The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట.ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి.
గుడ్ ఫ్రైడే క్రీస్తును శిలువ వెయ్యటం, కల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాథమికంగా ఒక సెలవు దినం. ఈ సెలవు దినం పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది, తరచుగా పాసోవర్ పై యూదుల అభిప్రాయంతో సరిపోలుతుంది. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుంది, క్రీస్తు సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది.
1927 డిసెంబరు 25 తేదీన అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్, అతడి అనుచరులు కొందరూ కలిసి మనుస్మృతిని దహనం చేశారు. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతం రాయగడ్ జిల్లా లోని మహాద్ అనే చిన్న పట్టణంలో కొన్ని వేల మంది సమక్షంలో ఈ దహన కార్యక్రమం జరిపారు. ఈ గ్రామం ముంబాయికి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశాడు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
రోజా సెల్వమణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించింది. రోజా నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికైంది.ఆమె 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
లండన్ విశ్వవిద్యాలయం 18 కళాశాలలు, 10 పరిశోధక సంస్థలు, అనేక కేంద్ర సంస్థలతో లండన్, ఇంగ్లాండ్లో ఉన్న కాలేజియేట్ పరిశోధనా విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 142,990 క్యాంపస్-ఆధారిత విద్యార్థులతో యునైటెడ్ కింగ్డమ్ లో పూర్తికాల విద్యార్థుల సంఖ్య ద్వారా రెండవ అతి పెద్ద విశ్వవిద్యాలయం, లండన్ ఇంటర్నేషనల్ కార్యక్రమాల విశ్వవిద్యాలయంలో 50,000 పైగా దూరవిద్య విద్యార్థులు. ఈ విశ్వవిద్యాలయం 1836 లో రాయల్ చార్టర్ ద్వారా ఏర్పాటు చేయబడింది.
కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికి సోమనాథుడిని ఆదికవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము
డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము (పూర్వం ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయముగా పిలవబడేది) ఆంధ్ర ప్రదేశ్లో 1982లో స్థాపించబడిన సార్వత్రిక విశ్వవిద్యాలయము. దూర విద్యావిధానాన్ని భారతదేశంలో మొదట ప్రవేశపెట్టిన ఘనత ఈ సంస్థదే. చదువుకోవాలనే కోరిక వుండి, ఏవైనా కారణాలవల్ల కళాశాలకు వెళ్లలేనివారికి ఉన్నత విద్యావకాశాలను అందించటానికి ఈ విశ్వవిద్యాలయము ప్రారంభించబడింది.
భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలు
భారతదేశంలో ఆదేశిక సూత్రాలు (ఆంగ్లం : Directive Principles of State Policy). భారతరాజ్యాంగం, పౌరులకు ప్రాథమిక హక్కులను ప్రకటించింది. మరి ప్రభుత్వాలకు ఏవైనా ఆదేశాలిచ్చిందా?
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
కె.జి.యఫ్ చాప్టర్ 2 విజయ్ కిరగందుర్ నిర్మాతగా, యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం. 2019 మార్చిలో షూటింగ్ ప్రారంమైంది. ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న కన్నడ తో పాటు హిందీ, మలయాళం, తమిళం, తెలుగు విడుదల కానుంది.కేజీఎఫ్-2 మూవీ తెలుగు వెర్షన్ ట్రైలర్ను రామ్ చరణ్ తన పుట్టినరోజైన 2022 మార్చి 27న సోషల్ మీడియాలో విడుదల చేసారు.
అరాజక, విప్లవ నేరాల చట్టం, 1919 లేదా ప్రముఖంగా రౌలట్ చట్టం ఢిల్లీలోని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 1919 మార్చి 18న చేసిన చట్టం. 20 వ శతాబ్దమునాటికి భారతీయులలో కలిగిన రాజకీయ పరిజ్ఞానము, స్వరాజ్యకాంక్షను అణచుటకు చేసిన అనేకమైన నిర్భందములు, నిర్ధేశములుకలిగియున్న అనేక చట్టములలో 1915 సంవత్సరపు డిఫెస్సు ఆఫ్ ఇండియా చట్టము ఒక నిర్ధిష్టమైన కఠోర క్రిమినల్ చట్టము. భారతదేశములో 1905 తరువాత ఉద్భవించిన విప్లవాత్మక స్వరాజ్య కాంక్షను ఉక్కుపాదముతో అణుచుటకు నిశ్చయించిన నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వము అరాజక విప్లవోద్యముతోకూడిన దారుణవాదమును నరికట్టుటకు మార్గములు సిఫారస్సు చెయమని ఆంగ్లన్యాయాధిపతి రౌలట్ (Justice S.A.T. Rowlatt) అధ్యక్షతన ఒక విచారణసంఘమును నియమించిరి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిపాలనకి ములస్తంభం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాబినెట్. జూన్ 8, 2014 న సంయుక్త రాష్ట్రల గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాబినెట్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 20 మంది మంత్రులు ప్రమాణం చేసారు.
1956లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి - కోస్తా, రాయలసీమ, తెలంగాణా - అన్ని ప్రాంతాల నాయకులూ ఇష్టపడ్డారు. అయితే తెలంగాణా నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అధిక రెవిన్యూ ఆదాయం గల తమ ప్రాంతం, అదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికి కలిగింది.
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత . అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు.
1947లో స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ సోవియట్ యూనియన్ (పూర్వపు రష్యా) ప్రభావానికి లోనై భవిష్యత్తు అభివృద్ధికి మనదేశంలో కూడా ప్రణాళికలు ఉండాలని తలచి ప్రణాళికా సంఘంను ఏర్పర్చి 1951-52 నుండి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాడు. ఈ విధంగా మనదేశంలో పంచవర్ష ప్రణాళికలకు జవహర్ లాల్ నెహ్రూను పితామహుడిగా పేర్కొనవచ్చు. పార్లమెంటులో ప్రణాళికల గురించి మాట్లాడుతూ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ, ఉత్పత్తి రంగాలను ప్రభుత్వపరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది.
ప్రధానమంత్రి ,భారత ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తాడు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, దేశ కార్యనిర్వాహక అధికారాలు ప్రధానమంత్రి, ఇంకా అతని మంత్రి మండలికి ఉంటాయి. దేశ పార్లమెంటు దిగువ సభ అయిన లోకసభ సభ్యులచే ఎన్నుకోబడ్డ నాయకుడు రాష్ట్రపతిచే ప్రధానమంత్రిగా నియమించబడతాడు.
భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు
భారతదేశంలో ప్రాథమిక విధులు (ఆంగ్లం : Fundamental Duties) 1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి. 2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడింది.