The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
వినియోగదారుడు (Consumer) సమాజంలో వినిమయం చేయబడే వస్తువుల లేదా సేవలను పొందే వ్యక్తి లేదా వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల రక్షణ చట్టం (Consumer Protection Act) చేయబడింది. దీని ప్రకారం ఒక వినియోగదారుడు కొన్న వస్తువు నాణ్యత నిర్దేశించబడిన శ్రేణి కంటే తక్కువగా ఉంటే, దానివలన కలిగే ఆర్థిక, ఇతర నష్టాలను ఆ వస్తువును తయారుచేసిన సంస్థ భరించాల్సి వుంటుంది.
పుష్ప 2021లో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అర్జున్ , రష్మికా మందన్న, సునీల్ శెట్టి, ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైనది.
|name = చంద్రశేఖర వేంకట రామన్ |image = Sir CV Raman.JPG |birth_date = (1888-11-07)1888 నవంబరు 7 |birth_place = తిరుచిరపల్లి, మద్రాసు రాష్ట్రం, భారతదేశం |death_date = 1970 నవంబరు 21(1970-11-21) (వయస్సు 82) |death_place = బెంగళూరు, కర్నాటక, భారతదేశం |nationality = భారతీయుడు |field = భౌతిక శాస్త్రము |alma_mater = 83)_(₹₹98₹న్సీ గాకాలేజి (చెన్నై)|ప్రెసిడెన్సీ కాలేజి |work_institution = భారత ఆర్థిక విభాగముఇండియన్ అసోసియేషన్ ఫార్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ |doctoral_advisor = |doctoral_students= జి.ఎన్.రామచంద్రన్ |known_for = రామన్ ఎఫెక్ట్ |prizes = నోబెల్ పురస్కారంభారతరత్నలెనిన్ శాంతి బహుమతి |religion = హిందూ |footnotes = }} సి.వి.రామన్FRS (నవంబర్ 7, 1888 - నవంబర్ 21, 1970) భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. రామన్ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు. 1930 డిసెంబరులో రామన్‌కు నోబెల్ బహుమతి వచ్చింది.
క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ.క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాల తర్వాత వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ (చారిత్రకంగా పశ్చిమాన పన్నెండు రోజుల పాటు ఉండే పండుగ రోజులు ఇవి, పన్నెండవ రోజు రాత్రికి ఇవి తారాస్థాయికి చేరుకుంటాయి.) అని పిలిచే సీజన్ ఆరంభంగా నిలుస్తుంది.కొత్త నిబంధన లోని సంప్రదాయిక క్రిస్మస్ కథనం ప్రకారం, రక్షకుని గురించిన జోస్యాలను అనుసరించి జోసెఫ్, మేరీ బెత్లెహేం వచ్చినప్పుడు వసతి గృహంలో గదులు లభ్యం కాకపోవడంతో పశువుల పాకలో వారికి ఆశ్రయం దొరికింది, అక్కడే క్రీస్తు జన్మించాడు.దేవదూతలు ఈ విషయాన్ని పశువుల కాపరులకు చెప్పగా, వారు సమాచారం మిగిలినవారికి చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రిస్మస్ సెలవు రోజు, ఈ పండుగను క్రైస్తవుల్లో అత్యధికులు మతపరంగానూ, క్రైస్తవేతరులు సాంస్కృతికంగానూ జరుపుకుంటారు, పశ్చిమదేశాల్లో సెలవుల సీజన్లో అత్యంత ముఖ్యమైన భాగం. క్రీస్తు ఏ నెలలో, ఏ తేదీన జన్మించాడన్న విషయం తెలియకపోయినా, నాలుగవ శతాబ్ది మధ్యభాగం నాటికల్లా పశ్చిమ క్రైస్తవ చర్చి క్రిస్మస్ ను డిసెంబరు 25 నాటికి నిర్వహించడం సాగించింది, ఇదే తేదీని తర్వాత తూర్పు క్రైస్తవం కూడా స్వీకరించింది.
చలికాలం సంవత్సరం ఉష్ణ వాతావరణాలలోని అన్ని కాలాలలోకి చలిగా ఉండే కాలం, ఇది వానాకాలానికి, ఎండాకాలానికి మధ్య వస్తుంది. సూర్యుడు భూమి అక్షానికి దూరంగా అర్ధ గోళంలో ఉండటం వలన ఈ విధంగా సంభవిస్తుంది.శీతాకాలం ప్రారంభం వలె వివిధ సంస్కృతులు వివిధ తేదీలను నిర్వచిస్తాయి,, కొన్ని వాతావరణ ఆధారిత నిర్వచనాలను ఉపయోగిస్తాయి, కాని ఉత్తర అర్ధగోళంలో శీతాకాలం ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో వేసవి ఉంటుంది.ఇదే విధంగా విరుద్ధంగా. అనేక ప్రాంతాల్లో శీతాకాలం మంచు, ఘనీభవన ఉష్ణోగ్రతతో సంబంధం కలిగి ఉంటుంది.
యేసు (Jesus) (క్రీ.పూ 0 నుండి క్రీ.శ 26–36 వరకు) యేసు అనగా రక్షకుడు అని అర్థం.... ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన మాట యేసు అనే పదము ఎందుకంటే అనేకమంది ఏసు అనే పేరు గల వారు ఆ ప్రాంతంలో ఉన్నను ఏసుక్రీస్తు అనే మాట ప్రపంచ గమనాన్ని మార్చింది. దుర్మార్గుని శిక్షించు సన్మార్గుని రక్షించు అని అని ఇతర మత గ్రంథాలు చెబుతుంటే ఏసుప్రభు మాత్రము పాపిని ప్రేమించిన మహా మనిషి దేవుని కుమారుడైన యేసు ....
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కోల్‌కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించారు. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.
భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా
బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ పాలన నుండి భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ప్రయత్నాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో అనేక పద్ధతుల ద్వారా భారత స్వతంత్ర సంగ్రామంలో జరిగాయి.కొందరు తమ ప్రాణాలర్పించారు. మరి కొంతమంది పలుమార్లు జైలుపాలయ్యారు. ఇది ప్రత్యేకించి భారత ఉపఖండంలో వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు, సత్యాగ్రహాలు, నిరాహారదీక్షలు, సభలు, రచనలు ద్వారా రాజకీయ ప్రచారం చేసిన లేదా పరిగణించబడిన వ్యక్తుల జాబితా.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
భారత దేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా వుంది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు.అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (1879 మార్చి 14 -1955 ఏప్రిల్ 18 ) జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జెనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని (సాధారణ సాపేక్షత) ప్రతిపాదించారు .అతను తత్త్వశాస్త్రంలో ప్రభావవంతమైన కృషి చేశాడు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc^2 ను కనిపెట్టాడు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశాడు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు.
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 15న నిర్వహించబడుతుంది. వినియోగదారులకు వస్తువుల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణంలకు సంబంధించిన సమాచారాన్ని అందించడంకోసం ఈ దినోత్సవం జరుపబడుతుంది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
గౌడ లేదా గౌడ్ బ్రాహ్మణ వంశానికి చెందినవారు, గౌడ చరిత్ర ప్రకారము వీరి మూల పురుషుడు కౌండీన్య మహాఋషి అలాగే పరశురాముడు కూడా కౌండిన్య వంశలోని వాడే కాబట్టి ఉత్తర భారతానికి చెందిన గౌడ సరస్వతి బ్రాహ్మణులు పరుశురాముణ్ణి వారి దైవంగా కొలుస్తారు. వీరికి పూర్వ కాలంలో ఉపనయ సంస్కారములు, వేదాధికారము కలదు కానీ కాల క్రమేణా కొన్ని చారిత్రిక కారణలరీత్యా వీరు బ్రాహ్మణ స్థాయిని కోల్పోయారు. వీరే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో క్షత్రియ స్థాయిని, ఇంకొన్ని రాష్టాలలో బ్రాహ్మణ స్థాయిని కలిగి ఉన్నారు.