The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశాడు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు.
రోజా సెల్వమణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించింది. రోజా నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికైంది.ఆమె 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్.
సత్యశోధక్ సమాజ్ అనేది మహాత్మా జ్యోతిబా ఫూలే మహారాష్ట్రలోని పూణేలో, 1873 సెప్టెంబరు 24లో స్థాపించిన సాంఘిక సంస్కరణ సమాజము. అణగారిన వర్గాల వారికి, శూద్రులకు, దళితులకు, ముఖ్యంగా మహిళలకు విద్య, సాంఘిక హక్కులు, రాజకీయ చైతన్యం కలిగించడమే ఈ సమాజము యొక్క ముఖ్య ఉద్దేశం. జ్యోతీబా సతీమణి సావిత్రి బాయి మహిళా సమాజ విభాగానికి నాయకత్వం వహించేవారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిపాలనకి ములస్తంభం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాబినెట్. జూన్ 8, 2014 న సంయుక్త రాష్ట్రల గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాబినెట్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 20 మంది మంత్రులు ప్రమాణం చేసారు.
గుడ్ ఫ్రైడే క్రీస్తును శిలువ వెయ్యటం, కల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాథమికంగా ఒక సెలవు దినం. ఈ సెలవు దినం పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది, తరచుగా పాసోవర్ పై యూదుల అభిప్రాయంతో సరిపోలుతుంది. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుంది, క్రీస్తు సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది.
భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి, యాంత్రీకరణకు ప్రవేశపెట్టి, రసాయనిక ఎరువులను, క్రిమిసంహారక మందులనువాడి, సంకర జాతి వంగడాలను వాడి స్వల్పకాలంలో అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానాన్ని సాంధ్ర వ్యవసాయం లేదా హరిత విప్లవం (Green Revolution) అంటారు. ఇది మొట్ట మొదటి సారిగా మెక్సికోలో 1945 లో ప్రారంభమైంది. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్ ఇందుకు సహకారమందించాయి.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
రెండవ ప్రపంచ యుద్ధం ఉత్పత్తి నుండి వాయు కాలుష్యం]] పర్యావరణ వ్యవస్థ అనగా భౌతిక వ్యవస్థలు లేదా జీవ క్రియలకు అస్థిరత, అసమానత, హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలని పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని కాలుష్యం అంటారు. కాలుష్యం - మెర్రియం - వెబ్స్టర్ ఆన్లైన్ నిఘంటువు నుండి తీసుకున్న వివరణ.]</ref> కాలుష్యం అనేది రసాయనిక పదార్ధాలు లేదా ధ్వని, వేడిమి లేదా కాంతి శక్తి వంటి శక్తి రూపాలలో ఉండవచ్చు.కలుషితాలు, కాలుష్య కారక పదార్ధాలు, విదేశీ పదార్ధాలు లేదా శక్తులు లేదా సహజ సిద్దమైనవి; సహజ విధంగ లభిస్తున్నప్పుడు వాటి సహజ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు కలుషితాలుగా గుర్తించబడతాయి.కాలుష్యం తరచుగా మూల కేంద్ర కాలుష్యం లేదా మూల కేంద్రం లేని కాలుష్యం అని విభజింపబడుతుంది. బ్లాక్స్మిత్ సంస్థ ప్రతీ సంవత్సరం ప్రపంచ నీచ కలుషిత ప్రాంతాల జాబితాను విడుదల చేస్తుంది.
కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.
భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలు
భారతదేశంలో ఆదేశిక సూత్రాలు (ఆంగ్లం : Directive Principles of State Policy). భారతరాజ్యాంగం, పౌరులకు ప్రాథమిక హక్కులను ప్రకటించింది. మరి ప్రభుత్వాలకు ఏవైనా ఆదేశాలిచ్చిందా?
భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు
భారతదేశంలో ప్రాథమిక విధులు (ఆంగ్లం : Fundamental Duties) 1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి. 2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడింది.
చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. వేణుగోపాల కృష్ణ ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment)ను కలుషితం చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును. వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth )పై నున్న జీవరాశులకు అనుకూలమైనది.
డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పలాస శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. సీదిరి అప్పలరాజు ప్రస్తుతం పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
అంతర్జాతీయ మాతృ దినోత్సవం (ఆంగ్లం: Mother's Day) కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో) నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (జననం 1970 సెప్టెంబరు 27) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్థిక, ప్రణాళిక, శాసన వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు, 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ధోన్ నియోజకవర్గానికి శాసన సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (కొడాలి నాని) వై.ఎస్.ఆర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి మంత్రి వర్గంలో పొర సరఫరాలు, వినియోగదారులు వ్యవహారాల మంత్రి. అతను కృష్ణా జిల్లా లోని గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి 2004 నుండి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యాడు. అతను 2004, 2009 శాసనసభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా, 2014, 2019 శాసనసభ ఎన్నికలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందాడు.