The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
భారత దేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా వుంది.
అంతర్జాతీయ మాతృ దినోత్సవం (ఆంగ్లం: Mother's Day) కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో) నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు.
ఎం.కె.స్టాలిన్ , తలాపతీ అని పిలవబడే తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నాయకుడు, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) రాజకీయ పార్టీ అధ్యక్షుడు. అతను 1996 నుండి 2002 వరకు చెన్నైకి 37 వ మేయర్, 2009 నుండి 2011 వరకు తమిళనాడు యొక్క మొదటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.తమిళంలోని 3 వ ముఖ్యమంత్రి, డిఎంకే చీఫ్ ఎం. కరుణానిధి మూడవ కుమారుడు, తన రెండవ భార్య దయాళు అమ్మాళ్కి జన్మించారు.
ఎం.కెగా, డా.కళైజ్ఞర్గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి (తమిళం: மு.கருணாநிதி) M.K (జూన్ 3, 1924 - ఆగష్టు 7, 2018) తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి తాను మరణించేవరకు, తమిళనాడు రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగంకు అధ్యక్షుడు, వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు (1969-71, 1971-74, 1989-91, 1996-2001, 2006-2011).
అంతర్జాతీయ రెడ్‌క్రాస్, రెడ్‌క్రెసెంట్ ఉద్యమం (ఆంగ్లం : The International Red Cross and Red Crescent Movement) ఒక అంతర్జాతీయ మానవతావాద ఉద్యమం. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులు (కార్యకర్తలు) ఉన్నారు. వీరు మానవతావాదాన్ని, మానవుల జీవితాలను, ఆరోగ్యాన్ని కాపాడడానికి అనునిత్యం శ్రమిస్తూ వుంటారు.
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8న నిర్వహించబడుతుంది. నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ హెన్రీడూన్ హంట్ జయంతి రోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు.వివిధ సమస్యలతో భాదపడుతున్న వారికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వాలంటీర్లు, అనేక స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్నాయి. అలాంటివారందరి గౌరవార్ధంగా ఈ దినోత్సవం ఏర్పాటు చేయబడింది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14,1921 - మే 8,1972) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి.
ఇంగ్లీశు-తెలుగు అనువాద సమస్యలు
తెలుగులో వైజ్ఞానిక విషయాల రాసే వారికి వైజ్ఞానిక విషయాల మీద అవగాహన, భాష మీద పట్టు ఉండాలి. అయినప్పటికీ ఒక భాషలో రాసిన విషయాన్ని మరొక భాషలోకి మార్చటం తేలిక అయిన విషయం కాదు. సాహిత్యాన్ని అనువాదం చేసేటప్పుడు ఎదురయే సమస్యలు విజ్ఞాన శాస్త్రాన్ని అనువదించేటప్పుడు ఎదురయ్యే సమస్యలు వేరు వేరుగా వుంటాయి.
న్యుమోనియా (ఆంగ్లం: pneumonia) ఉపిరితిత్తుల వేగంగా శ్వాస తీసుకోవటం ప్లూరిటిస్ ప్లూరిసి ఇది, ప్రధానంగా అల్వియోలీ(వాయుకోశాలు) మంట కారణంగా ఇది సంభవిస్తుంది, వైరల్ బాక్టీరియా చిన్న గాలి సంచులను ఎగువ శ్వాస వ్యవస్థను ప్రభావితం చేసే వైరల్ అంటు వ్యాధి. లక్షణాలు సాధారణంగా పొడి పొడి దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి ఉంటాయి, మనిషి మొత్తం వణుకుతూ ఉంటారు, గుండె దడగా ఉంటుంది, భయం భయంగా ఉంటుంది. పొడిదగ్గు ముదిరి ఎక్కువ అవుతున్నప్పుడు తేమడ ఉండలు ఉండలుగా నోటిలోకి వస్తుంది, ఎక్కువ సేపు నిలబడి ఉండలేరు, పెద్ద శబ్దాలను వింటే తల నొప్పిగా ఉంటుంది, గొంతు పట్టేయడం కనీసం మంచినీరు కూడా తరగడానికి కంఠనాళం నొప్పిగా ఉండడం చిన్నపిల్లల్లో శ్వాసలో గురక శబ్దం వస్తుంది, చాలా ముఖ్యమైన సంకేతం.
మూస:Masturbation ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పోతుంది. ఇది సహజ ప్రక్రియ. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కలిగించడం, లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని స్వయంతృప్తి /హస్త ప్రయోగం (ఆంగ్లం: మాస్టర్బేషన్) అంటారు.
అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగంలో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత (37°సె, 98.6°ఫా) కంటే మించి ఉంటే ఆ స్థితిని జ్వరం (ఆంగ్లం: Fever) అంటారు. దీనిని ఉష్ణమాపకం లేదా థర్మామీటర్ (జ్వరమాపకం) ద్వారా కొలిచి గుర్తిస్తారు. మన శరీరంలోని సహజమైన రోగనిరోధక శక్తి రోగాల వైరస్‌లతో, బాక్టీరియా, ఫంగస్ లాంటి వాటితో జరిపే పోరాటంలో, శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది.
పవన్ కల్యాణ్, తెలుగు సినీనటుడు, నిర్మాత, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత, రాజకీయవేత్త.ఇతని తల్లిదండ్రులు కొణిదెల వెంకటరావు, అంజనాదేవి, 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) పవన్‌కు పెద్దన్నయ్య.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
మిట్టగూడెం గ్రామంలో జాతిఐ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులకు సంబంధించిన బోర్డు]]జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
టైఫాయిడ్ జ్వరం', ఆంత్రిక జ్వరం, సాల్మొనెల్ల టైఫి గా కూడా పిలువబడుతుంది లేదా సాధారణంగా టైఫాయిడ్ అంటారు, ఈ వ్యాధి సాల్మొనెల్ల ఎంటేరికా సరోవర్ టైఫి అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ వ్యాధి అతిసారం, దద్దుర్లు కలుగజేసే ఒక అంటువ్యాధి. టైఫాయిడ్, టైఫిస్‌కు సాధారణంగా కలిగే న్యూరోసైకియాట్రిక్ లక్షణాల నుండి, గ్రీక్ పదానికి అర్థం వచ్చే Stupor - స్తబ్దత నుండి టైఫాయిడ్ అనే పేరు వచ్చినది .