The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) Telangana విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
భగవంత్ కేసరి 2023లో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 2023 జూన్ 10న చిత్ర యూనిట్ విడుదల చేశారు.భగవంత్ కేసరి విడుదలైన ఆరు రోజుల్లోనే 104 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు వంద కోట్ల పోస్టర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
స్కంద 2023లో విడుదలైన తెలుగు సినిమా. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. రామ్, శ్రీలీల, ప్రిన్స్ సిసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 26న నటుడు నందమూరి బాలకృష్ణ విడుదల చేయగా, సెప్టెంబర్ 28న తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది.
శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు.శాంతిభద్రతలను కాపాడటం, పౌరులను, వారి ఆస్తులను రక్షించడం, నేరాలను నిరోధించడం, దర్యాప్తు చేయడం, వారి అధికార పరిధిలో చట్టాలు, నిబంధనలను అమలు చేయడం వంటివి పోలీసుల బాధ్యత. వారు స్థానిక, ప్రాంతీయ లేదా జాతీయ పోలీసు బలగాలు వంటి ప్రభుత్వ సంస్థలు లేదా విభాగాల కోసం పని చేస్తారు, పోలీసు అధికారులు సాధారణంగా ఆత్మరక్షణ, తుపాకీలను ఉపయోగించడం, అరెస్టు విధానాలు, ట్రాఫిక్ నియంత్రణ, గుంపు నియంత్రణ, అత్యవసర ప్రతిస్పందన, ప్రథమ చికిత్స వంటి వివిధ నైపుణ్యాలలో శిక్షణ పొందుతారు. వారి విధుల్లో తరచుగా కేటాయించిన ప్రాంతాలలో పెట్రోలింగ్, అత్యవసర కాల్లు, సంఘటనలకు ప్రతిస్పందించడం, నేరాలను పరిశోధించడం, అనుమానితులను ఇంటర్వ్యూ చేయడం, సాక్ష్యాలను సేకరించడం, అరెస్టులు చేయడం, కోర్టులో సాక్ష్యమివ్వడం, ఇతర చట్టాన్ని అమలు చేసే సంస్థలు, సిబ్బందితో కలిసి పనిచేయడం వంటివి ఉంటాయి.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
స్త్రీలపై జరిగే అత్యాచారాలన్నింటిలో పైకి కనబడకుండా ఎన్నో సార్లు, మరల మరలా ఆమెపై జరిగే అతిహేయమైన అత్యాచారం ఈ ‘లైంగికపరమైన వేధింపులు, దీనిని ఆంగ్లములో సెక్సువల్ హెరాస్మెంట్ అని అంటారు కన్నార్పకుండా చూడడం, సైగలు చేయడం, తాకడం లేదా అసభ్య కరమైన వ్యాఖ్యానాలు చేయడం వంటి ‘సెక్స్’ పరమైన అనుచితమైన ప్రవర్తనను లైంగిక వేధింపులు అని వ్యవహరించ వచ్చు .భారత రాజ్యాంగంలో అధికరణం 14, 15 ప్రకారం మహిళలకు పురుషులతో సమానంగా ప్రాథమిక హక్కులు కల్పించబడ్డాయి. అయితే వారిపై జరిగే లైంగిక వేధింపులు ఈ హక్కులను ఉల్లంఘిస్తునట్లే అని ఈ చట్టం గుర్తించింది. అలాగే ఆర్టికల్ 21 ప్రకారం ఎటువంటి వేధింపులు లేని, సురక్షితమైన వాతావరణంలో స్త్రీలు తమకు నచ్చిన వృత్తి లేక వ్యాపారం చేసుకునే హక్కు కల్పించబడింది.
హానికరమైన సైబర్ కార్యకలాపాలు ప్రజల భద్రతకు మరియు మన జాతీయ మరియు ఆర్థిక భద్రతకు ముప్పు కలిగిస్తాయి. సైబర్ క్రైమ్, లేదా కంప్యూటర్-ఆధారిత నేరం, ఇది కంప్యూటర్ , నెట్‌వర్క్‌తో కూడిన నేరం. కంప్యూటర్ నేరం వ్యవహారంలో ఉపయోగించబడి ఉండవచ్చు లేదా అది లక్ష్యంగా ఉండవచ్చు ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరమైన నేరాలను సైబర్ నేరాలు(Cyber Crimes) అంటారు .
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కోల్‌కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, భీమ, మంజీరా, మూసీ, డిండి, ప్రాణహిత, తుంగభద్ర, కిన్నెరసాని, మున్నేరు, పాలేరు, పెన్ గంగ, వైరా, తాలిపేరు మొదలైన నదులు, ఉపనదులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర భూభాగమంతా వాయవ్యంలో ఎత్తుగా, ఆగ్నేయ దిశలో వాలి ఉండడంతో ఇక్కడ ప్రవహించే నదులన్ని వాయవ్య దిశ నుండి ఆగేయ దిశకు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
డిస్నీ+ హాట్‌స్టార్ (దీనిని హాట్‌స్టార్ అని కూడా పిలుస్తారు) డిస్నీ స్టార్‌కి చెందిన నోవి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ యాజమాన్యంలోని సబ్స్క్రిప్షన్ వీడియో ఆన్-డిమాండ్ ఓవర్-ది-టాప్ స్ట్రీమింగ్ సర్వీస్. ఇది భారతీయ బ్రాండ్, డిస్నీ మీడియా, ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూషన్, రెండు విభాగాలచే నిర్వహించబడుతుంది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
కొణిదెల పవన్ కళ్యాణ్ ( జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 లేదా 1971 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.అతని సోదరులు చిరంజీవి, నాగేంద్రబాబు కూడా సినిమా నటులు. అతను 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేసాడు. 1998లో అతను నటించిన తొలిప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాషా ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది.