The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
సూర్యకుమార్ యాదవ్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2011 అక్టోబరులో ముంబై తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి, ఐపీఎల్ 2012లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆయనను ఐపీఎల్ 2014 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకొని, తిరిగి 2018లో జరిగిన ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
మహమ్మద్ సిరాజ్ 1994 లో జన్మించిన భారత క్రికెట్ ఆటగాడు. 2017 అక్టోబరులో భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. మహమ్మద్ సిరాజ్ 2023 జనవరి 18న తన సొంత గడ్డపై హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో ఆడి 4 వికెట్లు పడగొట్టాడు.టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య 2023 సెప్టెంబరు 17న కొలంబోలో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో మహమ్మద్ సిరాజ్ 16 బంతుల్లో 5 వికెట్లు తీసి చమిందా వాస్ రికార్డును సమం చేస్తూ వన్ డే ఇంటర్నేషనల్ (ODI)లలో 6 వికెట్లు తీసిన జాయింట్ ఫాస్టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు
క్రికెట్లో పురుషుల ఒక్కరోజు పందెం (వన్డే) ప్రపంచకప్‌లో భారత జట్టు రెండుమార్లు (1983లో ఇంగ్లండ్‌లో,, 2011లో ఉపఖండంలో) విజేతగా నిలిచింది. 2003లో ఫైనల్ చేరగా, నాలుగు మార్లు (1987, 1996, 2015, 2019) సెమీఫైనల్లో పరాజయం పాలయ్యింది. మొత్తంగా, 53 జయాలను, 29 పరాజయాలను పొందింది.
డిస్నీ+ హాట్‌స్టార్ (దీనిని హాట్‌స్టార్ అని కూడా పిలుస్తారు) డిస్నీ స్టార్‌కి చెందిన నోవి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ యాజమాన్యంలోని సబ్స్క్రిప్షన్ వీడియో ఆన్-డిమాండ్ ఓవర్-ది-టాప్ స్ట్రీమింగ్ సర్వీస్. ఇది భారతీయ బ్రాండ్, డిస్నీ మీడియా, ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూషన్, రెండు విభాగాలచే నిర్వహించబడుతుంది.
శుభ్‌మన్ గిల్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన భారత క్రికెట్ జట్టు జులై 2019లో న్యూజిలాండ్ టీంతో జరిగిన వన్డే సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి, 18న హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో తొలి డబుల్ సెంచరీ సాధించడమే కాకుండా, అత్యంత పిన్న వయస్సులో డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా & భారత్ తరఫున అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శుభ్‌మన్ గిల్ 2023 ఫిబ్రవరి 01న న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో తన తొలి టీ20 శతకం సాధించాడు.
ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (ఆంగ్లం:International Men's Day లేదా IMD) ప్రతి సంవత్సరం నవంబరు 19 న అంతర్జాతీయా స్థాయిలో జరుపబడే ఉత్సవం. 1992 ఫిబ్రవరి 7న ప్రొఫెసర్ థామస్ ఓస్టర్ చే ఈ దినము ప్రారంభించబడిననూ, ట్రినిడాడ్ , టొబాగో దేశస్థులు దీనికి కొత్త ఊపిరులు ఊదారు. దక్షిణ ఐరోపాకు చెందిన మాల్టా దీవిలో ఈ ఉత్సవాన్ని 1994 ఫిబ్రవరి 7 నుండి క్రమం తప్పక జరుపుతున్నారు.
కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్ (హిందీ:कपिल देव) భారతదేశపు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. 1959, జనవరి 6న ఛండీగఢ్‌లో జన్మించిన కపిల్ దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్రౌండర్లలో ఒకడిగా పేరుసంపాదించాడు. 2002లో విజ్డెన్ పత్రికచే 20 వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందినాడు.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాథారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం | లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో విష్ణువు ఒకరు. బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుని సృష్టి యొక్క స్థితి కర్త, లయ కర్త, సృష్టికి మూలంగా భావిస్తారు. శ్రీవైష్ణవం సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు, పరబ్రహ్మము, సర్వేశ్వరుడు.
ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (Sachin Ramesh Tendulkar). క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973న జన్మించాడు. 2013 నవంబరు 16 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు ప్రకటించింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి
శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలో అరసవల్లి అనే గ్రామంలో ఉంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ద్వారా బహుళ ప్రసిద్ధి చెందింది..