The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఘట్టమనేని కృష్ణ (పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి) తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి.
శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.
భారత దేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా వుంది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుంది. ఈ రోజున హైదరాబాదుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవతరణ ఉత్సవాలు జరుగుతాయి.మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందించడం జరుగుతుంది.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన అతను, తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు.తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు.తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.తరువాతి తరాలకూ ఆ జ్ఞానం అందేలా చేశారు.పురుగుమందులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో భయంగొలుపుతున్న కొత్త సమాజంలో రాబోయే రోజుల్లో ఇంకా కొత్త సామెతలు పుట్టవచ్చు. జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేశారు.సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు.కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేసుకున్నారు.ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచారు.సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు.సంవత్సరానికి 27 కార్తెలు.తెలుగు ప్రజానీకం చంద్ర మానాన్ని పాటిస్తుంటే తమిళులు సౌర మానాన్ని పాటిస్తున్నారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
భర్త పట్ల క్రౌర్యం (ఆంగ్లం: Cruelty against husband) అనగా స్త్రీల రక్షణ కొరకు ఉన్న చట్టాలను తనకనుకూలంగా ఉపయోగించుకొని భర్త, అయన కుటుంబీకులు ప్రమేయం లేనప్పటికిని దుర్వినియోగం చేస్తూ, డబ్బు కోసం వేధిస్తూ భయపెట్టడం. కొన్ని సందర్భాలలో శారీరకంగానూ, మాససికంగానూ, సామాజికం గానూ భర్తను వేధించటం. చట్టం స్త్రీలకే అనుకూలంగా ఉన్నది అనే భ్రమ నెలకొని ఉండటం మూలాన భార్య/ఆమె కుటుంబీకులు/ఆమె బంధుమిత్రులు తాము ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వ్యవహరించటం, వాటికి కట్టుకొన్న భర్త ఒప్పుకోని పక్షంలో స్త్రీ సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలనే అమాయక భర్త పై అస్త్రాలుగా ప్రయోగించటం/లేదా ప్రయోగిస్తామని బెదిరించటమే "భర్త పట్ల క్రౌర్యం".
ఇంగ్లీశు-తెలుగు అనువాద సమస్యలు
తెలుగులో వైజ్ఞానిక విషయాల రాసే వారికి వైజ్ఞానిక విషయాల మీద అవగాహన, భాష మీద పట్టు ఉండాలి. అయినప్పటికీ ఒక భాషలో రాసిన విషయాన్ని మరొక భాషలోకి మార్చటం తేలిక అయిన విషయం కాదు. సాహిత్యాన్ని అనువాదం చేసేటప్పుడు ఎదురయే సమస్యలు విజ్ఞాన శాస్త్రాన్ని అనువదించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు వేరు వేరుగా వుంటాయి.
న్యుమోనియా (ఆంగ్లం: pneumonia) ఉపిరితిత్తుల వేగంగా శ్వాస తీసుకోవటం ప్లూరిటిస్ ప్లూరిసి ఇది, ప్రధానంగా అల్వియోలీ(వాయుకోశాలు) మంట కారణంగా ఇది సంభవిస్తుంది, వైరల్ బాక్టీరియా చిన్న గాలి సంచులను ఎగువ శ్వాస వ్యవస్థను ప్రభావితం చేసే వైరల్ అంటు వ్యాధి. లక్షణాలు సాధారణంగా పొడి పొడి దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి ఉంటాయి, మనిషి మొత్తం వణుకుతూ ఉంటారు, గుండె దడగా ఉంటుంది, భయం భయంగా ఉంటుంది. పొడిదగ్గు ముదిరి ఎక్కువ అవుతున్నప్పుడు తేమడ ఉండలు ఉండలుగా నోటిలోకి వస్తుంది, ఎక్కువ సేపు నిలబడి ఉండలేరు, పెద్ద శబ్దాలను వింటే తల నొప్పిగా ఉంటుంది, గొంతు పట్టేయడం కనీసం మంచినీరు కూడా తరగడానికి కంఠనాళం నొప్పిగా ఉండడం చిన్నపిల్లల్లో శ్వాసలో గురక శబ్దం వస్తుంది, చాలా ముఖ్యమైన సంకేతం.
అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగంలో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత . అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది.
మహారాణి అహల్యా బాయి హోల్కర్ (1725 మే 31 - 1795 ఆగస్టు 13), మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాణి. రాజమాత అహల్యాబాయి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ప్రాంతానికి చెందిన చొండి గ్రామంలో జన్మించారు. ఆమె తన పరిపాలన కాలంలో హిందూ మత కార్యకలాపాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి పేరొందారు.అహల్యాబాయి భర్త ఖండేరావు హోల్కర్ 1754లో కుంభేర్ యుద్ధంలో మరణించారు.
గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుష్యడి తాలూకు విత్తనానికి (లేక వీర్యకణానికి) జన్మనిచ్చేది మాత్రం పురుషుడే కాబట్టి గోత్రము మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది.గోత్రము అనగా గో అంటే గోవు, గురువు, భూమి, వేదము అని అర్థములు. ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు, కపిలగోవువారు, తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు.ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట, భరద్వాజ, వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు.తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.
1833లో బ్రిటిష్ ప్రభుత్వం ఛార్టర్ ఏక్ట్ 1833 (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏక్ట్ 1833 అని కూడా అంటారు) అమలు చేయటంతో, భారతదేశానికి (నాటి బ్రిటిష్ ఇండియా) అంతటికీ ఒకే శాసనం చేయటానికి అధికారం కలిగింది. అప్పటినుంచీ భారతదేశానికి (బ్రిటిష్ ఇండియా) అంతటికీ చట్టాలు చేయటం మొదలైంది. ఆనాటి నుంచి, అంటే 1834 సంవత్సరం నుంచి, 2011 జూన్ 20 వరకు, భారత దేశంలో 2245 చట్టాలు అమలులో ఉన్నాయి.
చత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
మిట్టగూడెం గ్రామంలో జాతిఐ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులకు సంబంధించిన బోర్డు]]జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
లైంగిక విద్య (ఆంగ్లం: Sex Education) అనగా మానవ లైంగికత (మానవ లైంగిక శరీరనిర్మాణశాస్త్రముతో సహా), లైంగిక పునరుత్పత్తి, సంభోగము, పునరుత్పత్తి ఆరోగ్యం, భావోద్రేక సంబంధాలు, పునరుత్పత్తి హక్కులు, విధులు, లైంగిక సన్యాసం, కుటుంబ నియంత్రణల గురించి తెలిపే విధివిధానాలు. తద్వారా లైంగిక వ్యాధులు రాకుండా ఎలా జాగ్రత్తవహించాలో కూడా అర్ధం చేసుకోవడానికి వీలుకలుగుతుంది. పలు సాంప్రాదాయాలలో లైంగిక జ్ఞానం నిషిద్ధం అనే భావన నెలకొని ఉండటం మూలాన కౌమారదశలో ఉన్న బాలబాలికలకు లైంగిక విద్యను నేర్పేవారు కారు.
ఆదిత్య మిన్జ్ (Aditya Minz)(జననం 18 డిసెంబర్ 2004) భారతదేశంలోని శ్రీహరికోట నుండి వచ్చిన హిప్ హాప్ / ట్రాప్ / ఫ్యూచర్ బాస్ మ్యూజిక్ ప్రొడ్యూసర్. అతను అడ్మిన్ మ్యూజిక్ మరియు 5 వ వీధిలో అప్లోడ్ చేసిన మ్యూజిక్ వీడియోలకు ప్రసిద్ది చెందాడు. అతనికి AVY8, ఎలెక్ట్రోడ్రాగన్ బీట్స్ వంటి వివిధ కళాకారులు మద్దతు ఇస్తున్నారు.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా
నందమూరి తారక రామారావు 50 సంవత్సరాలపైగా తెలుగు సినిమా రంగంలో కథా నాయకునిగా రాణించాడు. ఆయన నటించిన సిమాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది.