The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఈద్ ముబారక్ - Eid Mubarak ( Bengali: ঈদ মুবারক, అరబ్బీ: عيد مبارك, పర్షియన్ / ఉర్దూ: عید مُبارک, హిందీ: ईद मुबारक, మళయాళం|ഈദ് മുബാറക്) ముస్లింల సాంప్రదాయంలో ఈద్ వేళల్లో ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలుపుకునే రీతి లేదా రివాజు. ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అజ్ హా, మీలాదె నబి లేదా ఇతర పర్వదినాలకునూ ఉపయోగిస్తారు. "ఈద్" అనగా పండుగ లేదా పర్వం, "ముబారక్" అనగా ఆశీర్వదింపబడిన, శుభీకరింపబడిన, క్లుప్తంగా, "పండుగ-శుభాకాంక్షలు".
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
ఈద్-ఉల్-ఫితర్ (అరబ్బీ: عيد الفطر) అన్నది ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది ముస్లింలు పవిత్ర ఉపవాసాలతో గడిపే రంజాన్ నెలకు ముగింపు రోజు.ఈ మతపరమైన పండుగ ముస్లింలు ఉపవాసం ఉండడానికి వీల్లేని షవ్వల్ మాసంలో మొదటి రోజు, అంతేకాక ఏకైక రోజు కూడా. 29 లేక 30 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసాలతో గడిపే రంజాన్ నెల ముగింపుగా దీన్ని జరుపుకుంటారు.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికి సోమనాథుడిని ఆదికవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం అనే గ్రామంలో విశాఖపట్టణానికి నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు.
సత్యజిత్ రాయ్ (మే 2 1921–ఏప్రిల్ 23 1992) భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన సినీ దర్శకుడు, రచయిత. ఆతను ప్రపంచ సినిమాలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరు గడించాడు. కలకత్తాలో బెంగాలీ కళాకారుల కుటుంబములో జన్మించిన సత్యజిత్ రాయ్ కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ లోని విశ్వభారతి విద్యాలయము లోనూ చదివాడు.
మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము, అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. ఈ కావ్యం రచనా కాలం 1519-20 ప్రాంతం కావచ్చునని, అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయంలో "మనుచరిత్రము శాంత శృంగార రసములు సమ ప్రాధాన్యముతో సంగమించిన యొక తీర్థము.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
ప్రశాంత్ కిశోర్ (జననం:1977) భారతీయ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త. జనతాదళ్ (యునైటెడ్) కు చెందిన ప్రశాంత్ కిషోర్‌ను పౌరసత్వ సవరణ చట్టం (2019) పై, పార్టీ అధిపతి అయిన నితీష్ కుమార్ అవలంబించిన అనుకూల వైఖరిని విమర్శించినందుకు గాను ఆయనను 2020 జనవరి 29న పార్టీ నుండి బహిష్కరించారు. ప్రారంభంలో ప్రజారోగ్యంలో శిక్షణ పొందిన కిషోర్, భారత రాజకీయాల్లోకి రాకముందు ఐదేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో పనిచేశాడు.
గోళం అనగా త్రిమితీయ ప్రదేశంలో సంపూర్ణ గుండ్రని జ్యామితీయ వస్తువు, ఇది పూర్తి గుండ్రని బంతి యొక్క ఉపరితలం, (అంటే., రెండు కోణాల్లో ఒక వృత్తాకార వస్తువుకు సమానమైనది). వృత్తం వంటిది జ్యామితీయంగా ద్విమితీయ వస్తువు, గోళము అనేది గణితశాస్త్రపరంగా బిందువుల యొక్క సమితిగా నిర్వచించబడింది అవి ఇవ్వబడిన బిందువు నుండి అన్ని అంతే r దూరం ఉంటాయి, కాని త్రిమితీయ ప్రదేశంలో ఉంటాయి. ఈ r దూరం అనేది బంతి యొక్క వ్యాసార్థం, ఇచ్చిన పాయింట్ గణితపరమైన బంతి యొక్క కేంద్రం.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
మానవ పరిణామం అనేది శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల ఆవిర్భావానికి దారితీసిన పరిణామ ప్రక్రియ. ఇది ప్రైమేట్స్ పరిణామ చరిత్రతో, ప్రత్యేకించి హోమో జాతి పరిణామ చరిత్రతో మొదలై, హోమినిడ్ కుటుంబం లోనే గొప్ప జాతిగా హోమో సేపియన్స్ జాతి ఆవిర్భవించడానికి దారితీసింది. రెండు కాళ్ళపై నడక, భాష వంటి లక్షణాల అభివృద్ధి ఈ ప్రక్రియలో భాగం వీటితో పాటు, ఇతర హోమినిన్లతో జాత్యంతర సంతానోత్పత్తి వంటివి కూడా ఈ పరిణామ ప్రక్రియలో భాగమవడాన్ని బట్టి, మానవ పరిణామం సూటిగా ఒక సరళరేఖలో సాగినది కాదని, అదొక సాలె గూడు లాగా విస్తరించిందనీ తెలుస్తోంది.భూమి ప్రత్యేక గోళంగా ఏర్పడి సుమారు నాలుగు వందల ఏభై కోట్ల సంవత్సరాలయితే ఆ తరువాత మరో ఇరవై కోట్ల సంవత్సరాలకు సముద్రాలలో సేంద్రియ రసాయనిక పదార్థాల కలయిక వల్ల జీవం ఏర్పడింది.
ఎత్తైన దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ, చరిత్రలో శాతవాహన (230 BCE నుండి 220 CE వరకు), కాకతీయ (1083-1323), ముసునూరి నాయకుల (1326-1356), ఢిల్లీ సుల్తానేట్ బహమనీ సుల్తానేట్ (1347-1512), గోల్కొండ సుల్తానేట్ (1512-1687), అసఫ్ జాహీ రాజవంశం (1724-1950) మొదలైన రాజవంశీయుల పాలనలో ఉంది.1724లో ముబారిజ్ ఖాన్‌ను ఓడించిన నిజాం-ఉల్-ముల్క్, హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత అతని వారసులు హైదరాబాదు నిజాములుగా చాలాకాలంపాటు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు. నిజాం రాజులు తెలంగాణలో మొదటి రైల్వేలు, పోస్టల్, టెలిగ్రాఫ్ నెట్‌వర్క్‌లు, మొదటి విశ్వవిద్యాలయాలను స్థాపించారు.
సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా (Death Sentenced Disease) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చే ఋగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం, హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక, నియంత్రించటానికి (Chronic and Manageable Disease) వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు.
పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి , మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
పచ్చకామెర్లు, (జాండీస్) రక్తంలో బిలిరుబిన్ యొక్క స్థాయి హెచ్చినప్పుడు (హైపర్ బిలిరుబినీమియా) చర్మము, కనుగుడ్లు, మ్యూకస్ మెంబ్రేనులు పసుపు పచ్చ రంగుతేలడాన్ని పచ్చకామెర్లు అంటారు.ఈ పరిస్థితి వలన అన్ని శరీరద్రవాలలో బిలిరుబిన్ పెరుగుతుంది. సాధారణంగా, ఈ లక్షణాలు కంటికి స్పష్టంగా కనిపించాలంటే ప్లాస్మాలోని బిలిరుబిన్ యొక్క గాఢత సాధారణ విలువ అయిన 0.5 మి.గ్రా/డె.లీ కంటే మూడు రెట్లకు (1.5 మి.గ్రా/డె.లీ) పైగా పెరగాలి. జాండీస్ అన్న పదము ఫ్రెంచి భాషా పదమైన jaune (పసుపుపచ్చ) నుండి పుట్టింది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
వస్తు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ - జీఎస్టీ) అన్నది భారతదేశంలో అనేక విడివిడి పన్నులను ఒకే పన్నులో విలీనం చేసేలా రాబోతున్న పన్నుల వ్యవస్థ. దాన్ని 122వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ (నూట ఒకటవ సవరణ) చట్టం 2016గా ప్రవేశపెట్టారు. జీఎస్టీ కౌన్సిల్, దాని ఛైర్మన్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వస్తు సేవల పన్నును పరిపాలిస్తారు.