The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
భారత జాతీయ పతాకం అన్నది దీర్ఘ చతురస్రాకారంలో కాషాయం, తెలుపు, పచ్చ రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది. 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది, 1947 ఆగస్టు 15న భారత డొమినియన్కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ భారత గణతంత్రానికి అధికారిక పతాకంగా స్వీకరించారు.
భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా
భారత స్వతంత్ర సంగ్రామంలో ఎందరో పాల్గొన్నారు. కొందరు తమ ప్రాణాలర్పించారు.అలాంటి మహానుభావుల నుండి కొందరు దేశభక్తుల పేర్లు. ఇది ప్రధాన వ్యాసం కాదు.
తాలిబన్ అంటే అరబ్బీ లో ధర్మ జ్ఞానాన్ని అన్వేషించే విద్యార్థిఅని అర్ధం.కానీ అంతమంచి పేరు జిహాద్ లాగానే తీవ్రవాదుల చెడ్డచేష్టలవల్ల చెడ్డపేరుగా మారిపోయింది.ఈ తాలిబన్లు ఇస్లాం పరిరక్షకులుగా చెప్పుకుంటారుగానీ ఇస్లాం ప్రభోదించే ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయకుండా హింసకు మారణకాండకు పాల్పడుతారు.వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్థాన్ లలో ఉన్నారు.రాజ్యాలను అల్లకల్లోలం చేస్తున్నారు. తాలిబాన్లను సృష్టించింది పాకిస్థానీ నేతలేనని,అమెరికాకు చెందిన సిఐఎ, తన దేశానికి చెందిన ఐఎస్ఐ కలసి తాలిబన్ లకు ఊపిరిపోశాయని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అన్నారు.(ఈనాడు - 10 మే 2009).పాక్‌లోని స్వాత్ లోయలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తాలిబన్లు ఈ రెండేళ్లలో 200 స్కూళ్లకు నిప్పు పెట్టారు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఆడపిల్లలు చదువుకోకూడదని ఆదేశాలిస్తున్న తాలిబస్లు ఆడపిల్లలు చదువుకోకుండా అడ్డుకునేందుకు ఏకంగా స్కూళ్లనే తగులబెట్టారు.
భారత స్వాతంత్ర్య చట్టం 1947 అన్నది బ్రిటిషు ఇండియాను భారతదేశం, పాకిస్తాన్ అన్న రెండు స్వతంత్ర డొమినియన్లుగా విభజించేందుకు యునైటెడ్ కింగ్ డమ్ పార్లమెంటు చేసిన చట్టం. జూలై 18, 1947న ఈ చట్టం రాజసమ్మతి పొందింది, భారత స్వాతంత్ర్యం, పాకిస్తాన్ ఏర్పాటు ఆగస్టు 15 తేదీన జరిగాయి. ఐతే వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ఆగస్టు 15వ తేదీన అధికార బదిలీ కోసం ఢిల్లీలో ఉండవలసి రావడంతో, పాకిస్తాన్ 14 ఆగస్టు 1947న ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది.సంప్రదింపుల అనంతరం జవహర్ లాల్ నెహ్రూ, వల్లభ్ భాయి పటేల్, ఆచార్య కృపలానీ ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ, మహమ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీ ఖాన్, అబ్దుల్ రబ్ నిష్తార్ ల ప్రాతినిధ్యంలోని ముస్లిం లీగ్, సిక్ఖుల ప్రతినిధిగా సర్దార్ బల్దేవ్ సింగ్ లతో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్‌బాటన్ ఒప్పందానికి వచ్చాక, యు.కె.
భారత ఉపఖండంలో స్వాతంత్య్ర సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్రోద్యమము" (Indian Freedom Struggle) గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్రోద్యమములో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్, ఇతర వలసపాలకుల పాలనను అంతమొందంచటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి.
భారత దేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా వుంది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
'మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/),గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్‌కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో , ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది, పేద ప్రజల, నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని, 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు, క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల, కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం, మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి, విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ IIచే దైవ ఆశీర్వాదం ( బీటిఫికేషన్), బ్లెస్డ్ తెరెసా అఫ్ కలకత్తా బిరుదు పొందారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు., భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డు వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు.
ఓ కూనలమ్మా' అనే చివరి పదంతో ముగిసే చిన్న చిన్న పద్యాలైన కూనలమ్మ పదాలు అనే చిన్ని చిన్ని మాటల ఈటెల "ఆరుద్ర కూనలమ్మ పదాలు" ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి. కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. సరళంగా సామాన్యులకు సైతం అర్ధం కాగలిగేలా రాసిన ఈ పద్యాలలో అందమైన భావాలను కూడా మిళితం చేసి రాసాడు ఆరుద్ర.ఈ కూనలమ్మ పదంలోని అందమంతా తొలి మూడు పాదాల అంత్యప్రాసలే !
స్వాతంత్ర్యం కోసం పరాయి పాలకులపై సమరం జరిపిన వీరులను స్వాతంత్ర్య సమర యోధులు అంటారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీజీని ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధునిగా పేర్కొనవచ్చు. ఒక దేశంపై మరొక దేశం పెత్తనం చెలాయిస్తున్నప్పుడు పరాయి పాలకుల బానిసత్వం నుంచి తమ దేశ ప్రజలను కాపాడటానికి, దేశ సంపదను కాపాడటానికి నడుము బిగించి పరాయి పాలకుల పాలనకు ఎదురు తిరిగి తమ దేశ స్వాతంత్ర్యం కోసం పాటు పడిన వారు వీరు.
