The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కోల్‌కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించారు. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.
పవన్ కల్యాణ్, తెలుగు సినీనటుడు, నిర్మాత, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత, రాజకీయవేత్త.ఇతని తల్లిదండ్రులు కొణిదెల వెంకటరావు, అంజనాదేవి, 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) పవన్‌కు పెద్దన్నయ్య.
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (1949 జూలై 8 - 2009 సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
బాబరు (ఆంగ్లం : Babur), (ఫిబ్రవరి 14, 1483 - డిిిిిిిిసెంబర్ ,26 1530). (పర్షియన్ :ﻇﻬﻴﺮ ﺍﻟﺪﻳﻦ محمد بابر ) ; ఇతని బిరుదనామములు - అల్ సుల్తాన్ అల్-ఆజమ్ వల్ లాహ్ ఖాన్ అల్-ముకఱ్రం జహీరుద్దీన్ ముహమ్మద్ జలాలుద్దీన్ బాబర్ పాద్షాహ్ ఘాజీ, కాగా ఈతను 'బాబర్' నామముతోనే సుప్రసిద్ధుడయ్యాడు. బాబర్ 'మధ్య ఆసియా' కు చెందిన వాడు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు., భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డు వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు.
Nelson mandela నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (ఆంగ్లం Nelson Rolihlahla Mandela, (18 జూలై, 1918 - డిసెంబర్ 5, 2013) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేఖ ఉద్యమ కారుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
భారత దేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా వుంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు.
ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసంతెలుగులో పోతన రచించిన గ్రంథాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి. భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ.
చత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు.అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు.
గురజాడ అప్పారావు gura jada (1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27 న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు.
సుధా చంద్రన్ ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి. తాను 1981 జూన్ నెలలో తమిళనాడు లోని "త్రిచీ" వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులో మయూరి సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా, టెలివిజన్ ధారావాహికలలో నటించారు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి లో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
టైఫాయిడ్ జ్వరం', ఆంత్రిక జ్వరం, సాల్మొనెల్ల టైఫి గా కూడా పిలువబడుతుంది లేదా సాధారణంగా టైఫాయిడ్ అంటారు, ఈ వ్యాధి సాల్మొనెల్ల ఎంటేరికా సరోవర్ టైఫి అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ వ్యాధి అతిసారం, దద్దుర్లు కలుగజేసే ఒక అంటువ్యాధి. టైఫాయిడ్, టైఫిస్‌కు సాధారణంగా కలిగే న్యూరోసైకియాట్రిక్ లక్షణాల నుండి, గ్రీక్ పదానికి అర్థం వచ్చే Stupor - స్తబ్దత నుండి టైఫాయిడ్ అనే పేరు వచ్చినది .
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చే ఋగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం, హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక, నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు.
జోతిబా ఫూలే అని కూడా పిలువబడే జ్యోతిరావు గోవిందరావు ఫులే (1827 ఏప్రిల్ 11 - 1890 నవంబరు 28) ఒక భారతీయ సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త, మహారాష్ట్రకు చెందిన రచయిత. అతను కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు. అతను భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు.
నాసిరుద్దీన్ ముహమ్మద్ హుమాయాన్ ( అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖాన్ అల్-ముకర్రమ్, జామ్-ఇ-సల్తనత్-ఎ-హఖీఖి వ మజాజి, సయ్యద్ అల్-సలాతీన్, అబుల్ ముజఫ్ఫర్ నాసిర్ ఉద్దీన్ ముహమ్మద్ హుమాయూన్ పాద్షాహ్ గాజి, జియాఉల్లాహ్) (పర్షియన్ : نصيرالدين همايون) (మార్చి 6 1508 – ఫిబ్రవరి 22 1556), మొఘల్ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి. ఇతను ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారత ప్రాంతాలను పాలించాడు. 1530–1540, తిరిగి 1555–1556 వరకూ పరిపాలించాడు.
అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగంలో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.
కొన్ని సహస్రాబ్దులుగా భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది. ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు.
పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం.