The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
కె.జి.యఫ్ చాప్టర్ 2 విజయ్ కిరగందుర్ నిర్మాతగా, యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం. 2019 మార్చిలో షూటింగ్ ప్రారంమైంది. ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న కన్నడ తో పాటు హిందీ, మలయాళం, తమిళం, తెలుగు విడుదల కానుంది.కేజీఎఫ్-2 మూవీ తెలుగు వెర్షన్ ట్రైలర్ను రామ్ చరణ్ తన పుట్టినరోజైన 2022 మార్చి 27న సోషల్ మీడియాలో విడుదల చేసారు.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్ (1966 - 2012) బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే అస్తమించాడు.
సోమాలియా; (ఆంగ్లం: Somalia) (సోమాలియా భాష : సూమాలియా) ; (అరబ్బీ الصومال ; అస్-సూమాల్), ఆధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ సోమాలియా" (అల్ జమ్హూరియా అస్-సూమాల్ - جمهورية الصومال ). ఇది ఆఫ్రికా ఖండంలో ఈశాన్య దిశలో(హార్ను ఆఫ్ ఆఫ్రికా) ఉంది. దీనికి వాయవ్యసరిహద్దులో జిబౌటి, నైరుతిసరిహద్దులో కెన్యా, ఉత్తరసరిహద్దులో "అడెను అఖాతము", యెమన్, తూర్పుసరిహద్దులో గుయార్డఫీ కాలువ - సొమాలీ సముద్రం, పశ్చిమసరిహద్దులో ఇథియోపియాలు ఉన్నాయి.
' వెనుజులా Venezuela (/ˌvɛnəˈzweɪlə/ VEN-ə-ZWAYL-ə; Spanish pronunciation: [beneˈswela]) దక్షిణ అమెరికా లోని ఒక సుసంపన్న దేశము. అధికారికంగా " బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజులా " అంటారు.ఫెడరల్ రిపబ్లిక్ అయిన ఇది దక్షిణ అమెరికా ఉత్తర సముద్రతీరంలో ఉంది.దేశానికి పశ్చిమ సరిహద్దులో కొలంబియా, దక్షిణ సరిహద్దులో బ్రెజిల్, తూర్పు సరిహద్దులో గయానా, ఈశాన్య సరిహద్దులో " ట్రినిడాడ్ , టొబాగో " ద్వీపం ఉన్నాయి.దేశ వైశాల్యం 916,445 km2 (353,841 sq mi) జనసంఖ్య 3,17,75,371. దేశం అత్యంత అధికమైన జీవ వైవిధ్యం కలిగి ఉంది.
మాల్టా (Listeni / mɒltə / మూస: IPA-mt)అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ మాల్టా (మాల్టీస్: రిపబ్లికా టాటా మాల్టా) గా పిలువబడుతుంది. ఇది మధ్యధరా సముద్రంలో ద్వీపసమూహం కలిగి ఉన్న దక్షిణ ఐరోపా ద్వీపం దేశాలలో ఒకటి. (Maltese: [Repubblika ta' Malta] Error: {{Lang}}: text has italic markup (help)), ఇది ఇటలీకి 80 కిమీ (50 మైళ్ళు), ట్యునీషియాకు 284 కిమీ (176 మైళ్ళు) తూర్పు , లిబియాకు ఉత్తరాన 333 కి.మీ (207 మైళ్ళు) దూరంలో ఉంది.
రష్యన్ ఫెడరేషన్ లేదా రష్యా అనే దేశం, ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెట్టింపు పెద్ద దేశం. జనాభా విషయములో చైనా, భారత దేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల తరువాత రష్యా ఎనిమిదవ స్థానములో ఉంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
ఐస్లాండ్ (ఆంగ్లం : The Republic of Iceland) అధికారిక నామం ది రిపబ్లిక్ ఆఫ్ ఐస్లాండ్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో గల ఒక ద్వీప దేశం.దేశం ఆగ్నేయప్రాంతంలో మూడింట రెండు వంతుల ప్రజలు నివసిస్తున్నారు.ఐరోపాలో జనసాధ్రత తక్కువగా ఉన్న దేశంగా గుర్తించబడుతుంది. భౌగోళికంగా ఐస్లాండ్ అగ్నిపర్వతాలు చురుకుగా ఉన్నాయి.లోతట్టు మైదానప్రాంతంలో ఇసుక భూములు, లావా ప్రాంతాలు ఉన్నాయి.ఈ దేశం ఐరోపా ఖండంలోని ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో 1,03,000 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఒక చిన్న ద్వీపం. ఇప్పుడు (2009) దీని జనాభా 3,20,000 మంది.