త్రివర్ణ లేదా త్రివర్ణ అనేది ఒక రకమైన జెండా లేదా బ్యానర్ రూపకల్పన, ఇది 16 వ శతాబ్దంలో రిపబ్లికనిజం, స్వేచ్ఛ లేదా వాస్తవానికి విప్లవానికి చిహ్నంగా ఉద్భవించింది. 1848 నాటి విప్లవాల నుండి 1848 నాటి ఫ్రెంచ్ విప్లవాల కాలంలో స్వతంత్ర రిపబ్లిక్ ఏర్పడటంతో ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా, మెక్సికో, ఐర్లాండ్ దేశాలు ఈ జెండాలను మొదట స్వీకరించాయి.1848 నుండి వచ్చిన ఐరిష్ త్రివర్ణ మినహా ఇది 1916 లో ఈస్టర్ రైజింగ్ వరకు ప్రాచుర్యం పొందలేదు.1919 ప్రాచుర్యం పొంది స్వీకరించబడింది.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు.అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు.
బ్రిటీష్ పాలన లేదా బ్రిటీష్ రాజ్ భారత ఉపఖండంలో స్థూలంగా 1858 నుంచి 1947 వరకూ సాగిన బ్రిటీష్]] పరిపాలన. ఈ పదాన్ని అర్థస్వతంత్ర కాలావధికి కూడా ఉపయోగించవచ్చు. ఇండియాగా సాధారణంగా పిలిచే ఈ బ్రిటీష్ పాలిత ప్రాంతంలో -బ్రిటీషర్లు నేరుగా పరిపాలించే ప్రాంతాలతో పాటుగా, వేర్వేరు రాజులు పరిపాలించే ప్రిన్స్ లీ స్టేట్స్ కూడా కలిసివున్నాయి- మొత్తంగా ఆ ప్రాంతమంతా బ్రిటీష్ సార్వభౌమత్వం లేదా చక్రవర్తిత్వం కింద ఉన్నట్టు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
ఎర్రకోట, మొఘల్ చక్రవర్తి షాజహాన్ 15వ శతాబ్దములో పాత ఢిల్లీ నగరంలో (ప్రస్తుతం ఢిల్లీ, ఇండియా) నిర్మించిన కోట. 1857 సంవత్సరములో మొఘల్ చక్రవర్తి బహాదుర్ షా జఫర్ బ్రిటీషువారి పాలన లోని భారత ప్రభుత్వంచే దేశబహిష్కరణకు గురయ్యే వరకు, ఢిల్లీ పట్టణం మొఘలులకు రాజధానిగా వ్యవహరించింది. బ్రిటీషువారు ఈ కోటను 1947 సంవత్సరములో భారతదేశం స్వాతంత్ర్యం పొందేవరకు, ఒక సైన్య శిబిరములాగ వాడేరు.
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు.
జవాహర్లాల్ నెహ్రూ రాజకీయ జీవితం, 1945-1947
1945 నుంచి 1947 వరకూ సాగిన జవాహర్లాల్ నెహ్రూ రాజకీయ జీవితాన్ని నమోదుచేస్తుంది ఈ వ్యాసం. 1945 జూన్ 15న రెండేళ్ళ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలపు జైలు జీవితాన్ని ముగించుకుని భారత దేశంలో రాజ్యాంగ సభ, డొమినియన్ల ఏర్పాటుకు బ్రిటీష్ వారు ప్రారంభించిన సంప్రదింపుల్లో పాల్గొనడం ప్రారంభించిన నెహ్రూ మరో రెండేళ్ళ పాటు రకరకాల రాజకీయ వ్యవహారాల్లో తలమునకలయ్యాడు. 1945లో వేవెల్ ప్రారంభించిన సంప్రదింపులకు ఆహ్వానం లేక వెళ్ళకపోయినా, తర్వాత కేంద్ర, రాష్ట్రాల శాసన సభల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసి జనరల్ నియోజకవర్గాల్లో గెలవడంలో తన పాత్ర పోషించాడు.
వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాథారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం | లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో విష్ణువు ఒకరు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి నాశకునిగాను భావిస్తారు. శ్రీవైష్ణవం సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాధుడు, పరబ్రహ్మము, సర్వేశ్వరుడు.
కెప్టెన్ విక్రం బాత్రా (పరమవీరచక్ర) (1974 సెప్టెంబరు 9 – 1999 జూలై 7) భారతీయ సైనికాధికారి. అతని మరణానంతరం భారత అత్యున్నత పురస్కారం పరమవీరచక్ర లభించింది. అతను 1999లో భారతదేశం, పాకిస్థాన్ దేశాల మధ్య కాశ్మీర్ లోని కార్గిల్ లోజరిగిన యుద్ధంలో దేశానికి చేసిన సేవలకు గానూ ఈ పురస్కారం లభించింది.భారతదేశ చరిత్రలో క్లిష్టమైన పర్వతాలపై జరిపిన యుద్ధానికి నాయకత్వం వహించాడు.అతను కొన్నిసార్లు "షేర్ షా" గా పిలువబడేవాడు.