The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కోల్‌కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించారు. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.
వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు.
గుప్త సామ్రాజ్యము భారతదేశంలోని ఒక హిందూ సామ్రాజ్యం (సంస్కృతం:samskrutam: गुप्त राजवंश, గుప్త రాజవంశం) గుప్త వంశపు రాజులచే సుమారు క్రీ.శ.280 నుండి క్రీ.శ.550 వరకు పాలించబడినది. ఈ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గుజరాత్,రాజస్థాన్ లోని కొంతభాగం, పశ్చిమ భారతదేశం బంగ్లాదేశ్ ప్రాంతాలకు విస్తరించింది. పాటలీపుత్ర (ప్రస్తుత బీహారు రాజధాని పాట్నా) వీరి రాజధానిగా ఉంది.
ఓల్గా గా ప్రసిద్ధి పొందిన పోపూరి లలిత కుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ, సాహిత్యరంగపు చర్చలో స్త్రీవాద ధృక్పధాన్ని ప్రవేశపెట్టిన రచయితగా ఈమెను గుర్తిస్తారు స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గా, తనను తాను తెలుగులో గురజాడ అప్పారావు వ్రాసిన కన్యాశుల్కంతో ప్రారంభమైన అభ్యుదయ రచనా పరంపరలో భాగంగా కూడా భావించింది.నవంబర్ 27, 1950లో గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి గ్రామములో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పోపూరి వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు., భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డు వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు.
Nelson mandela నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (ఆంగ్లం Nelson Rolihlahla Mandela, (18 జూలై, 1918 - డిసెంబర్ 5, 2013) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేఖ ఉద్యమ కారుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు.
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
యునెస్కో (UNESCO) సెప్టెంబర్ 8 తేదీని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం (ఆంగ్లం: International Literacy Day) గా ప్రకటించింది.
గురజాడ అప్పారావు gura jada (1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి.
జోతిబా ఫూలే అని కూడా పిలువబడే జ్యోతిరావు గోవిందరావు ఫులే (1827 ఏప్రిల్ 11 - 1890 నవంబరు 28) ఒక భారతీయ సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త, మహారాష్ట్రకు చెందిన రచయిత. అతను కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు. అతను భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు.
ఆపరేషన్ ఎంటెబీ అనేది ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) విజయవంతంగా జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్య. ఈ ఆపరేషన్‌ను 1976 జూలై 4 న ఉగాండా లోని ఎంటెబీ విమానాశ్రయంలో జరిపారు. అంతకు ఒక వారం ముందు, జూన్ 27న, ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందిన విమానాన్ని పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్టైన్ - ఎక్స్టర్నల్ ఆపరేషన్స్ (PFLP-EO) అనే సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులు, వాదీ హద్దాద్ ఆదేశానుసారం, జర్మన్ రివల్యూషనరీ సెల్స్ కు చెందిన ఇద్దరు సభ్యులతో కలిసి హైజాక్ చేసారు.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు.అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
భానుమతీ రామకృష్ణ (సెప్టెంబరు 7, 1926 - డిసెంబరు 24, 2005) దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. మల్లీశ్వరి,సారంగధర,విప్రనారాయణ,బొబ్బిలి యుధ్ధం, మంగమ్మ గారి మనవడు ,పెళ్ళికానుక వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఈమె ఒంగోలులో జన్మించింది.
భారత దేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా వుంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
టైఫాయిడ్ జ్వరం', ఆంత్రిక జ్వరం, సాల్మొనెల్ల టైఫి గా కూడా పిలువబడుతుంది లేదా సాధారణంగా టైఫాయిడ్ అంటారు, ఈ వ్యాధి సాల్మొనెల్ల ఎంటేరికా సరోవర్ టైఫి అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ వ్యాధి అతిసారం, దద్దుర్లు కలుగజేసే ఒక అంటువ్యాధి. టైఫాయిడ్, టైఫిస్‌కు సాధారణంగా కలిగే న్యూరోసైకియాట్రిక్ లక్షణాల నుండి, గ్రీక్ పదానికి అర్థం వచ్చే Stupor - స్తబ్దత నుండి టైఫాయిడ్ అనే పేరు వచ్చినది .
భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం : Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు ఉన్నాయి) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ.1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్న పార్టీ. ప్రస్తుతం సోనియా గాంధీ ఈ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది - పంజాబ్, రాజస్థాన్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘఢ్.
సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చే ఋగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం, హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక, నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు.
జవాహర్లాల్ నెహ్రూ రాజకీయ జీవితం, 1945-1947
1945 నుంచి 1947 వరకూ సాగిన జవాహర్లాల్ నెహ్రూ రాజకీయ జీవితాన్ని నమోదుచేస్తుంది ఈ వ్యాసం. 1945 జూన్ 15న రెండేళ్ళ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలపు జైలు జీవితాన్ని ముగించుకుని భారత దేశంలో రాజ్యాంగ సభ, డొమినియన్ల ఏర్పాటుకు బ్రిటీష్ వారు ప్రారంభించిన సంప్రదింపుల్లో పాల్గొనడం ప్రారంభించిన నెహ్రూ మరో రెండేళ్ళ పాటు రకరకాల రాజకీయ వ్యవహారాల్లో తలమునకలయ్యాడు. 1945లో వేవెల్ ప్రారంభించిన సంప్రదింపులకు ఆహ్వానం లేక వెళ్ళకపోయినా, తర్వాత కేంద్ర, రాష్ట్రాల శాసన సభల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసి జనరల్ నియోజకవర్గాల్లో గెలవడంలో తన పాత్ర పోషించాడు.
సుధా చంద్రన్ ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి. తాను 1981 జూన్ నెలలో తమిళనాడు లోని "త్రిచీ" వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులో మయూరి సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా, టెలివిజన్ ధారావాహికలలో నటించారు.
కొన్ని సహస్రాబ్దులుగా భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది. ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు.
ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసంతెలుగులో పోతన రచించిన గ్రంథాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి. భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ.
కిరణ్ బేడీ (Kiran Bedi) భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో అఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది.
క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ.క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాల తర్వాత వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ (చారిత్రకంగా పశ్చిమాన పన్నెండు రోజుల పాటు ఉండే పండుగ రోజులు ఇవి, పన్నెండవ రోజు రాత్రికి ఇవి తారాస్థాయికి చేరుకుంటాయి.) అని పిలిచే సీజన్ ఆరంభంగా నిలుస్తుంది.కొత్త నిబంధన లోని సంప్రదాయిక క్రిస్మస్ కథనం ప్రకారం, రక్షకుని గురించిన జోస్యాలను అనుసరించి జోసెఫ్, మేరీ బెత్లెహేం వచ్చినప్పుడు వసతి గృహంలో గదులు లభ్యం కాకపోవడంతో పశువుల పాకలో వారికి ఆశ్రయం దొరికింది, అక్కడే క్రీస్తు జన్మించాడు.దేవదూతలు ఈ విషయాన్ని పశువుల కాపరులకు చెప్పగా, వారు సమాచారం మిగిలినవారికి చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రిస్మస్ సెలవు రోజు, ఈ పండుగను క్రైస్తవుల్లో అత్యధికులు మతపరంగానూ, క్రైస్తవేతరులు సాంస్కృతికంగానూ జరుపుకుంటారు, పశ్చిమదేశాల్లో సెలవుల సీజన్లో అత్యంత ముఖ్యమైన భాగం. క్రీస్తు ఏ నెలలో, ఏ తేదీన జన్మించాడన్న విషయం తెలియకపోయినా, నాలుగవ శతాబ్ది మధ్యభాగం నాటికల్లా పశ్చిమ క్రైస్తవ చర్చి క్రిస్మస్ ను డిసెంబరు 25 నాటికి నిర్వహించడం సాగించింది, ఇదే తేదీని తర్వాత తూర్పు క్రైస్తవం కూడా స్వీకరించింది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం.రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది.దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.