The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కోల్‌కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించారు. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.
నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (ఆంగ్లం Nelson Rolihlahla Mandela, (18 జూలై, 1918 - డిసెంబర్ 5, 2013) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కారుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (African National Congress) కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన అన్నమయ్య 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం శాసనసభ సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడూ అయిన వి.దొరైస్వామి నాయుడు నిర్మించాడు. అన్నమయ్యపై చిత్రాన్ని తీయాలని జంధ్యాలతో పాటు అనేకమంది దర్శకులు ప్రయత్నించి విఫలమయ్యారు..
గురజాడ అప్పారావు gura jada (1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి.
వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
ఓజోన్ పొర ఓజోన్ కవచం భూమి యొక్క స్ట్రాటో ఆవరణలోని ఒక ప్రాంతం, ఇది సూర్యుని యొక్క అతినీలలోహిత వికిరణాన్ని గ్రహిస్తుంది. స్ట్రాటో ఆవరణలోని ఇతర వాయువులకు సంబంధించి ఇది ఇప్పటికీ చిన్నది అయినప్పటికీ, వాతావరణంలోని ఇతర భాగాలకు సంబంధించి ఓజోన్ (O3) అధిక సాంద్రతను కలిగి ఉంటుంది. ఓజోన్ పొరలో ఓజోన్ మిలియన్‌కు 10 భాగాల కన్నా తక్కువ ఉంటుంది, మొత్తం భూమి యొక్క వాతావరణంలో ఓజోన్ గా సాంద్రత సగటున మిలియన్‌కు 0.3 భాగాలు.
ఆహారపు గొలుసు (Food Chain ) అనేది ఏ జీవావరణ వ్యవస్థలోనైనా వృక్షాలు, జంతువులు జకదాని పై మరొకటి ఆధారపడి ఉండే ఒక ప్రక్రియ. ఆ జీవసముదాయము ఆహారపు గోలుసును ఏర్పరుస్తాయి. ఒకదానితో ఒకటి ఏ విధంగా లంకెపడి ఉంటుందో వాటికి అవసరమయ్యే పోషక పదార్ధముల మీద ఆవిధంగా ఆధారపడి ఉంటాయి మెక్కలలోని మూల ఆహారశక్తి జంతువులలోకి, ఇవి ఒకదానిని మరొకటి తినడం వల్ల జక జంతువు నుండి మరొక జంతువుకు రవాణా అవుతుంది.సజీవులన్నీ (మొక్కలు కాకుండా ) ఆహారం కోసం ఒకరిపై మరొకరు ఆధారపడి ఒక గొలుసులాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు.అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు.
భారతదేశం లో, ఇంజనీర్ల దినోత్సవము సెప్టెంబరు 15 న జరుపుకుంటారు. సుప్రసిద్ధ ఇంజనీర్, పండితుడు, ప్రముఖ అధికారి, 1912 నుండి 1919 వరకు మైసూర్ దివాన్ గా పనిచేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962) గౌరవార్థం, ఆయన పుట్టినరోజుని ఇంజనీర్ల దినోత్సవముగా జరుపుతారు. ఈయన భారతదేశంలో అనేక నదులపై ఆనకట్టలు, వంతెనలు కట్టి నీటిపారుదల, త్రాగునీరు పథకాల ద్వారా జలవనరుల సద్వినియోగానికి అంతర్జాతీయంగా పేరుపొందాడు.
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment)ను కలుషితం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును. వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth )పై నున్న జీవరాశులకు అనుకూలమైనది.
కొన్ని సహస్రాబ్దులుగా భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది. ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2021
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2021 దేశవాలీ టీ-20 లీగ్ ఏప్రిల్ 9, 2021 నుంచి 2021 మే 30 వరకు జరుగనుంది. ఏప్రిల్ 9న చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో ప్రారంభ మ్యాచ్, మే 30న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (మొతేరా స్టేడియం) లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.కొవిడ్ మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2021) సీజన్ ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా 2021 మే 4న ప్రకటించాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మిగిలిన మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించాలని 29 మే 2021న జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో బీసీసీఐ నిర్ణయించింది.
జోతిబా ఫూలే అని కూడా పిలువబడే జ్యోతిరావు గోవిందరావు ఫులే (1827 ఏప్రిల్ 11 - 1890 నవంబరు 28) ఒక భారతీయ సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త, మహారాష్ట్రకు చెందిన రచయిత. అతను కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు. అతను భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు.
సుధా చంద్రన్ ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి. తాను 1981 జూన్ నెలలో తమిళనాడు లోని "త్రిచీ" వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులో మయూరి సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా, టెలివిజన్ ధారావాహికలలో నటించారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
రెండవ ప్రపంచ యుద్ధం ఉత్పత్తి నుండి వాయు కాలుష్యం]] పర్యావరణ వ్యవస్థ అనగా భౌతిక వ్యవస్థలు లేదా జీవ క్రియలకు అస్థిరత, అసమానత, హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలని పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని కాలుష్యం అంటారు. కాలుష్యం - మెర్రియం - వెబ్‌స్టర్ ఆన్లైన్ నిఘంటువు నుండి తీసుకున్న వివరణ.]</ref> కాలుష్యం అనేది రసాయనిక పదార్ధాలు లేదా ధ్వని, వేడిమి లేదా కాంతి శక్తి వంటి శక్తి రూపాలలో ఉండవచ్చు.కలుషితాలు, కాలుష్య కారక పదార్ధాలు, విదేశీ పదార్ధాలు లేదా శక్తులు లేదా సహజ సిద్దమైనవి; సహజ విధంగ లభిస్తున్నప్పుడు వాటి సహజ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు కలుషితాలుగా గుర్తించబడతాయి.కాలుష్యం తరచుగా మూల కేంద్ర కాలుష్యం లేదా మూల కేంద్రం లేని కాలుష్యం అని విభజింపబడుతుంది. బ్లాక్‌స్మిత్ సంస్థ ప్రతీ సంవత్సరం ప్రపంచ నీచ కలుషిత ప్రాంతాల జాబితాను విడుదల చేస్తుంది.
