The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఆంగ్లం : All India Majlis-e-Ittehadul Muslimeen) (ఉర్దూ : کل ہند مجلس اتحاد المسلمين, కుల్ హింద్ మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అర్థం: అఖిల భారత సమైక్య ముస్లిం మండలి) భారత్ లోని, ముఖ్యంగా హైదరాబాదు పాతబస్తీలోని ముస్లింల రాజకీయ పార్టీ. ఇది కేవలం హైదరాబాదు పాతనగరానికే పరిమితమై ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని ప్రదేశాలలో బలమైన ఉనికి గల పార్టీ.
తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితా
తెలంగాణలో శాసన సభ లేదా శాసనసభ 119 నియోజకవర్గాలను కలిగి ఉంది. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 19 నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 12 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. జిల్లాలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల వివరాలతో అవి ఏ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది అనే వివరాలు ఈ జాబితాలో వివరించబడ్డాయి.
భారత్ రాష్ట్ర సమితి (ఆంగ్లం: Bharat Rashtra Samithi), అనేది జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పాటుచేసిన రాజకీయ పార్టీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం 2001లో ఏర్పాటుచేయబడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు 2022 అక్టోబరు 5న భారత్ రాష్ట్ర సమితిగా మార్చబడింది. 2022 డిసెంబరు 9న తెలంగాణ భవన్లో జరిగిన భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం 1.20 నిమిషాలకు బీఆర్ఎస్ పత్రాలపై సంతకం చేసిన కేసీఆర్, పార్టీ జెండాను ఆవిష్కరించాడు.
బర్రెలక్కగా పేరొందిన కర్నె శిరీష తెలంగాణకు చెందిన నిరుద్యోగి, రాజకీయ నాయకురాలు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆమె ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆకర్శించింది. ఆమెకు ఈ ఎన్నికలు పూర్తయ్యేదాకా ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని, అలాగే, ఆమె పాల్గొనే ఎన్నికల సమావేవాలకు సెక్యూరిటీ ఇవ్వాలని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని 2023 నవంబరు 24న ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు.
మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. ఈయన మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (దుండిగల్), మరికొన్ని విద్యాసంస్థలకు చైర్మన్, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మర్రి రాజశేఖర్‌రెడ్డి 2019 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు.
కల్వకుంట్ల తారక రామరావు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు. సిరిసిల్ల నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 నుండి తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్నారై అఫైర్స్ మంత్రిగా పనిచేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ ఎన్నికలు 2018 డిసెంబరు 7న జరిగాయి. ఈ ఎన్నికలలో పాల్గొన్నవాటిలో మొదటి శాసనసభలోని అదికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి, భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీలు ప్రధానమైనవి. గతంలో అధికారంలోఉన్న తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని ఓడించడానికి నాలుగు ప్రతిపక్ష పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీ, సి.పి.ఐ పార్టీలు కలసి "మహా కూటమి" గా ఏర్పడి పోటీ చేసాయి.
తెలంగాణ రాష్ట్ర శాసన సభ రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో దిగువ సభ. ఈ సభ ప్రస్తుతం 119 శాసన సభ్యుల తో ఉంది.విధానసభ సభ్యులు నేరుగా వయోజన ఓటు హక్కు ఉన్న ప్రజలచే ఎన్నుకోబడతారు. ప్రతి నియోజకవర్గం నుండి ఒక అసెంబ్లీ సభ్యుడును, పోటీ చేసిన అభ్యర్థులలోకెల్ల ఎక్కువ ఓట్లను పొందిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటింపబడును.
ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన తొలి తెలంగాణ శాసనసభ, 2018లో ఆరవసారి ఎమ్మెల్యే గెలిచిన తరువాత భారత్ రాష్ట్ర సమితి పార్టీలో మొదటి పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా పనిచేస్తున్నాడు.
భోపాల్ (ఆంగ్లం: Bhopal, హిందీ: भोपाल, ఉర్దూ: بھوپال) మధ్యభారతదేశములో ఒక నగరం. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని, 'భోపాల్ డివిజన్' కూడానూ. మధ్యప్రదేశ్ లో ఇండోర్ తరువాత రెండవ పెద్ద నగరం.భోపాల్ భారతదేశములో 17 వ అతిపెద్ద నగరం, ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో 131 వది.భోపాల్ లో అనేక జాతీయ విద్యాపరిశోధన సంస్థలు, ఉన్నాయి.వాటీలో IISER, MANIT , AIIMS, NLIU, SPA, IIIT ముఖ్యమైనవి.
కొమరంభీం జిల్లా జిల్లాలోని ఈ నియోజకవర్గము ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 1962 నుండి 1999 వరకు వరుసగా ఒక్కో అభ్యర్థిని రెండేసి సార్లు గెలిపించింది. 1962 నుండి 1978 వరకు వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, 1983, 1985, 1999 లలో తెలుగుదేశం గెలుపొందింది.
శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) భారత ప్రభుత్వ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శాసనసభకు రాష్ట్ర జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో నియోజకవర్గాలు ఉంటాయి. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో శాసనసభ నియోజకవర్గ ఓటర్లు ఎన్నుకున్న ప్రతినిధిని శాసన సభ్యుడు లేదా శాసనసభ సభ్యుడు (ఎంఎల్ఎ) అని అంటారు. ప్రతి శాసనసభ నియోజకవర్గం నుండి, ప్రజలు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు.ఎన్నికైన ప్రతినిధులు ఆరాష్ట్ర శాసనసభ సభ్యుడవుతారు.ఈ శాసనసభ్యుడు తను ఎన్నుకోబడిన శాసనససభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
జగ్గారెడ్డిగా ప్రసిద్ధి చెందిన తూర్పు జయప్రకాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రాంరంభించి, మున్సిపాలిటి చైర్మెన్‌గా, శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్‌గా పదవులు నిర్వహించాడు.
ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తారు.రాజ్యాంగం ప్రకారం గవర్నరే రాష్ట్ర పరిపాలకుడు అయినప్పటికి ఆయనకు ఎటువంటి పరిపాలనాధికారాలు ఉండవు. శాసనసభ ఎన్నికలు ఫలితాలను బట్టి సరిపడా సంఖ్యాబలం ఉన్న పార్టీ లేదా కూటమిని గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తారు. ఆయన ముఖ్యమంత్రిని నియమిస్తారు.
డీ.కే. శివ కుమార్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మూడుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసి ప్రస్తుతం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా ఉన్నాడు.ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తరువాత కర్నాటక ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ రాజకీయనాయకుడు, మాజీ మంత్రి. పూర్వం ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి, ఖమ్మం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహింఛాడు, అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మంత్రివర్గంలో, తెలంగాణ రాష్ట్రం లో కేసిఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసారు.ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా పని చేశాడు. 2023 లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) 1958 డిసెంబరు 5న జన్మించాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన రాజనర్సింహ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసించి, రాజకీయాలలో ప్రవేశించి 1989లో తొలిసారిగా ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది, ఆ తర్వాత మరో రెండుసార్లు కూడా ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
1972, ఏప్రిల్ 17న జన్మించిన ముత్తయ్య మురళీధరన్ శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ బౌలర్. 2007, డిసెంబర్ 4న టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండుతో కాండీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కాలింగ్వుడ్ను తన స్పిన్ బౌలింగ్‌తో ఔట్ చేసి తన టెస్ట్ జీవితంలో 709వ వికెట్టు సాధించి ఇంతకు క్రితం ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ సృష్టించిన రికార్డును అధిగమించాడు.
జి.కిషన్ రెడ్డి (G.Kishan Reddy) భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత. . 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మార్చి 6, 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.
బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకుడు, రాజకీయ నాయకుడు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి 16వ పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి గెలుపొందాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడుగా గెలుపొందాడు.