The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
గిరిజనులు లేక ఆదివాసీలు: భిన్న జాతుల సమాహారమైన భారత ఉపఖండంలో అనేక గిరిజన సముదాయాలు నివసిస్తున్నాయి. ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, సామాజిక విలువలను కలిగి ఉంటారు. ఆదివాసీలు నివసించే ముఖ్య రాష్ట్రాలు :ఒడిషా, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరం, అండమాన్ నికోబార్ దీవులు.
విరాట పర్వం, 2022లో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబు నిర్మించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించగా నక్సలిజం నేపధ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022, జూన్ 17న విడుదలైంది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
మిట్టగూడెం గ్రామంలో జాతిఐ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులకు సంబంధించిన బోర్డు]]జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
సాధారణంగా గ్రామాల్లో రైతులు పశువుల పేడను, వ్యవసాయ వ్యర్ధ పదార్ధాలను కుప్పలుగా వేస్తారు. ఇట్లు చేయుట వల్లన అవి ఎండకు ఎండి, వానకు తడిసి సహజ పోషకాలను చాలావరకు కోల్పోతాయి. రైతులు కొంత శ్రమపడి సేంద్రీయ పదార్ధాలను సేకరించి ఒక గుంటలో వేసి కుళ్ళటానికి తగిన పరిస్ధితులు కల్పిస్తే అవి త్వరగా కుళ్ళి మంచి ఎరువుగా తయారవుతుంది.
భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు
భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల జాబితా ఇది. భారతదేశం 28రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడి ఉంది. రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలు ఉండగా కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వమే పాలిస్తుంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
తెలంగాణ పల్లె ప్రగతి పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలో సమీకృత గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గతంలో అమలైన తెలంగాణ రూరల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగాం (టీఆర్ఐజీపీ) కి ‘తెలంగాణ పల్లె ప్రగతి పథకం’గా నామకరణం చేసి, ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే ఈ పథకంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు.
తిరుమల రామచంద్ర సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త. తిరుమల రామచంద్ర మాతృభాష తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృతం, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త. రకరకాల వృత్తులు చేసి, వివిధ అనుభవాలు సంపాదించి విస్తృత లోకానుభవశాలి ఐన రామచంద్ర తనను తాను వినమ్రంగా భాషాసేవకుడు అని అభివర్ణించుకునేవారు.
భారత రక్షణ వ్యవస్థలో ఒకటయిన భారత సైనిక దళం (ఇండియన్ ఆర్మీ) ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ దేశ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం, అనగా ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది.
1947లో స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ సోవియట్ యూనియన్ (పూర్వపు రష్యా) ప్రభావానికి లోనై భవిష్యత్తు అభివృద్ధికి మనదేశంలో కూడా ప్రణాళికలు ఉండాలని తలచి ప్రణాళికా సంఘంను ఏర్పర్చి 1951-52 నుండి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాడు. ఈ విధంగా మనదేశంలో పంచవర్ష ప్రణాళికలకు జవహర్ లాల్ నెహ్రూను పితామహుడిగా పేర్కొనవచ్చు. పార్లమెంటులో ప్రణాళికల గురించి మాట్లాడుతూ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ, ఉత్పత్తి రంగాలను ప్రభుత్వపరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది.
20వ శతాబ్దం పూర్వభాగంలో పల్లెల్లో తెలుగు ప్రజల జీవనవిధానం
భారత దేశ జనాభాలో ఎనబై శాతం వ్యవసాయ దారులే. వీరిలో వ్యవసాయదారులు, వ్యవసాయ సంబంధిత పనులలో పనిచేసే వారు ఉన్నారు. సాంప్రదాయ వ్యవసాయం రాను రాను యాంత్రీకరణం వైపు పరుగిడుతున్నది.
ప్రజల ఉపయోగార్థం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశాన్ని గ్రంథాలయం అని అంటారు. తెలుగులో గ్రంథాలయాల కొరకు అయ్యంకి వెంకట రమణయ్య ఉద్యమం నడిపి, దానిని వ్యాప్తి చేసి, గ్రంథాలయ పితామహుడుగా అనే పేరు పొందాడు. అతని తదనంతరం ఉద్యమాన్ని ఉధృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.
భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు
భారతదేశంలో ప్రాథమిక విధులు (ఆంగ్లం : Fundamental Duties) 1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి. 2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడింది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
అంతర్జాతీయ పితృ దినోత్సవము (ఆంగ్లం: Father's Day) ను ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది.
పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం.
కేంద్రపాలిత ప్రాంతం అనగా భారతదేశం లోని పరిపాలన ప్రాంతాలలో ఒక ప్రధాన విభాగం. రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలుండగా, కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తిగా గాని, పాక్షికంగా కాని భారత ప్రభుత్వంచే పరిపాలించబడతాయి. విభిన్న చరిత్ర, సాంస్కృతిక వారసత్వం గల కొన్ని ప్రాంతాలను, భౌగోళికంగా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న ప్రదేశాలను, అంతర్ రాష్ట్ర వివాదాల వలన కేంద్ర ప్రభుత్వంచే పాలించాల్సివచ్చిన ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పరిచారు.
సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను
సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను,భారత దేశములోని తెలంగాణ రాష్ట్రములోని హైదరాబాదు లోగల ప్రధాన రైల్వే స్టేషను. ఇది భారతీయ రైల్వేల లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి కింద వస్తుంది. 1874 సం.లో హైదరాబాదు రాష్ట్రం యొక్క నిజాం, బ్రిటిష్ కాలంలో నిర్మించిన, ఈ స్టేషన్ 1916 సం.లో కాచిగూడ రైల్వే స్టేషను ప్రారంభమయ్యే వఱకు., నిజాం రైల్వే యొక్క ప్రధాన రైల్వే స్టేషనుగా ఉంది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
కొన్ని సహస్రాబ్దులుగా భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది. ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ సభాపతి, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కోల్‌కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికి సోమనాథుడిని ఆదికవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
ఎత్తైన దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ, చరిత్రలో శాతవాహన (230 BCE నుండి 220 CE వరకు), కాకతీయ (1083-1323), ముసునూరి నాయకుల (1326-1356), ఢిల్లీ సుల్తానేట్ బహమనీ సుల్తానేట్ (1347-1512), గోల్కొండ సుల్తానేట్ (1512-1687), అసఫ్ జాహీ రాజవంశం (1724-1950) మొదలైన రాజవంశీయుల పాలనలో ఉంది.1724లో ముబారిజ్ ఖాన్‌ను ఓడించిన నిజాం-ఉల్-ముల్క్, హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత అతని వారసులు హైదరాబాదు నిజాములుగా చాలాకాలంపాటు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు. నిజాం రాజులు తెలంగాణలో మొదటి రైల్వేలు, పోస్టల్, టెలిగ్రాఫ్ నెట్‌వర్క్‌లు, మొదటి విశ్వవిద్యాలయాలను స్థాపించారు.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి , మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా (Death Sentenced Disease) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చే ఋగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమేహం, హైపర్ టెన్షన్ (రక్తపోటు)లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక, నియంత్రించటానికి (Chronic and Manageable Disease) వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు.
భారత ఆర్ధిక వ్యవస్థ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ (PPP-పిపిపి) లెక్కల బట్టి 3.36 ట్రిలియన్ డాలర్ల GDP (జిడిపి అనగా ఆదాయం) తో ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంది. డాలర్ మారక ద్రవ్య విలువల బట్టి చూసినా, భారత్ 691.87 బిలియన్ డాలర్ల GDP తో ప్రపంచంలో పదవ స్థానంలో ఉంది. 2005 మొదటి త్రైమాసికం నాటికి భారత్ 8.1 శాతం పెరుగుదలతో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది.
"ఆవర్తన పట్టిక" అనునది రసాయన మూలకాలను వాటి పరమాణు సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసముల ఆవర్తన రసాయన ధర్మముల ఆధారంగా యేర్పాటు చేయబడిన ఒక అమరిక. ఈ పట్టికలో మూలకాలు వాటి పరమాణు సంఖ్య ఆరోహణ క్రమంలో అమర్చబడినవి. ఈ పట్టికలో ప్రామాణీకరించబడిన ప్రకారం 18 నిలువు వరుసలు, 7 అడ్డు వరుసలు గానూ, పట్టిక క్రింది భాగంలో రెండు ప్రత్యేక వరుసలు అమర్చబడినవి.