The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
శ్యామ్ సింగరాయ్ కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న తెలుగు సినిమా. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని హీరోగా, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్యామ్ సింగరాయ్ కి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
పుష్ప 2021లో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అర్జున్ , రష్మికా మందన్న, సునీల్ శెట్టి, ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 17న విడుదలైంది.
పంచరత్న కృతులు త్యాగరాజు కర్ణాటాక సంగీతానికి అందించిన ఐదు రత్నాల వంటి కీర్తనలు.శ్రీత్యాగరాజస్వామి స్వరపరచిన ఈ ఐదు కృతులను పంచరత్న కృతులను "త్యాగరాజ పంచ రత్నాలు" అనడం కూడా కద్దు. 19 వ శతాబ్దంలో శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోసిన త్రిమూర్తి వాగ్గేయకారులలో ఒకడైన త్యాగయ్య అందించిన వేలాది కీర్తనలలో రత్నాల వంటివి. ఈ వేలాది కీర్తనలలో 750 కీర్తనలు లభించుచున్నాయి.
త్యాగయ్య, త్యాగ బ్రహ్మ, త్యాగ రాజుగా ప్రసిద్ధి కెక్కిన ఈయన ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి లతో పాటు కర్ణాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులలో ఒకరు. 16 వ శతాబ్దాంతమున విజయ నగర సామ్రాజ్య పతనానంతరం జన జీవన శైలిలో వచ్చిన విపరీతమైన మార్పుల వలన ఎంతో మంది తెలుగు వాళ్ళు తమిళనాడుకు వలస పోయారు, ఆ విధంగా వలస పోయిన కుటుంబాలకు చెందిన వాడే త్యాగయ్య కూడా. ప్రకాశం జిల్లాకు చెందిన కాకర్ల గ్రామమునకు చెందినవాడని చెప్పుకున్నాడు త్యాగయ్య.
అఖండ 2021లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు సినిమా. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ , సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలైంది.
భారత దేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా వుంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడుతోంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్ రూజ్వెల్ట్, 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్ర్తీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్ అన్న పదాన్ని పీపుల్‌గా మార్చింది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
'ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని , నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి.
భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా
బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ పాలన నుండి భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ప్రయత్నాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో అనేక పద్ధతుల ద్వారా భారత స్వతంత్ర సంగ్రామంలో జరిగాయి.కొందరు తమ ప్రాణాలర్పించారు. మరి కొంతమంది పలుమార్లు జైలుపాలయ్యారు. ఇది ప్రత్యేకించి భారత ఉపఖండంలో వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు, సత్యాగ్రహాలు, నిరాహారదీక్షలు, సభలు, రచనలు ద్వారా రాజకీయ ప్రచారం చేసిన లేదా పరిగణించబడిన వ్యక్తుల జాబితా.
సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా (Death Sentenced Disease) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చే ఋగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం, హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక, నియంత్రించటానికి (Chronic and Manageable Disease) వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు.
ప్రజాస్వామ్య దేశాలలో ఓటర్లచే ప్రజాప్రతినిధులను ఎన్నుకొను ప్రక్రియనే ఎన్నికల వ్యవస్థగా పిలువబడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో స్వాతంత్ర్యం 2004 లో జరిగిన ఎన్నికలలో దాదాపు 67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఐరోపా సమాఖ్యలోగల దేశాల మొత్తం ఓటర్ల సంఖ్య కన్నా రెట్టింపు సంఖ్య.
ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ భావన లేదా ప్రభుత్వ ఏర్పాటు విధానం. ఇందులో ప్రజలు నిర్ణయాధికారాన్ని కలిగివుంటారు.ఆంగ్లంలో Democracy అని అంటారు.గ్రీకు బాషా పదం డిమోక్రటియా నుండి ఉద్బవించింది. dēmos అనగా ప్రజలు, kratos అనగా బలం పరిపాలన అని అర్థము.ప్రజాస్వామ్యానికి, ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన (నిర్దిష్టమైన) నిర్వచనం అంటూ ఏది లేదు.
భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలు
భారతదేశంలో ఆదేశిక సూత్రాలు (ఆంగ్లం : Directive Principles of State Policy). భారతరాజ్యాంగం, పౌరులకు ప్రాథమిక హక్కులను ప్రకటించింది. మరి ప్రభుత్వాలకు ఏవైనా ఆదేశాలిచ్చిందా?
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కోల్‌కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించారు. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.
శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత (37°సె, 98.6°ఫా) కంటే మించి ఉంటే ఆ స్థితిని జ్వరం (ఆంగ్లం: Fever) అంటారు. దీనిని ఉష్ణమాపకం లేదా థర్మామీటర్ (జ్వరమాపకం) ద్వారా కొలిచి గుర్తిస్తారు. మన శరీరంలోని సహజమైన రోగనిరోధక శక్తి రోగాల వైరస్‌లతో, బాక్టీరియా, ఫంగస్ లాంటి వాటితో జరిపే పోరాటంలో, శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (కొడాలి నాని) వై.ఎస్.ఆర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి మంత్రి వర్గంలో పొర సరఫరాలు, వినియోగదారులు వ్యవహారాల మంత్రి. అతను కృష్ణా జిల్లా లోని గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి 2004 నుండి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యాడు. అతను 2004, 2009 శాసనసభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా, 2014, 2019 శాసనసభ ఎన్నికలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందాడు.
ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పోతుంది. ఇది సహజ ప్రక్రియ. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కలిగించడం, లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని స్వయంతృప్తి /హస్త ప్రయోగం (ఆంగ్లం: మాస్టర్బేషన్) అంటారు.