The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
దొడ్డి కొమరయ్య (1927 - జులై 4, 1946) తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు.హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య .
కోనేరు నేరుగా ఇక్కడికి దారితీస్తుంది, అయోమయనివృత్తి కొరకు చూడండి. కోనేరు (అయోమయ నివృత్తి) పుష్కరిణి లేక కోనేరు అనేది దేవాలయ ప్రాంగణంలో ఏర్పరచిన దిగుడు బావి లేదా జలాశయం.పుష్కరిణి చతురస్రం లేక దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది.పుష్కరిణిలోకి దిగడానికి నాలుగు వైపుల మెట్లు నిర్మించబడి ఉంటాయి.పుష్కరిణి లోతు తక్కువగాను పొడవు, వెడల్పు ఎక్కువగాను ఉంటుంది.దేవాలయ దర్శనానికి వచ్చిన భక్తులు కాళ్ళు, చేతులు శుభ్రపరచుకోవడానికి, స్నానం చేయడానికి ఈ పుష్కరిణిలోని నీటిని ఉపయోగించుకుంటారు.వాటిని పుష్కారిణి అనే కాకుండా కోనేరు, కళ్యాణి, కుండా, సరోవరం, ఆలయ జలాశయం తీర్థ, తలాబ్, పుఖూరి అనే మొదలైన పేర్లతోకూడా అంటారు.భారతదేశంలోని వివిధ భాషలలో ప్రాంతాలలో కొన్ని జలాశయాలలో స్నానం చేస్తే, వివిధ దీర్ఘకాలక వ్యాధులు, అనారోగ్యాలు తగ్గుతాయాని చెబుతారు.ప్రాచీన కాలంలోని సింధు లోయ నాగరికతలో భాగమైన గ్రేట్ బాత్ ఆఫ్ మొహెంజో-దారో లేదా ధోలావిరా వంటి నిర్మాణాలలో కొన్ని వైపులా అనేక దశలతో మెట్లు కలిగిన ఇటువంటి సాంస్కృతిక జలాశయాలు అవశేషాలు కనుగొనుట జరిగింది.
చేపలు లేదా మత్స్యాలు మంచినీటిలో, ఉప్పునీటిలో జీవిస్తూ 25,000 జాతులు ఉన్నాయి.చేపలను వాటి శ్వాసా అవయవాల అమరికను బట్టి" 1.ఊపిరితిత్తుల చేపలు,2.మొప్పల చేపలు అని రెండు రకాలుగా విభజించ వచ్చును.చేపల ఆహారపు అలవాటును బట్టి 1.సర్వభక్షకచేపలు, 2.శాకాహారపు చేపలు, 3.మాంసాహారపు (స్వజాతి భక్షక) చేపలు అని గుర్తించ వచ్చును.అదే విధముగా అవి నివసించే అలవాటును అనుసరించి1. మంచినీటిచేపలు 2.ఉప్పునీటి చేపలు అనిచెప్పవచ్చును.చేపలు మానవఆహారముగా అత్యధిక ప్రాధాన్యతను కలిగిఉన్నాయి.అత్యధికచిన్న చేప 0.25 సెంటి.మీ.ఉంటే పెద్దచేప 2మీ.కంటే ఎక్కువ పొడవుగా ఉంటాయి.డయోడాన్ అనే చేపఅత్యంత విష పూరిత మైనది.ఇది సముద్రజలాలలోనే నివసిస్తుంది.చేపలన్నీ మానవఆహారముగా వినియోగమవుతున్నాయి.చేపలను 1.ఆనందానికి, ఆహ్లాదకరానికి గాజు తోట్టెలలో పెంచు పద్ధతిని 2.ఆహారానికై చెరువులలో పెంపకము చేయు పద్ధతిని, 3.సముద్రము, నదులు.కాలువలలో పంజారాలలో (cage culture) పెంచు పద్ధతులను శాస్త్రీయ, సాంకేతికపరిజ్ఞానముతో పెంపొందించారు.
అల్లూరి సీతారామరాజు ఘట్టమనేని కృష్ణ కథానాయకునిగా 1974లో విడుదలైన తెలుగు సినిమా. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన బయోపిక్. సినిమాలో కృష్ణ, విజయనిర్మల, కొంగర జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నిర్మించారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
నర్తనశాల (ఆంగ్లం: NarthanaSala) మహాభారతంలోని విరాట పర్వం కథాంశం ఇతివృత్తంగా నిర్మితమై 1963 సంవత్సరములో విడుదలైన తెలుగు సినిమా. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో దర్శకులకున్న ప్రతిభను ఈ సినిమా మరొక్కసారి ఋజువు చేసింది. నటులు, దర్శకుడు, రచయిత, గీత రచయిత, సంగీత కళాదర్శకులు - ఇలా అందరి ప్రతిభనూ కూడగట్టుకొని ఈ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది.
గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుష్యడి తాలూకు విత్తనానికి (లేక వీర్యకణానికి) జన్మనిచ్చేది మాత్రం పురుషుడే కాబట్టి గోత్రము మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది.గోత్రము అనగా గో అంటే గోవు, గురువు, భూమి, వేదము అని అర్థములు. ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు, కపిలగోవువారు, తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు.ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట, భరద్వాజ, వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు.తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.
భారత దేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా వుంది.
శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానంచేసి, స్వామి దర్శనానికి వెళ్ళాలనే నియమం ఉంది. వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం తిరుమలకొండ మీదకు వేంకటేశ్వరుడు దిగివచ్చేవేళ, తన జలక్రీడల కోసం, వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదేనని భావన. సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (క్రీ.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం.
యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా
నందమూరి తారక రామారావు 50 సంవత్సరాలపైగా తెలుగు సినిమా రంగంలో కథా నాయకునిగా రాణించాడు. ఆయన నటించిన సిమాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది.
1833లో బ్రిటిష్ ప్రభుత్వం ఛార్టర్ ఏక్ట్ 1833 (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏక్ట్ 1833 అని కూడా అంటారు) అమలు చేయటంతో, భారతదేశానికి (నాటి బ్రిటిష్ ఇండియా) అంతటికీ ఒకే శాసనం చేయటానికి అధికారం కలిగింది. అప్పటినుంచీ భారతదేశానికి (బ్రిటిష్ ఇండియా) అంతటికీ చట్టాలు చేయటం మొదలైంది. ఆనాటి నుంచి, అంటే 1834 సంవత్సరం నుంచి, 2011 జూన్ 20 వరకు, భారత దేశంలో 2245 చట్టాలు అమలులో ఉన్నాయి.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన అతను బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి.
చత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
భౌతికశాస్త్రం అనేది పదార్థాన్ని, స్థల-కాలాల ద్వారా దాని కదలికలను, ప్రవర్తనను, సంబంధిత శక్తి, బలాలను అధ్యయనం చేసే ప్రకృతి శాస్త్రం. భౌతికశాస్త్రం అత్యంత ప్రాథమిక శాస్త్రీయ విభాగాలలో ఒకటి, విశ్వం ఎలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవడం దీని ప్రధాన లక్ష్యం. జీవ-భౌతిక శాస్త్రం మరియు క్వాంటం రసాయనిక శాస్త్రం వంటి అనేక పరిశోధనా విభాగాలతో భౌతికశాస్త్రం కలుస్తుంది, భౌతికశాస్త్రం యొక్క సరిహద్దులు కచ్చితంగా నిర్వచించబడలేదు.
మూస:Masturbation ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పోతుంది. ఇది సహజ ప్రక్రియ. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కలిగించడం, లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని స్వయంతృప్తి /హస్త ప్రయోగం (ఆంగ్లం: మాస్టర్బేషన్) అంటారు.
తెలంగాణా పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్ స్టేట్లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అఖిలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని రాజబహదూర్ గౌర్ ప్రకటించారు.ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు. ఫలితంగా ఆనాటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది.
యేసు (Jesus) (క్రీ.పూ 0 నుండి క్రీ.శ 26–36 వరకు) యేసు అనగా రక్షకుడు అని అర్థం.... ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన మాట యేసు అనే పదము ఎందుకంటే అనేకమంది ఏసు అనే పేరు గల వారు ఆ ప్రాంతంలో ఉన్నను ఏసుక్రీస్తు అనే మాట ప్రపంచ గమనాన్ని మార్చింది. దుర్మార్గుని శిక్షించు సన్మార్గుని రక్షించు అని అని ఇతర మత గ్రంథాలు చెబుతుంటే ఏసుప్రభు మాత్రము పాపిని ప్రేమించిన మహా మనిషి దేవుని కుమారుడైన యేసు ....