ట్యునీషియా (ఆంగ్లం :Tunisia) (అరబ్బీ : تونس టూనిస్), అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ట్యునీషియా (అరబ్బీ : الجمهورية التونسية, అల్-జమ్హూరియా అత్-తూనీసియ్యా), ఉత్తర ఆఫ్రికా లోని మెఘర్బు ప్రాంతంలో ఉన్న ఒక దేశం. ట్యునీషియా వైశాల్యం 1,63,610 చ.కి.మీ. దేశ ఉత్తరాంత ప్రాంతం అయిన " కేప్ అంగేలా " ఆఫ్రికాఖండం ఉత్తరాంత ప్రాంతంగా ఉంది.
ఒక గ్రహంపై ఉన్న వాతావరణం వెలువరచే రేడియేషన్ కారణంగా గ్రహ ఉపరితలంపై పెరిగే ఉష్ణోగ్రత, ఈ వాతావరణం లేనప్పుడు పెరిగే ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే దాన్ని గ్రీన్హౌస్ ప్రభావం అంటారు. గ్రహపు వాతావరణంలో రేడియేటివ్గా క్రియాశీలంగా ఉండే వాయువులు (అనగా గ్రీన్హౌస్ వాయువులు ) అన్ని దిశలలోనూ శక్తిని ప్రసరిస్తాయి. ఈ రేడియేషన్లో కొంత భాగం గ్రహ ఉపరితలం పైకి వచ్చి, దాన్ని వేడెక్కిస్తుంది.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.
సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా (Death Sentenced Disease) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చే ఋగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం, హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక, నియంత్రించటానికి (Chronic and Manageable Disease) వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు.
తాంతియా తోపే, తాత్యా తోపే (ఉచ్చారణ) (16 ఫిబ్రవరి 1814-18 ఏప్రిల్ 1859) అసలు పేరు రామచంద్ర పాండిరంగ తోపే. అతను స్వాతంత్ర్య సమర యోధుడు.రామచంద్ర పాండిరంగ యావల్కర్గా మరాఠీ దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో నాసిక్ సమీపంలోని యోలా పట్టణంలో జన్మించాడు. అతను పాండురంగరావు తోపే, రుఖ్మాబాయి దంపతులకు ఏకైక కుమారుడు.అతను తన మారుపేరు తాత్యా తోపే ద్వారా బాగా ప్రసిద్ది చెందాడు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికి సోమనాథుడిని ఆదికవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశాడు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు.
ప్రధానమంత్రి ,భారత ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తాడు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, దేశ కార్యనిర్వాహక అధికారాలు ప్రధానమంత్రి, ఇంకా అతని మంత్రి మండలికి ఉంటాయి. దేశ పార్లమెంటు దిగువ సభ అయిన లోకసభ సభ్యులచే ఎన్నుకోబడ్డ నాయకుడు రాష్ట్రపతిచే ప్రధానమంత్రిగా నియమించబడతాడు.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం
అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం) (ఆంగ్లం: World Heritage Day) ప్రతి ఏట ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలు వారసత్వ సంపద పరిరక్షణకోసం ఒకరికొకరు వివిధ అంశాలలో పరస్పరం సహకరించుకోవాలన్న ప్రధానలక్ష్యంతో ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏర్పాటుచేయబడింది.
గ్లోబల్ వార్మింగ్ (global warming; "భూగోళ/ప్రపంచ కవోష్ణత") అంటే భూమి ఉష్ణోగ్రతలో దీర్ఘకాలికంగా జరిగే పెరుగుదల. శీతోష్ణస్థితి మార్పు (climate change; క్త్లెమేట్ చేంజ్) లో ఇది ప్రధాన అంశం. ప్రత్యక్షంగా ఉష్ణోగ్రతలు కొలవడం ద్వారా, భూమి వేడెక్కడం వల్ల కలిగే వివిధ ప్రభావాలను కొలవడం ద్వారా దీన్ని నిరూపించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
జపాన్ ( జపాన్ భాషలో నిప్పన్ లేదా నిహన్ 日本国 నిప్పన్-కోక్ )అనేది తూర్పు ఆసియా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది చైనా, కొరియా, రష్యా దేశాలకు తూర్పు దిశగా ఉంది. జపాన్ దేశపు ఉత్తరాన ఉన్న సముద్ర భాగాన్ని ఓఖోట్స్క్ సముద్రం అని, దక్షిణాన్న ఉన్న సముద్ర భాగాన్ని తూర్పు చైనా సముద్రం అనీ అంటారు.