The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి (1608-1693), భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ, ప్రాచీన నాగరికత, సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పినవారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయమున్న పేరు మాత్రం నోస్ట్రడామస్.
విరాట పర్వం, 2022లో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబు నిర్మించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించగా నక్సలిజం నేపధ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022, జూన్ 17న విడుదలైంది.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి (వీరప్పయాచార్యులు) ( సా.శ.1608- సా.శ.1693) సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి మరియు వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు . వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి కాలజ్ఞానం రచించి సా.శ. 1693లో సజీవ సమాధి నిష్ఠనొందినారు.
హాలుడు ప్రాచీన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన శాతవాహన వంశానికి చెందిన రాజు. మత్స్యపురాణం ఆయనను శాతవాహనుల వంశంలో ఆయన 17వ రాజుగా పేర్కొంది.హాలుడు అశ్మక రాజ్యంలోని ప్రతిష్ఠానమును పరిపాలిస్తూ ఉండినాడని ప్రాకృతంలో రచింపబడిన లీలావతి కావ్యం చెబుతుంది. పరిపాలించినది ఆరేళ్ళే అయినప్పటికీ, శాతవాహన వంశపు రాజులందరిలోకీ హాలుడు జగత్ప్రసిధ్ధుడు కావడానికి కారణం ఆ మహారాజు సంకలనం చేసి ప్రపంచానికి అందించిన గాథా సప్తశతి అనే గ్రంథం.
సామాజిక శాస్త్రంలోనూ, జీవ శాస్త్రంలోనూ జనాభా (population) అన్న పదాన్ని ఒక జాతికి (species) చెందిన జీవుల సంఖ్యను చెప్పడానికి వాడుతారు. పాపులేషన్ అన్న పదాన్ని గణాంక శాస్త్రంలోనూ, ఇతర విజ్ఞానశాస్త్రాలలోనూ 'సముదాయం' అన్న అర్థంలో కూడా వాడుతారు. ఈ వ్యాసంలో మానవజాతి జనసంఖ్య అన్న అర్థంలో జనాభా అన్న పదం వాడబడింది.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబర్ 10, 1895 - అక్టోబరు 18, 1976 20వ శతాబ్దపు తెలుగు రచయిత."కవి సమ్రాట్" బిరుదాంకితుడు. ఆయన రచనలలో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు మరియు ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషాశాస్త్రం, మనస్తత్వశాస్త్రం మరియు స్పృహ అధ్యయనాలు, జ్ఞాన శాస్త్రం, సౌందర్యం మరియు ఆధ్యాత్మికత వంటి అనేక రకాల విషయాలను కవర్ చేస్తుంది.
1947లో స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ సోవియట్ యూనియన్ (పూర్వపు రష్యా) ప్రభావానికి లోనై భవిష్యత్తు అభివృద్ధికి మనదేశంలో కూడా ప్రణాళికలు ఉండాలని తలచి ప్రణాళికా సంఘంను ఏర్పర్చి 1951-52 నుండి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాడు. ఈ విధంగా మనదేశంలో పంచవర్ష ప్రణాళికలకు జవహర్ లాల్ నెహ్రూను పితామహుడిగా పేర్కొనవచ్చు. పార్లమెంటులో ప్రణాళికల గురించి మాట్లాడుతూ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ, ఉత్పత్తి రంగాలను ప్రభుత్వపరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికి సోమనాథుడిని ఆదికవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
తెలంగాణా పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్ స్టేట్లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అఖిలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని రాజబహదూర్ గౌర్ ప్రకటించారు.ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు. ఫలితంగా ఆనాటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది.
'టంగుటూరి ప్రకాశం' పంతులు (ఆగష్టు 23, 1872 – మే 20, 1957) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
భారతదేశంలో విద్య ప్రధానంగా ప్రభుత్వం నడిపే విద్యావ్యవస్థచే నిర్వహించబడుతుంది, ఇవి కేంద్ర, రాష్ట్ర , స్థానిక అనే మూడు స్థాయిలలోని ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. భారత రాజ్యాంగంలోని వివిధ నిబంధనల క్రింద ఉచిత, నిర్బంధ విద్యకు పిల్లల హక్కు చట్టం, 2009 ప్రకారం, 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక హక్కుగా అందించబడుతుంది. భారతదేశంలోని ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలల నిష్పత్తి 7: 5.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
మిట్టగూడెం గ్రామంలో జాతిఐ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులకు సంబంధించిన బోర్డు]]జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది. చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.
భారత రక్షణ వ్యవస్థలో ఒకటయిన భారత సైనిక దళం (ఇండియన్ ఆర్మీ) ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ దేశ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం, అనగా ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది.