The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
హిందూ సామ్రాజ్య దినోత్సవం, ప్రతి సంవత్సరం ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా జరుపుకుంటారు.ఛత్రపతి శివాజీహిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన వీరుడు.1674 జూన్ 6న (జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి) రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి' అని బిరుదును ప్రదానం చేసారు.శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ, జిజాభాయి దంపతులకు జన్మించాడు.
కేంద్రపాలిత ప్రాంతం అనగా భారతదేశం లోని పరిపాలన ప్రాంతాలలో ఒక ప్రధాన విభాగం. రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలుండగా, కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తిగా గాని, పాక్షికంగా కాని భారత ప్రభుత్వంచే పరిపాలించబడతాయి. విభిన్న చరిత్ర, సాంస్కృతిక వారసత్వం గల కొన్ని ప్రాంతాలను, భౌగోళికంగా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న ప్రదేశాలను, అంతర్ రాష్ట్ర వివాదాల వలన కేంద్ర ప్రభుత్వంచే పాలించాల్సివచ్చిన ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పరిచారు.
మానవ పాపిల్లోమా వైరస్ (Human Papilloma Virus-HPV) మానవుల చర్మం, శ్లేష్మ పొరలకు సంక్రమించే పాపిల్లోమా వైరస్ (papillomavirus) వీటిలో సుమారు 130 HPV రకాలు ఉన్నాయి. కొన్ని వైరస్ రకాలు ఉలిపిరి కాయలు (warts లేదా verrucae) కలిగిస్తే మరికొన్ని కాన్సర్ (cancer) వ్యాధిని కలిగిస్తాయి.అధికంగా (HPV) అంటురోగాలకు లక్షణాలు ఏమి ఉండవు .మానవ పాపిల్లోమా వైరస్(Human Papilloma Virus-HPV),మానవ పాపిలోమా వంశానికి చెందిన డిఎన్ఏ విషక్రిమి(DNA virus ), వల్ల మానవ పాపిల్లోమా అంటువ్యాధి వస్తుంది .చిన్న వయస్సులో లింగసాంగత్యం,పొగతాగటం,అనేక భాగస్వాములు కలిగివుడటం,రోగనిరోధక శక్తి పనితీరు తగ్గిపోవడం దీని లక్షణాలు.అప్పుడప్పుడు గర్భధారణ సమయంలో,HPV తల్లి నుంచి పిల్లలికి రావచ్చు.HPV లింగసాంగత్యం జరిగినప్పుడు జననమండలం (reproductive system) వద్ద చర్మా తాకిడి వాళ్ళ వ్యాపిస్తుంది.ఇది సహజాంగా అంటే మరుగుదొడ్లు,ఇతర తాకిడి వల్ల వ్యాపించదు.ఒక వ్యక్తిక ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల HPV కి గురికావచ్చు.HPV మనుషులకు మాత్రమే వస్తుంది.HPV టీకాలు అత్యంత సాధారణ రకాలైన సంక్రమణను నివారించవచ్చు.ప్రభావవంతంగా ఉండటం కోసం,సంక్రమణ వచ్చే ముందు వాడాలి,అందుకు తొమ్మిది, 13 ఏళ్ళ మధ్యలో సిఫారసు చేయబడాలి.పాపనికోలౌ పరీక్ష (పాప్) లేదా ఎసిటిక్ యాసిడ్‌ను ఉపయోగించి గర్భాశయ చిత్రీకరణని చూడటం వంటి గర్భాశయ క్యాన్సర్ చిత్రీకరణ పద్ధతి,ప్రారంభ క్యాన్సర్ లేదా అసాధారణ కణాలను గుర్తించవచ్చు.ఇది మెరుగైన ప్రారంభ చికిత్సకి అనుమతిస్తుంది.చిత్రీకరణ అభివృద్ధి చెందిన ప్రపంచంలో గర్భాశయ క్యాన్సర్ వళ్ళ వచ్చే మరణాల సంఖ్యను తగ్గింది.గడ్డకట్టడం ద్వారా పులిపెరలు తొలగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా లైంగిక సంక్రమణ వల్ల HPV వ్యాపిస్తుంది.పంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ నుంచి 528,000 కొత్త కేసులు, 266,000 మరణాలు సంభవించాయి.2012 లో,సుమారు 85% అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో సంభవించాయి.యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా లో,ప్రతి సంవత్సరం HPV కారణంగా 27,000 క్యాన్సర్ కేసులు సంభవించాయి .లైంగికంగా చురుకైన యుక్తవయస్సు వాళ్ళల్లో 1% మంది జన్యు(జననేంద్రియ) మొటిమలను కలిగి వున్నారు.పురాతన గ్రీసు కాలం నుంచి మొటిమలను కేసులు వర్ణించగా,వాటి వైరల్ (వైరస్ కు సంబంధించిన )స్వభావం 1907 వరకు కనుక్కోలేదు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
మిట్టగూడెం గ్రామంలో జాతిఐ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులకు సంబంధించిన బోర్డు]]జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికి సోమనాథుడిని ఆదికవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి , మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏటా జూన్ 12న నిర్వహించబడుతుంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తాధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.
రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం (Second World War) అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు.
భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలు
భారతదేశంలో ఆదేశిక సూత్రాలు (ఆంగ్లం : Directive Principles of State Policy). భారతరాజ్యాంగం, పౌరులకు ప్రాథమిక హక్కులను ప్రకటించింది. మరి ప్రభుత్వాలకు ఏవైనా ఆదేశాలిచ్చిందా?
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత . అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు.