The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రములే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
{{Infobox person | name = ఉన్నవ లక్ష్మీనారాయణ | image = Telugunovelist unnavaLN.JPG | caption = మాలపల్లి నవలా రచయిత | birth_date = (1877-12-04)1877 డిసెంబరు 4 | birth_place = వేములూరుపాడు | death_date = 1958 సెప్టెంబరు 25(1958-09-25) (వయసు 80) | occupation = తెలుగు నవలాకారుడు | spouse = ఉన్నవ లక్ష్మీబాయమ్మ | children = | father = శ్రీరాములు | mother = శేషమ్ ఉన్నవ లక్ష్మీనారాయణ ( డిసెంబరు 4, 1877 - సెప్టెంబరు 25, 1958) గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది. ఆయన నవల మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పధంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. గుంటూరులో ఆయన స్థాపించిన శ్రీ శారదా నికేతన్ స్త్రీ విద్యను ప్రోత్సహించడంలో మంచి కృషి చేసింది.
జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట.ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి.
బ్రహ్మపుత్ర (Brahmaputra river) (అస్సామీ భాష: ব্ৰহ্মপুত্ৰ, బెంగాలీ భాష: ব্রহ্মপুত্র} హిందీ భాష: ब्रम्हपुत्र, టిబెటన్ భాషཡར་ཀླུངས་གཙང་པོ་ yar klung gtsang, Yarlung Tsangpo) ఆసియాలోని ముఖ్యమైన నదులలో ఒకటి. భారతదేశం, బంగ్లాదేశ్లలో నదులకు సహజంగా స్త్రీ నామం ఉండగా 'బ్రహ్మపుత్ర' పురుషనామంతో పిలువబడడం విశేషం. టిబెట్లో నైఋతిన యార్లుంగ్ (Imperial blood) నదిగా పుట్టి, దక్షిణ టిబెట్ లో దిహాంగ్ నదిగా పారి, హిమాలయాలలోని లోతైన లోయలలోకి పరుగులు తీస్తుంది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు.
ఖిలా వరంగల్, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, ఖిలా వరంగల్ మండలానికి చెందిన గ్రామం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని వరంగల్ మండలం లో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లాలో, కొత్తగా ఏర్పాటు చేసిన ఖిలా వరంగల్ మండలం లోకి చేర్చారు.
ద్రౌపది ముర్ము (జననం 20 జూన్ 1958) ఒక భారతీయ రాజకీయవేత్త, జార్ఖండ్ తొమ్మిదవ గవర్నర్, భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. జార్ఖండ్ 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుండి ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని (2015-2021) పూర్తి చేసిన జార్ఖండ్ మొదటి గవర్నర్. ఆమెను 2022లో NDA ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.ద్రౌపది ముర్ము 2022 జులై 25న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లోని పార్లమెంట్ సెంట్రల్ హాలులో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం భారత 15వ రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించాడు.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
ఏర్నెస్టో"చే" గువేరా (ఆంగ్లం: Che Guevara) (జూన్ 14, 1928 – అక్టోబరు 9, 1967) చే గువేరా , ఎల్ చే , చే అని పిలుస్తారు. ఈయన ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి. ఆయన మరణించిన తరువాత, అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవభావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది.యుక్తవయసులో మెడికల్ విద్యార్థిగా ఉన్న గువేరా లాటిన్ అమెరికా అంతా పర్యటించారు, అక్కడ ఉన్న బీదరికం చూసి పరివర్తన చెందారు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
సబర్మతీ ఆశ్రమం ( దీనికే గాంధీ ఆశ్రమం, హరిజన ఆశ్రమం, సత్యాగ్రహ ఆశ్రమం అని కూడా పేరు) గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదుకి 5 కిలోమీటర్ల దూరంలో సబర్మతీ నది ఒడ్డున స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీ నిర్మించుకున్న ఆశ్రమం. గాంధీ తన భార్య అయిన కస్తూర్భా తో పాటు ఇక్కడ పన్నెండేళ్ళు నివాసమున్నాడు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఈ ఆశ్రమం కీలక పాత్ర పోషించింది.
అందరూ ఇష్టపడే చిరుధాన్యం జొన్న (ఆంగ్లం: Sorghum). శరీర నిర్మాణానికి తోడ్పడే మాంసకృత్తులు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్ ఆమ్లం వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల లడ్డు, అప్పడాలు, అంబలి వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు
భారతదేశంలో ప్రాథమిక విధులు (ఆంగ్లం : Fundamental Duties) 1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి. 2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడింది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికి సోమనాథుడిని ఆదికవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
శివ సహస్రనామములు శివుడు యొక్క ఒక "వెయ్యి పేర్లు జాబితాలో" ఉంది, హిందూమతం యొక్క అత్యంత ముఖ్యమైన దేవతలలో శివుడు ఒకరు. హిందూ మతం సంప్రదాయంలోని సహస్రనామములు ఒక రకం యొక్క భక్తి శ్లోకం (సంస్కృతం: స్తోత్రం ), ఒక దేవత యొక్క అనేక పేర్లు, సహస్రనామములు జాబితా లోని పేర్లు దైవాన్ని ప్రశంసించినట్లు అవుతోంది, ఆ దైవం సంబంధం లక్షణాలు, విధులు, ప్రధాన పురాణాలలో ఒక కూలంకషంగా జాబితా (కేటలాగ్) ను అందిస్తాయి. శివ సహస్రనామ స్తోత్రము వీటన్నింటి స్తోత్రరూపం.
మెదక్ జిల్లా కలెక్టర్గా ఉంటూ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్న కలెక్టర్ స్మితా సబర్వాల్. 2001లో ట్రైనీ కలెక్టర్గా ఐఏఎస్ విధుల్లో చేరిన ఈమె తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు. ఫలితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.1977 సంవత్సరం జూన్ 19వ తేదీన జన్మించిన స్మితా సబర్వాల్..
భరతనాట్యం దక్షిణ భారతదేశంలో నాట్య శాస్త్రం రచించిన భరతముని పేరుతో పుట్టి, ప్రసిద్ధి గాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం. దక్షిణ భారతదేశం లోని పురాతన దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరసలు నాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దబడి ఉంటాయి. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు.
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.