The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
తెలంగాణా పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అఖిలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని రాజబహదూర్ గౌర్ ప్రకటించారు.ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు. ఫలితంగా ఆనాటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది.
జాతీయ ఐక్యతా దినోత్సవంను, భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31న జరుపుకోవాలని భారత ప్రభుత్వం గుర్తించి 24-10-2014న ప్రకటించింది. గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్దం నరేంద్రమోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నర్మదా నదితీరంలో ప్రపంచంలోనే ఎతైన ఐక్యతా ప్రతిమ అనే లోహ విగ్రహాన్ని నిర్మించడానికి సిద్దమయ్యారు. ఈ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర, జిల్లా అన్ని స్థాయిల్లో కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని భారత హోంమంత్రి రాజ్ నాథ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
ఓజోన్ పొర ఓజోన్ కవచం భూమి యొక్క స్ట్రాటో ఆవరణలోని ఒక ప్రాంతం, ఇది సూర్యుని యొక్క అతినీలలోహిత వికిరణాన్ని గ్రహిస్తుంది. స్ట్రాటో ఆవరణలోని ఇతర వాయువులకు సంబంధించి ఇది ఇప్పటికీ చిన్నది అయినప్పటికీ, వాతావరణంలోని ఇతర భాగాలకు సంబంధించి ఓజోన్ (O3) అధిక సాంద్రతను కలిగి ఉంటుంది. ఓజోన్ పొరలో ఓజోన్ మిలియన్‌కు 10 భాగాల కన్నా తక్కువ ఉంటుంది, మొత్తం భూమి యొక్క వాతావరణంలో ఓజోన్ గా సాంద్రత సగటున మిలియన్‌కు 0.3 భాగాలు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు, అనేది రాచరిక వ్యవస్థ నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమం. సెప్టెంబరు 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటిస్తూ 2022 సెప్టెంబరు 16, 17, 18 తేదీలలో మూడురోజులపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలనూ, 2023 సెప్టెంబరు 16, 17, 18 తేదీలలో ముగింపు వేడుకలనూ ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
1946 1948ల మధ్య హైదరాబాదు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల ప్రజలు కలత చెందారు. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాము ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్ ముస్లిమీను, దాని సైనిక విభాగమైన రజాకార్లకు చెందిన ఖాసిం రజ్వి ద్వారా దీన్ని సాధించాలని నిజాము ప్రయత్నించాడు.
తా భూమి – జలము – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర –సూర్య – నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను.భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ భగవానుడు తనంత తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునకే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుజు, సహస్ర శిర్షుడు! సగుణ బ్రహ్మం, అంగుష్ట మాతృడు, జగద్రక్షకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన అనంతనామనులు – అనంతరూపములు కలిగినై.
అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం
అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం) ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది.
హైదరాబాద్ రాజ్యం (హైదరాబాద్, బేరార్) ఒకప్పటి భారత సామ్రాజ్యంలో నిజాముల ఆధ్వర్యంలో ఉన్న అతిపెద్ద రాచరిక రాష్ట్రం. మహారాష్ట్ర లోని ప్రస్తుత విదర్భ ప్రాంతమే బేరార్, ఇది 1903 లో సెంట్రల్ ప్రావిన్సెస్ లతో విలీనం చేయబడి, సెంట్రల్ ప్రావిన్సెస్, బేరార్ గా రూపొందింది. దక్షిణమధ్య భారత ఉపఖండంలో ఉన్న ఈ హైదరాబాద్ రాష్ట్రం 1724 నుండి 1948 వరకు వారసత్వ నైజాముల పాలనలో ఉండేది.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కోల్‌కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.
భారత రక్షణ వ్యవస్థలో ఒకటయిన భారత సైనిక దళం (ఇండియన్ ఆర్మీ) ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ దేశ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం, అనగా ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
'ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని , నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి.
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ భాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
తెలంగాణ అవతరణ దినోత్సవం అనేది తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ పండుగ. ఈ రోజున హైదరాబాదుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవతరణ ఉత్సవాలు జరుగుతాయి. మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందించడం జరుగుతుంది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
ఎత్తైన దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ, చరిత్రలో శాతవాహన (230 BCE నుండి 220 CE వరకు), కాకతీయ (1083-1323), ముసునూరి నాయకుల (1326-1356), ఢిల్లీ సుల్తానేట్ బహమనీ సుల్తానేట్ (1347-1512), గోల్కొండ సుల్తానేట్ (1512-1687), అసఫ్ జాహీ రాజవంశం (1724-1950) మొదలైన రాజవంశీయుల పాలనలో ఉంది.1724లో ముబారిజ్ ఖాన్‌ను ఓడించిన నిజాం-ఉల్-ముల్క్, హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత అతని వారసులు హైదరాబాదు నిజాములుగా చాలాకాలంపాటు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు. నిజాం రాజులు తెలంగాణలో మొదటి రైల్వేలు, పోస్టల్, టెలిగ్రాఫ్ నెట్‌వర్క్‌లు, మొదటి విశ్వవిద్యాలయాలను స్థాపించారు.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశాడు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు.
కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.
సర్వ శిక్షా అభియాన్ అనేది 6–14 సంవత్సరాల మధ్య వయస్సున్న బాలలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను ఒక ప్రాథమిక హక్కుగా మార్చిన పథకం. ఇది భారత రాజ్యాంగంలో 86వ సవరణ ద్వారా ప్రాథమిక విద్య సార్వజనీకరణ సాధనకు అటల్ బీహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో భారతదేశ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. 2001లో లక్షిత బాలల సంఖ్య 205 మిలియన్ల వద్ద ఉన్నట్లు అంచనా.
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డిజి) అనేవి, 2030 నాటికి ప్రపంచంలోని బహుముఖ రంగాలలో పేదరికాన్ని రూపు మాపడానికి, సమస్త విశ్వ శ్రేయోసమృద్ధి కోసం ఒక సమానమైన, న్యాయమైన మరియు సురక్షితమైన ప్రపంచాన్ని రూపొందించడానికై తీసుకొన్న ఒక దృఢమైన, సార్వత్రిక ఒప్పందము. మన ప్రపంచమును రూపాంతరం చేయుటలో ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, 169 నిర్దేశిత లక్ష్యాలు ఒక భాగం. సుస్థిర అభివృద్ధి కొరకు 2030 ఎజెండా, 2015 సెప్టెంబరులో జరిగిన చారిత్రాత్మక ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమ్మేళనంలో 193 సభ్యరాజ్యాలచే స్వీకరించబడి, 2016, జనవరి 1 వ తేదీ నుండి అమలులోనికి వచ్చింది.ఆశాదాయకమైన ఈ ఎజెండా గురించి చర్చించి ఆచరించడానికై, జాతీయ ప్రభుత్వాలు, ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్ది పౌరులను ఒక చోట చేర్చి మునుపెన్నడూ జరగని రీతిలో నిర్వహించబడిన సంప్రదింపు ప్రక్రియల ద్వారా ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు రూపొందించబడ్డాయి.
వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవులలో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుడు స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి , మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా
బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ పాలన నుండి భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం పొందడానికి సమాజంలోని విస్తృత వర్గాలకు చెందిన వ్యక్తుల, సంస్థల ప్రయత్నాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో అనేక పద్ధతుల ద్వారా భారత స్వతంత్ర సంగ్రామంలో జరిగాయి.కొందరు తమ ప్రాణాలర్పించారు. మరి కొంతమంది పలుమార్లు జైలుపాలయ్యారు. ఇది ప్రత్యేకించి భారత ఉపఖండంలో వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు, సత్యాగ్రహాలు, నిరాహారదీక్షలు, సభలు, రచనలు ద్వారా రాజకీయ ప్రచారం చేసిన లేదా పరిగణించబడిన వ్యక్తుల జాబితా.