The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుడు.ఇతను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కారణమయ్యాడు.కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికయ్యాడు.అతను 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు.
ధనసరి అనసూయ (సీతక్క) తెలంగాణ కు చెందిన రాయకీయ నాయకురాలు. ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే,అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు నాయకురాలు. సుమారు 15 ఏళ్ల పాటు మావోయిస్టుగా (Maoist) ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు.
అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలో ప్రతి నామం వెనుక "మణికంఠాయ నమః" అని చదువవలెను.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లా లోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లా లోని అమరారామం.
దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) 1958 డిసెంబరు 5న జన్మించాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన రాజనర్సింహ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసించి, రాజకీయాలలో ప్రవేశించి 1989లో తొలిసారిగా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొంది, ఆ తర్వాత మరో రెండుసార్లు కూడా ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
కల్వకుంట్ల తారక రామరావు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు. సిరిసిల్ల నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 నుండి తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్నారై అఫైర్స్ మంత్రిగా పనిచేస్తున్నారు.
మేరీ ఆంటోనిట్టే నవంబర్ 2, 1755న ఆస్ట్రియాలోని వియన్నాలో జన్మించారు. ఆమె ఎంప్రెస్ మరియా థెరిసా మరియు ఆస్ట్రియా చక్రవర్తి ఫ్రాన్సిస్ I యొక్క చిన్న కుమార్తె. 1770లో, 14 సంవత్సరాల వయస్సులో, మేరీ ఆంటోయినెట్ లూయిస్-అగస్టేను వివాహం చేసుకుంది, కాబోయే ఫ్రాన్స్ రాజు లూయిస్ XVI. ఆస్ట్రియా మరియు ఫ్రాన్స్ మధ్య మైత్రిని బలోపేతం చేయడానికి వివాహం ఏర్పాటు చేయబడింది.
ప్రామాణిక వ్యాకరణ గ్రంథాల ప్రకారం తెలుగు భాష (నుడి)లో అక్షరాలు యాభై ఆరు (56). వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షారలుగా విభజించారు: పదహారు (16) అచ్చులు; ముప్ఫై ఎనమిది (38) హల్లులు; అనుస్వారము (సున్న), విసర్గ ఉభయాక్షరాలు (2). వాడుకలో లోని ఌ, ౡ, ౘ, ౙ వదలివేసి ఇరవై ఒకటవ శతాబ్దంలో యాభై రెండు (52) అక్షరాల వర్ణమాలను బోధిస్తున్నారు.
'చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి' (1882 డిసెంబరు 11 – 1921 సెప్టెంబరు 12) తమిళ రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శిగానూ, "మహాకవి భారతి"గానూ సుప్రసిద్ధుడు, తమిళ సాహిత్య ప్రముఖుల్లో అత్యున్నత వ్యక్తిగా పేరొందారు. అతను అసంఖ్యాక రచనలు భారత స్వాతంత్ర ఉద్యమ కాలంలో దేశభక్తి, జాతీయత వంటి భావాలను వెలుగొందేలా చేశాయి.అప్పటి తిరునల్వేలి జిల్లా(ప్రస్తుతం తూత్తుకుడిలో ఉంది)లోని ఎట్టాయపురంలో 1882లో జన్మించారు.
తెలంగాణ శాసనసభ స్పీకర్ల జాబితా
రిపబ్లిక్ ఇండియాలో వివిధ కేంద్ర, రాష్ట్ర శాసనసభలకు స్పీకర్ లేదా ఛైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. సాధారణ ఎన్నికల తరువాత తెలంగాణ శాసనసభ మొట్టమొదటి సమావేశంలో 5 సంవత్సరాల కాలానికి విధానసభ సభ్యుల నుండి స్పీకర్ ఎన్నుకోబడతాడు. వారు విధానసభ సభ్యునిగా నిలిచిపోయే వరకు లేదా ఆయన రాజీనామా చేసే వరకు స్పీకర్ పదవిలో ఉంటాడు.
తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ రాజకీయనాయకుడు, మాజీ మంత్రి. పూర్వం ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి, ఖమ్మం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహింఛాడు, అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మంత్రివర్గంలో, తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసారు.ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేశాడు. 2023 లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) భారత ప్రభుత్వ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శాసనసభకు రాష్ట్ర జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో నియోజకవర్గాలు ఉంటాయి. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో శాసనసభ నియోజకవర్గ ఓటర్లు ఎన్నుకున్న ప్రతినిధిని శాసన సభ్యుడు లేదా శాసనసభ సభ్యుడు (ఎంఎల్ఎ) అని అంటారు. ప్రతి శాసనసభ నియోజకవర్గం నుండి, ప్రజలు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు.ఎన్నికైన ప్రతినిధులు ఆరాష్ట్ర శాసనసభ సభ్యుడవుతారు.ఈ శాసనసభ్యుడు తను ఎన్నుకోబడిన శాసనససభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.
రాహుల్ గాంధీ (జననం 19 జూన్ 1970) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు, భారత యువజన కాంగ్రెస్, భారత జాతీయ విద్యార్థి యూనియన్ లకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నాడు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాడు. అమేథీ నియోజకవర్గం నుంచి 2004 నుండి 2019 వరకు లోకసభ సభ్యునిగా పనిచేశాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు సాంస్కృతిక ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
యానిమల్ (Animal) 2023లో విడుదలైన భారతీయ హిందీ-భాష యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, సందీప్ రెడ్డి వంగా రచన,దర్శకత్వం తో పాటు ఎడిటర్‌గా కూడా వ్యవహారించారు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ మరియు సినీ వన్ స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని మరియు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు జనవరి 2021లో అధికారికంగా ప్రకటించారు.
మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. ఈయన మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (దుండిగల్), మరికొన్ని విద్యాసంస్థలకు చైర్మన్, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మర్రి రాజశేఖర్‌రెడ్డి 2019 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు.
కొణిదెల పవన్ కళ్యాణ్ ( జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 లేదా 1971 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.అతని సోదరులు చిరంజీవి, నాగేంద్రబాబు కూడా సినిమా నటులు. అతను 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేసాడు. 1998లో అతను నటించిన తొలిప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాషా ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది.
క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ. క్రిస్టియన్ మతపరమైన పండుగల కేలండర్ కి క్రిస్మస్ కేంద్రం లాంటిది. క్రైస్తవ కేలండర్లో అడ్వెంట్ (పశ్చిమ క్రైస్తవం) లేక నేటివిటీ (తూర్పు క్రైస్తవం) ఉపవాస దినాల తర్వాత వచ్చే క్రిస్మస్, క్రిస్మస్ టైడ్ (చారిత్రకంగా పశ్చిమాన పన్నెండు రోజుల పాటు ఉండే పండుగ రోజులు.
జగ్గారెడ్డిగా ప్రసిద్ధి చెందిన తూర్పు జయప్రకాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రాంరంభించి, మున్సిపాలిటి చైర్మెన్‌గా, శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్‌గా పదవులు నిర్వహించాడు.
ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జరిగిన తొలి తెలంగాణ శాసనసభ, 2018లో ఆరవసారి ఎమ్మెల్యే గెలిచిన తరువాత భారత్ రాష్ట్ర సమితి పార్టీలో మొదటి పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా పనిచేస్తున్నాడు.
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబరు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు.
గూగుల్ ఎల్.ఎల్.సి అనేది ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ఆన్లైన్ ప్రకటన సాంకేతికతలు, సెర్చ్ ఇంజిన్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ మరియు తదితర అంతర్జాల సంబంధిత సేవలు, ఉత్పత్తులు వీరి ప్రత్యేకత. అమెరికన్ సమాచార సాంకేతిక పరిశ్రమలో అమెజాన్, ఫేస్బుక్, ఆపిల్ మరియు మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇది బిగ్ ఫైవ్ కంపెనీలలో ఒకటిగా పరిగణించబడుతుంది.