భారత దేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా వుంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ.క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాల తర్వాత వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ (చారిత్రకంగా పశ్చిమాన పన్నెండు రోజుల పాటు ఉండే పండుగ రోజులు ఇవి, పన్నెండవ రోజు రాత్రికి ఇవి తారాస్థాయికి చేరుకుంటాయి.) అని పిలిచే సీజన్ ఆరంభంగా నిలుస్తుంది.కొత్త నిబంధన లోని సంప్రదాయిక క్రిస్మస్ కథనం ప్రకారం, రక్షకుని గురించిన జోస్యాలను అనుసరించి జోసెఫ్, మేరీ బెత్లెహేం వచ్చినప్పుడు వసతి గృహంలో గదులు లభ్యం కాకపోవడంతో పశువుల పాకలో వారికి ఆశ్రయం దొరికింది, అక్కడే క్రీస్తు జన్మించాడు.దేవదూతలు ఈ విషయాన్ని పశువుల కాపరులకు చెప్పగా, వారు సమాచారం మిగిలినవారికి చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రిస్మస్ సెలవు రోజు, ఈ పండుగను క్రైస్తవుల్లో అత్యధికులు మతపరంగానూ, క్రైస్తవేతరులు సాంస్కృతికంగానూ జరుపుకుంటారు, పశ్చిమదేశాల్లో సెలవుల సీజన్లో అత్యంత ముఖ్యమైన భాగం. క్రీస్తు ఏ నెలలో, ఏ తేదీన జన్మించాడన్న విషయం తెలియకపోయినా, నాలుగవ శతాబ్ది మధ్యభాగం నాటికల్లా పశ్చిమ క్రైస్తవ చర్చి క్రిస్మస్ ను డిసెంబరు 25 నాటికి నిర్వహించడం సాగించింది, ఇదే తేదీని తర్వాత తూర్పు క్రైస్తవం కూడా స్వీకరించింది.
కిరణ్ బేడీ (Kiran Bedi) భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో అఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి లో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
ఒక గ్రహంపై ఉన్న వాతావరణం వెలువరచే రేడియేషన్ కారణంగా గ్రహ ఉపరితలంపై పెరిగే ఉష్ణోగ్రత, ఈ వాతావరణం లేనప్పుడు పెరిగే ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే దాన్ని గ్రీన్హౌస్ ప్రభావం అంటారు. గ్రహపు వాతావరణంలో రేడియేటివ్గా క్రియాశీలంగా ఉండే వాయువులు (అనగా గ్రీన్హౌస్ వాయువులు ) అన్ని దిశలలోనూ శక్తిని ప్రసరిస్తాయి. ఈ రేడియేషన్‌లో కొంత భాగం గ్రహ ఉపరితలం పైకి వచ్చి, దాన్ని వేడెక్కిస్తుంది.
సైబర్ క్రైమ్, లేదా కంప్యూటర్-ఆధారిత నేరం, ఇది కంప్యూటర్ , నెట్‌వర్క్‌తో కూడిన నేరం. కంప్యూటర్ నేరం వ్యవహారంలో ఉపయోగించబడి ఉండవచ్చు లేదా అది లక్ష్యంగా ఉండవచ్చు ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరమైన నేరాలను సైబర్ నేరాలు(Cyber Crimes) అంటారు . సైబర్ క్రైమ్ ఒక వ్యక్తి, సంస్థ లేదా దేశం యొక్క భద్రత , ఆర్థిక ఆరోగ్యాన్ని బెదిరించవచ్చు..రహస్య సమాచారాన్ని అడ్డగించినప్పుడు , బహిర్గతం చేసినప్పుడు, చట్టబద్ధంగా లేదా లేకపోతే సైబర్ క్రైమ్ చుట్టూ అనేక గోప్యతా సమస్యలు ఉన్నాయి సాంప్రదాయ నేరాలు, దొంగతనం, ఫోర్జరీ, మోసం, పరువు నష్టం వంటివి తరచుగా కంప్యూటర్ లేదా కంప్యూటర్ నెట్‌వర్క్‌తో సంబంధం కలిగి ఉంటాయి.
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
గీతాంజలి పూర్తి అనువాదం వికిసోర్స్‌లో ఉన్నది. ఇక్కడ చూడండిభారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ లేదా రవీంద్రనాధ టాగూరు (Ravindranath Tagore, ఆంగ్ల: Rabindranath Tagore నించి (బంగ్లా లో "బ" ఇతర భారత భాషలు లో "వ" కోసం); బంగ్లా: রবীন্দ্রনাথ ঠাকুর రోబీంద్రోనాథ్ ఠాకూర్) (మే 7, 1861 – ఆగస్టు 7, 1941). ఠాగూర్ గానూ, రవీంద్రుని గాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.