The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఆంధ్రప్రదేశ్ లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రములే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
కమల్ హాసన్ (తమిళం : கமல்ஹாசன்) ( నవంబర్ 7, 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడి లో పుట్టాడు) భారతదేశపు నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి లో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత . అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు.
శివ సహస్రనామములు శివుడు యొక్క ఒక "వెయ్యి పేర్లు జాబితాలో" ఉంది, హిందూమతం యొక్క అత్యంత ముఖ్యమైన దేవతలలో శివుడు ఒకరు. హిందూ మతం సంప్రదాయంలోని సహస్రనామములు ఒక రకం యొక్క భక్తి శ్లోకం (సంస్కృతం: స్తోత్రం ), ఒక దేవత యొక్క అనేక పేర్లు, సహస్రనామములు జాబితా లోని పేర్లు దైవాన్ని ప్రశంసించినట్లు అవుతోంది, ఆ దైవం సంబంధం లక్షణాలు, విధులు, ప్రధాన పురాణాలలో ఒక కూలంకషంగా జాబితా (కేటలాగ్) ను అందిస్తాయి. శివ సహస్రనామ స్తోత్రము వీటన్నింటి స్తోత్రరూపం.
నల్లా నరసింహులు, (1926, అక్టోబరు 2 – 1993, నవంబరు 5) తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు. తెలంగాణ విముక్తి పోరాటంలో ఎన్నోసార్లు పోలీసులకు పట్టుబడి, మూడుసార్లు ఉరిశిక్షలు విధించబడి, కోర్టులో అత్యంత ధైర్యంగా తన వాదనలను వినిపించి న్యాయస్థానాల చేతనే 'తెలంగాణ టైగర్', ‘జనగామ సింహం’గా అని పిలువబడ్డాడు.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
20వ శతాబ్దం పూర్వభాగంలో పల్లెల్లో తెలుగు ప్రజల జీవనవిధానం
భారత దేశ జనాభాలో ఎనబై శాతం వ్యవసాయ దారులే. వీరిలో వ్యవసాయదారులు, వ్యవసాయ సంబంధిత పనులలో పనిచేసే వారు ఉన్నారు. సాంప్రదాయ వ్యవసాయం రాను రాను యాంత్రీకరణం వైపు పరుగిడుతున్నది.
పచ్చకామెర్లు, (జాండీస్) రక్తంలో బిలిరుబిన్ యొక్క స్థాయి హెచ్చినప్పుడు (హైపర్ బిలిరుబినీమియా) చర్మము, కనుగుడ్లు, మ్యూకస్ మెంబ్రేనులు పసుపు పచ్చ రంగుతేలడాన్ని పచ్చకామెర్లు అంటారు.ఈ పరిస్థితి వలన అన్ని శరీరద్రవాలలో బిలిరుబిన్ పెరుగుతుంది. సాధారణంగా, ఈ లక్షణాలు కంటికి స్పష్టంగా కనిపించాలంటే ప్లాస్మాలోని బిలిరుబిన్ యొక్క గాఢత సాధారణ విలువ అయిన 0.5 మి.గ్రా/డె.లీ కంటే మూడు రెట్లకు (1.5 మి.గ్రా/డె.లీ) పైగా పెరగాలి. జాండీస్ అన్న పదము ఫ్రెంచి భాషా పదమైన jaune (పసుపుపచ్చ) నుండి పుట్టింది.
ఆచార్య ఎన్.జి.రంగా (ఆంగ్లం: N.G.RANGA)గా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (నవంబరు 7, 1900 - జూన్ 9, 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ వాది, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు. 1991 లో భారత ప్రభుత్వం నుండి పద్మ విభూషణ్ పురస్కారం పొందారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
న్యుమోనియా (ఆంగ్లం: pneumonia) ఉపిరితిత్తుల వేగంగా శ్వాస తీసుకోవటం ప్లూరిటిస్ ప్లూరిసి ఇది, ప్రధానంగా అల్వియోలీ(వాయుకోశాలు) మంట కారణంగా ఇది సంభవిస్తుంది, వైరల్ బాక్టీరియా చిన్న గాలి సంచులను ఎగువ శ్వాస వ్యవస్థను ప్రభావితం చేసే వైరల్ అంటు వ్యాధి. లక్షణాలు సాధారణంగా పొడి పొడి దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి ఉంటాయి, మనిషి మొత్తం వణుకుతూ ఉంటారు, గుండె దడగా ఉంటుంది, భయం భయంగా ఉంటుంది. పొడిదగ్గు ముదిరి ఎక్కువ అవుతున్నప్పుడు తేమడ ఉండలు ఉండలుగా నోటిలోకి వస్తుంది, ఎక్కువ సేపు నిలబడి ఉండలేరు, పెద్ద శబ్దాలను వింటే తల నొప్పిగా ఉంటుంది, గొంతు పట్టేయడం కనీసం మంచినీరు కూడా తరగడానికి కంఠనాళం నొప్పిగా ఉండడం చిన్నపిల్లల్లో శ్వాసలో గురక శబ్దం వస్తుంది, చాలా ముఖ్యమైన సంకేతం.