The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు.
విజ్ఞాన శాస్త్రం లేదా సైన్సు అనేది ఈ ప్రపంచం గురించి మనకు తెలిసిన విషయాల్ని ఒక పద్ధతి ప్రకారం వివరించే శాస్త్రం.ప్రస్తుతం ఈ శాస్త్రం అనేక విభాగాలుగా విభజించబడి ఉంది. ప్రకృతి శాస్త్రంలో భౌతిక ప్రపంచం|భౌతిక ప్రపంచాన్ని గురించిన అధ్యయనం ఉంటుంది. సామాజిక శాస్త్రంలో ప్రజలు, సమాజం గురించిన విషయాలు ఉంటాయి.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు.అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికిసోమనాథుడిని ఆది కవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు.
ఆధునిక భారతదేశ పునాది స్థాననలో భారతీయ సంఘ సంస్కర్తలు గొప్ప చరిత్రను కలిగి ఉన్నారు. కొన్ని సందర్భాలలో వీరు తమ రాజకీయ, తత్వజ్ఞాన బోధనల ద్వారా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలను ప్రభావితం చేశారు. కొంతమంది భారతీయ సంఘ సంస్కర్తలు : Veelu entho goppa vallu రాజా రామ్ మోహన్ రాయ్ (1772 మే 22 – 1833 సెప్టెంబరు 27) కబీర్ (1440 - 1518) వీరచంద్ గాంధీ (1864–1901) ) స్వామి వివేకానంద (1863 జనవరి 12 – 1902 జూలై 4) జమ్నాలాల్ బజాజ్ (1884 నవంబరు 4 – 1942 ఫిబ్రవరి 11) వినోబా భావే (1895 సెప్టెంబరు 11 - 1982 నవంబరు 15) బాబా ఆమ్టే (1914 డిసెంబరు 26 – 2008 ఫిబ్రవరి 9) శ్రీరామ్ శర్మ ఆచార్య (1911 సెప్టెంబరు 20 – 1990 జూన్ 2) ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ (1820–1891) దండో కేశవ్ కార్వే (1858 ఏప్రిల్ 18 - 1962 నవంబరు 9) బాలశాస్త్రి జంబేకర్ 1812 జనవరి 6– 1846 మే 18) బి.ఆర్.అంబేద్కర్ (1891 ఏప్రిల్ 14 — 1956 డిసెంబరు 6) అనిబీసెంట్ (1847 అక్టోబరు 1 – 1933 సెప్టెంబరు 20) విట్టల్ రాంజీ షిండే (1873 ఏప్రిల్ 23 – 1944 జనవరి 2) గోపాల్ హరి దేశ్ ముఖ్ (1823–1892) కందుకూరి విరేశలింగం16 ఏప్రిల్ 1848 - 1919 మే 27.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కోల్‌కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.
భారత దేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా వుంది.
మేకపాటి రాజమోహన రెడ్డి (జ: 11 జూన్, 1944) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 2014-19 సంవత్సరాలకు నెల్లూరు నగర పార్లమెంటు సభ్యుడుగాయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతరుపున 16వ లోక్‌సభకు ఎన్నిక అయ్యారు .
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం (ఆంగ్లం: International Mother Language Day) ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశాడు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు.
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రోగా (ISRO) ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై, ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రోకు, దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు ఉన్నాయి.
పవన్ కల్యాణ్, తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత, రాజకీయ నాయకుడు.ఇతని తల్లిదండ్రులు కొణిదెల వెంకటరావు, అంజనాదేవి, 1968 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) పవన్‌కు పెద్దన్నయ్య.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (1879 మార్చి 14 -1955 ఏప్రిల్ 18 ) జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జెనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని (సాధారణ సాపేక్షత) ప్రతిపాదించారు .అతను తత్త్వశాస్త్రంలో ప్రభావవంతమైన కృషి చేశాడు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc^2 ను కనిపెట్టాడు.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment)ను కలుషితం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును. వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth )పై నున్న జీవరాశులకు అనుకూలమైనది.
ఒక క్రమ విధానంలో విజ్ఞానాన్ని అర్జించే కృషి చేసే వ్యక్తిని శాస్త్రవేత్త లేదా శాస్త్రజ్ఞుడు (Scientist) అని విస్తారమైన అర్ధంలో అనవచ్చును. లేదా వివిధ తాత్వికతలలో ఏదో ఒక విధానంతో గట్టి అనుబంధం ఉన్న వ్యక్తి కూడా శాస్త్రవేత్త అవుతాడు. కాని, సాధారణ పరిమిత వినియోగంలో శాస్త్రీయ విధానం అనుసరించి ఒక విషయాన్ని అధ్యయనం చేసే వ్యక్తి శాస్త్రవేత్త.
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది.ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ.