The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ భాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంను నవంబరు 1వ తేదీగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్ర ప్రదేశ్ గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది.
జాతీయ ఐక్యతా దినోత్సవంను, భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబరు 31న జరుపుకోవాలని భారత ప్రభుత్వం గుర్తించి 24-10-2014న ప్రకటించింది. గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్దం నరేంద్రమోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నర్మదా నదితీరంలో ప్రపంచంలోనే ఎతైన ఐక్యతా ప్రతిమ అనే లోహ విగ్రహాన్ని నిర్మించడానికి సిద్దమయ్యారు. ఈ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర, జిల్లా అన్ని స్థాయిల్లో కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని భారత హోంమంత్రి రాజ్ నాథ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో నిర్మిస్తున్న ఒక స్మారక కట్టడం పేరు స్టాట్యూ ఆఫ్ యూనిటీ. దీనిని తెలుగులో ఐక్యతా ప్రతిమ లేక ఐక్యతా విగ్రహం అని అంటారు. ఈ విగ్రహాన్ని గుజరాత్లో నర్మదానది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు నిర్ణయించి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు.
మార్టిన్ లూథర్ (ఆంగ్లం : Martin Luther) (1483 నవంబరు 10 - 1546 ఫిబ్రవరి 18) జెర్మనీకి చెందిన ఒక సన్యాసి, మత ధార్మిక వేత్త, విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్, ప్రొటెస్టెంటిజంకు చెందిన ఒక ఫాదర్,, చర్చి సంస్కర్త, ఇతడి ఆలోచనలు ప్రొటెస్టంటు సంస్కరణలకు దారితీసి, పశ్చిమ నాగరికతను మార్చివేసాయి.లూథర్ యొక్క ధర్మ శాస్త్రము పోప్ యొక్క ఆధిక్యతను ప్రశ్నించింది, లూథర్ ప్రకారం క్రైస్తవ ధర్మశాస్త్రము బైబిల్ ఆధారంగా మాత్రం పొందగలమని, చర్చీలు, పోపు ద్వారా కాదని ప్రకటించాడు. క్రీస్తుద్వారా బాప్తిజం పొందినవారు మాత్రమే విశ్వవ్యాపిత విశ్వాసులు అని చాటాడు. లూథర్ ప్రకారం, మోక్షము అనునది దైవ ప్రసాదము, దీనిని సత్యవంత 'పశ్చాత్తాపం', యేసు పట్ల విశ్వాసము ఉంచేవారే పొందగలరు.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
పైడితల్లి అమ్మవారి ఆలయం, విజయనగరం
పైడిమాంబ లేదా పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల దైవం, పూసపాటి రాజుల ఇలవేల్పు. అమ్మవారి దేవాలయం మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు. అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభమై 250 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, భీమ, మంజీరా, మూసీ, డిండి, ప్రాణహిత, తుంగభద్ర, కిన్నెరసాని, మున్నేరు, పాలేరు, పెన్ గంగ, వైరా, తాలిపేరు మొదలైన నదులు, ఉపనదులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర భూభాగమంతా వాయవ్యంలో ఎత్తుగా, ఆగ్నేయ దిశలో వాలి ఉండడంతో ఇక్కడ ప్రవహించే నదులన్ని వాయవ్య దిశ నుండి ఆగేయ దిశకు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా (Albania) దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని. భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని (Missionaries of charity) భారతదేశంలోని కోల్‌కతా (కలకత్తా) లో, 1950 లో స్థాపించింది. 45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ ఛారిటీని భారత దేశంలో, ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసింది.
డిస్నీ+ హాట్‌స్టార్ (దీనిని హాట్‌స్టార్ అని కూడా పిలుస్తారు) డిస్నీ స్టార్‌కి చెందిన నోవి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ యాజమాన్యంలోని సబ్స్క్రిప్షన్ వీడియో ఆన్-డిమాండ్ ఓవర్-ది-టాప్ స్ట్రీమింగ్ సర్వీస్. ఇది భారతీయ బ్రాండ్, డిస్నీ మీడియా, ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూషన్, రెండు విభాగాలచే నిర్వహించబడుతుంది.
తాజ్ మహల్ (ఆంగ్లం:Taj Mahal () (హిందీ: ताज महल) (ఉర్దూ: تاج محل ) అనే ఒక అద్భుతమైన సమాధి] భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. తాజ్ మహల్ (ఇంకా "తాజ్") |మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది, ఇది పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది. 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చినదీ, "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదాహరించింది అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది." తెల్లటి పాల రాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం, నిజానికి తాజ్ మహల్ ఒక మిశ్రమ సమన్వయ నిర్మాణం.
కొణిదెల పవన్ కళ్యాణ్ ( జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 లేదా 1971 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.అతని సోదరులు చిరంజీవి, నాగేంద్రబాబు కూడా సినిమా నటులు. అతను 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేసాడు. 1998లో అతను నటించిన తొలిప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాషా ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది.
సుధా చంద్రన్ ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి. తాను 1981 జూన్ నెలలో తమిళనాడు లోని "త్రిచీ" వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులో మయూరి సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా, టెలివిజన్ ధారావాహికలలో నటించారు.
భారతదేశానికి మూడవ ప్రధాని ఇందిరాగాంధీ అక్టోబరు 31, 1984 తేదీన న్యూఢిల్లీ లోని సఫ్దార్జంగ్ రోడ్డు లోని తన నివాసంలో 09:20 కు హత్య గావించబడింది. ఆమెను స్వంత అంగరక్షకులైన సత్వంత్‌సింగ్, బియాత్‌సింగ్ లే హత్య చేశారు. ఈ హత్య అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయంలో భారత సైన్యం జూన్ 1984న జరిపిన ఆపరేషన్ బ్లూస్టార్‌కు ప్రతీకారంగా జరిగింది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
శివుడు (సంస్కృతం: Śiva) హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికి మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహా కాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని నూతన సృష్టి ఉద్వావింప చేసేవాడే మహా కాలుడు సదాశివు శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు.