The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం (Second World War) అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
స్వామి వివేకానంద ప్రపంచ మతసమ్మేళన ప్రసంగం
స్వామి వివేకానంద భారతదేశానికీ, హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1893 సెప్టెంబరు 11న చికాగోలో మొదటి ప్రపంచ మత సమ్మేళనంలో చేసిన ప్రసంగం సుప్రసిద్ధమైనది. స్వామీ వివేకానంద 1893 ప్రపంచ మత సమ్మేళనానికి భారత దేశానికీ, హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించారు. 11 నుంచి 1893 సెప్టెంబరు 27లో నిర్వహించిన ఆ సమ్మేళనం మొదటి ప్రపంచ మత సమ్మేళనం.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
గ్లోబల్ వార్మింగ్ (global warming; "భూగోళ/ప్రపంచ కవోష్ణత") అంటే భూమి ఉష్ణోగ్రతలో దీర్ఘకాలికంగా జరిగే పెరుగుదల. శీతోష్ణస్థితి మార్పు (climate change; క్త్లెమేట్ చేంజ్) లో ఇది ప్రధాన అంశం. ప్రత్యక్షంగా ఉష్ణోగ్రతలు కొలవడం ద్వారా, భూమి వేడెక్కడం వల్ల కలిగే వివిధ ప్రభావాలను కొలవడం ద్వారా దీన్ని నిరూపించారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
హనీ రోజ్ వరగేసే భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో మలయాళంలో విడుదలైన 'బాయ్ ఫ్రెండ్' సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టి మలయాళంతో పాటు కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. హనీ రోజ్ తెలుగులో తొలిసారి ఆలయం, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో నటించి బాలకృష్ణ హీరోగా వస్తున్న ఆయన 107వ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.
హరిదాసు అనే పేరుతో మూడు వర్గాలలో ప్రసిద్దులు కలరు.నారదుడు మొదటి హరిదాసు అంటారు. హరిదాసు వేషధారణ చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిలకం దిద్దుతాడు. తెలుగు రాష్ట్రాలలో పండులప్పుడు ముఖ్యంగా సంక్రాంతికి వీరికి విశేష ప్రాముఖ్యత ఉన్నది, హిందువుల నమ్మకం ప్రకారం హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దివించెవారు హరిదాసులు .
సామాజిక శాస్త్రంలోనూ, జీవ శాస్త్రంలోనూ జనాభా (population) అన్న పదాన్ని ఒక జాతికి (species) చెందిన జీవుల సంఖ్యను చెప్పడానికి వాడుతారు. పాపులేషన్ అన్న పదాన్ని గణాంక శాస్త్రంలోనూ, ఇతర విజ్ఞానశాస్త్రాలలోనూ 'సముదాయం' అన్న అర్థంలో కూడా వాడుతారు. ఈ వ్యాసంలో మానవజాతి జనసంఖ్య అన్న అర్థంలో జనాభా అన్న పదం వాడబడింది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
డిస్నీ+ హాట్‌స్టార్ (దీనిని హాట్‌స్టార్ అని కూడా పిలుస్తారు) డిస్నీ స్టార్‌కి చెందిన నోవి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ యాజమాన్యంలోని సబ్స్క్రిప్షన్ వీడియో ఆన్-డిమాండ్ ఓవర్-ది-టాప్ స్ట్రీమింగ్ సర్వీస్. ఇది భారతీయ బ్రాండ్, డిస్నీ మీడియా, ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూషన్, రెండు విభాగాలచే నిర్వహించబడుతుంది.
రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక పక్షం వహించిన దేశాల కూటమిని అక్ష రాజ్యాలు (Axis powers, Axis alliance, Axis nations, Axis countries) అంటారు. వీరి కూటమి మిత్ర రాజ్యాల కూటమికి వ్యతిరేకంగా యుద్ధం సాగించింది. అక్షరాజ్యాల కూటమిలోని మూడు ప్రధాన దేశాలు - నాజీ నాయకుడు హిట్లర్ నాయకత్వంలో ఉన్న జర్మనీ, ఫాసిస్టు నాయకుడు ముస్సోలినీ నాయకత్వంలో ఉన్న ఇటలీ, జపాన్.
లాల్ బహాదుర్ శాస్త్రి ( వినండి ) (1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి , భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి , మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
విశ్వామిత్రుడు మేనక సంభోగం వల్ల జన్మించిన శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమములో పెరుగుచుండగా ఒకరోజు ఆ మార్గములో అప్పటి రాజు దుష్యంతుడు వెళ్తుండగా, దుష్యంతుడు శకుంతలని చూసి ఆకర్షితుడై ఆమెని గాంధర్వ వివాహం చేసుకొని ఆమెను రాజ్యానికి వెళ్ళి రాజ్యసంస్కారలతో ఆహ్వానిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో శకుంతల భరతుడిని ప్రసవిస్తుంది. కణ్వ మహర్షి దివ్య దృష్టితో జరిగింది గ్రహించి శకుంతలని దుష్యంతుడి రాజ్యానికి పంపుతాడు.
తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయమైన తిరుమల వెంకటేశ్వరుని ఆలయాన్ని నిర్వహించే ఒక స్వతంత్ర సంస్థ. ఇది దేవాలయం బాగోగులు చూడడమే కాక వివిధ సామాజిక, ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, విద్యా సంబందమైన కార్యక్రమాలను భారతదేశం నలువైపులా నిర్వహిస్తుంటుంది. 1933లో టీటీడీ పాలకమండలి ఏర్పాటైంది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ప్రభుత్వాధీనంలోని సంస్థ. సింగరేణి, పరిసర గోదావరీ లోయలో బొగ్గు గనుల త్రవ్వకాలు, పంపిణి మొదలైనవి దీని పని.