతి, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు.అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు.
నాగ చైతన్య (జననం: 1986 నవంబరు 23) నటుడు అక్కినేని నాగార్జున, లక్ష్మి (నటుడు వెంకటేష్ సోదరి)ల తనయుడు. ఇతడు జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించాడు. కానీ ఆ చిత్రం ఆశించదగ్గ ఫలితాన్ని ఇవ్వలేదు, కానీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఏ మాయ చేసావే ద్వారా మంచి విజయాన్ని నమోదు చేశాడు.
జవాహర్లాల్ నెహ్రూ రాజకీయ జీవితం, 1945-1947
1945 నుంచి 1947 వరకూ సాగిన జవాహర్లాల్ నెహ్రూ రాజకీయ జీవితాన్ని నమోదుచేస్తుంది ఈ వ్యాసం. 1945 జూన్ 15న రెండేళ్ళ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలపు జైలు జీవితాన్ని ముగించుకుని భారత దేశంలో రాజ్యాంగ సభ, డొమినియన్ల ఏర్పాటుకు బ్రిటీష్ వారు ప్రారంభించిన సంప్రదింపుల్లో పాల్గొనడం ప్రారంభించిన నెహ్రూ మరో రెండేళ్ళ పాటు రకరకాల రాజకీయ వ్యవహారాల్లో తలమునకలయ్యాడు. 1945లో వేవెల్ ప్రారంభించిన సంప్రదింపులకు ఆహ్వానం లేక వెళ్ళకపోయినా, తర్వాత కేంద్ర, రాష్ట్రాల శాసన సభల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసి జనరల్ నియోజకవర్గాల్లో గెలవడంలో తన పాత్ర పోషించాడు.
తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చే అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో మొత్తంలో మొక్కలను నాటి, పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
భారత జాతీయ పతాకం అన్నది దీర్ఘ చతురస్రాకారంలో కాషాయం, తెలుపు, పచ్చ రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది. 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది, 1947 ఆగస్టు 15న భారత డొమినియన్కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ భారత గణతంత్రానికి అధికారిక పతాకంగా స్వీకరించారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ (Martin Luther King, Jr. ) (జనవరి 15, 1929 - ఏప్రిల్ 4, 1968) అమెరికాకు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు, ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు. ఇతడి ముఖ్య ఉద్దేశం అమెరికాలో పౌర హక్కులను కాపాడడంలో అభివృద్ధి సాధించడం,, ఇతడిని మానవహక్కుల పరిరక్షణా ప్రతినిధిగా నేటికినీ గుర్తింపు ఉంది.
ఒక గంట (కాలమానం) అనేది సమయం లెక్కింపులో ఇది రాసిలో ప్రమాణంగా పరిగణిస్తారు.ఒక గంట అనేది సాంప్రదాయకంగా రోజుకు 1⁄24 గా లెక్కించబడుతుంది.పరిస్థితులను బట్టి శాస్త్రీయంగా 3,599–3,601 సెకన్లుగా లెక్కించబడుతుంది.ఒక గంటలో 60 నిమిషాలు, రోజులో 24 గంటలు ఉన్నాయి.గంట ప్రామాణికాన్ని మొదట్లో ప్రాచీన నియర్ ఈస్ట్ రాత్రి లేదా పగటి కాలంలో ఒక చంచలమైన (వేరియబుల్) చర్యగా స్థాపించబడింది.ఇటువంటి కాలానుగుణ, తాత్కాలిక లేదా అసమాన గంటలు ఋతువు, అక్షాంశాల ప్రకారం మారుతూ ఉంటాయి. మధ్యాహ్నం 1 నుండి మధ్యాహ్నం వరకు సమాన లేదా సమస్యాత్మక గంటలు కొలిచినట్లుగా రోజును 1⁄24 గా తీసుకోబడింది.ఈ యూనిట్ చిన్న కాలానుగుణ వైవిధ్యాలు చివరికి సగటు సౌర రోజులో 1⁄24 గా మార్చడం ద్వారా సున్నితంగా మార్చబడింది.భూమి భ్రమణంలో దీర్ఘకాలిక వ్యత్యాసాల కారణంగా ఈ యూనిట్ స్థిరంగా లేదు, కాబట్టి, గంట అనేది చివరికి భూమి భ్రమణం నుండి వేరుచేయబడింది. పరమాణు లేదా భౌతిక రెండవ (సెకను) పరంగా నిర్వచించబడింది.
కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.
సుధా చంద్రన్ ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి. తాను 1981 జూన్ నెలలో తమిళనాడు లోని "త్రిచీ" వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులో మయూరి సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా, టెలివిజన్ ధారావాహికలలో నటించారు.
గీతాంజలి పూర్తి అనువాదం వికిసోర్స్‌లో ఉన్నది. ఇక్కడ చూడండిభారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ లేదా రవీంద్రనాధ టాగూరు (Ravindranath Tagore, ఆంగ్ల: Rabindranath Tagore నించి (బంగ్లా లో "బ" ఇతర భారత భాషలు లో "వ" కోసం); బంగ్లా: রবীন্দ্রনাথ ঠাকুর రోబీంద్రోనాథ్ ఠాకూర్) (మే 7, 1861 – ఆగస్టు 7, 1941). ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.
భారతదేశంలో బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసనోల్లంఘనలో భాగంగా, మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెసు జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం. దీన్ని దండి సత్యాగ్రహం అనీ, దండి యాత్ర అనీ, దండి మార్చి అనీ కూడా పిలుస్తారు. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ గాంధీ,1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 వరకు, 384 కిలోమీటర్ల దూరం, వేలమంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్ తీరం లోని దండి వద్ద ఉప్పు తయారు చేసాడు.
అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 5వ తేదిన ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో విద్యాలయాలలో వేడుకగా నిర్వహిస్తారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1994వ సంవత్సరం నుండి అక్టోబరు 5వ తేదిన జరుపుకుంటున్నారు.