The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధిచెందిన అకాడమీ అవార్డులు (Academy of Motion Picture Arts and Sciences) (AMPAS) ప్రతీ యేటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక బహుమతులు. దీని బహుమతి ప్రదానోత్సవం అత్యంత వైభోగంగా జరుపడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వీక్షిస్తారు.మొట్ట మొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం మే 16, 1929లో హాలీవుడ్ లోగల హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది. 1927, 1928 సంవత్సరాలలో చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు.
కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి (జననం: 10 అక్టోబరు 1973 ; వృత్తిపరంగా ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తారు) భారతీయ సినిమా దర్శకుడు మరియు సినీ రచయిత. అతను ప్రధానంగా తెలుగు సినిమారంగంలో పని చేస్తాడు. అమెరికన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో అలరించిన మగధీర (2009), టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్‌గా నిలిచిన ఈగ (2012), అమెరికన్ సాటర్న్ పురస్కారానికి నామినేట్ చేయబడిన బాహుబలి: ది బిగినింగ్ (2015), ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అమెరికన్ సాటర్న్ మరియు ఆస్ట్రేలియన్ టెల్స్ట్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డులనందుకున్న బాహుబలి 2: ది కంక్లూజన్ (2017) వంటి ఫాంటసీ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు అతను బాగా ప్రసిద్ది చెందాడు.
కాల భైరవ తెలుగు సినిమా నటుడు, గాయకుడు మరియు సంగీత దర్శకుడు. ఆయన తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషా చిత్రాలలో పాడాడు.‘బాహుబలి-2’లో అతడు పాడిన దండాలయ్యా పాట కాల భైరవకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన 2019లో విడుదలైన మత్తు వదలరా సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా మారాడు.కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాడిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా పాటల, జానపద పాటల గాయకుడు, రచయిత. తెలంగాణ యాసలో మగజాతి అనే జానపద పాటతో యూట్యూబ్ లో ప్రాచూర్యం పొందిన రాహుల్, 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడ పాటతో సినిమారంగంలోకి ప్రవేశించాడు.రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
భారతదేశం యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభను శాసనమండలి (విధాన పరిషత్) అంటారు.అధికరణ 169 ప్రకారం రాష్ట్రంలలో శాసనమండలి ఏర్పాటు చేయవచ్చు.రద్దు చేయవచ్చు. శాసనమండలి కావాలి అని కోరుకుంటున్న రాష్ట్రంలోని శాసనసభ లో 2/3 మెజారిటీతో ఆమెదిచాలి.రాజ్యాంగంలోని 171 అధికరణం ద్వారా ఈ విధాన సభను ప్రారంభించవచ్చు. ప్రస్తుత భారతదేశంలోని 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉంది.అవి ఉత్తరప్రదేశ్(100), బీహార్(75), కర్ణాటక(75), మహారాష్ట్ర(78),ఆంధ్ర ప్రదేశ్(58), తెలంగాణ(40).
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికి సోమనాథుడిని ఆదికవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
అకాడమీ పురస్కారాలు - ఉత్తమ చిత్రం
ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధి చెందిన అకాడమీ పురస్కారాలలో ఉత్తమ చిత్రం విభాగంలో ప్రతియేటా ఇచ్చే బహుమతులను అకాడమీ ఆఫ్ మోషన్ ఫిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సస్ (AMPAS) 1929 నుండి ప్రదానం చేస్తున్నది. ఈ పురస్కారాలలో మిగిలిన విభాగాల కన్నా ఉత్తమ చిత్రం కేటగరీ ముఖ్యమైనదిగా భావిస్తారు ఎందుకంటే ఈ పురస్కారం దర్శకత్వం, నటన, సంగీతం, కథ, ఎడిటింగ్ మొదలైన అన్ని అంశాలను పరిగణనలో తీసుకుని ప్రకటిస్తారు కాబట్టి. ఈ పురస్కారంపై మీడియా ఎక్కువ దృష్టి పెడుతుంది.
ఆటలమ్మ (Chicken pox) లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ (Varicella zoster) అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం. ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ వైరస్‌ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు.
20వ శతాబ్దం పూర్వభాగంలో పల్లెల్లో తెలుగు ప్రజల జీవనవిధానం
భారత దేశ జనాభాలో ఎనబై శాతం వ్యవసాయ దారులే. వీరిలో వ్యవసాయదారులు, వ్యవసాయ సంబంధిత పనులలో పనిచేసే వారు ఉన్నారు. సాంప్రదాయ వ్యవసాయం రాను రాను యాంత్రీకరణం వైపు పరుగిడుతున్నది.
పచ్చకామెర్లు, (జాండీస్) రక్తంలో బిలిరుబిన్ యొక్క స్థాయి హెచ్చినప్పుడు (హైపర్ బిలిరుబినీమియా) చర్మము, కనుగుడ్లు, మ్యూకస్ మెంబ్రేనులు పసుపు పచ్చ రంగుతేలడాన్ని పచ్చకామెర్లు అంటారు.ఈ పరిస్థితి వలన అన్ని శరీరద్రవాలలో బిలిరుబిన్ పెరుగుతుంది. సాధారణంగా, ఈ లక్షణాలు కంటికి స్పష్టంగా కనిపించాలంటే ప్లాస్మాలోని బిలిరుబిన్ యొక్క గాఢత సాధారణ విలువ అయిన 0.5 మి.గ్రా/డె.లీ కంటే మూడు రెట్లకు (1.5 మి.గ్రా/డె.లీ) పైగా పెరగాలి. జాండీస్ అన్న పదము ఫ్రెంచి భాషా పదమైన jaune (పసుపుపచ్చ) నుండి పుట్టింది.
తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు. జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి , మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ఠ్రాలకు చెందిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.
నులి పురుగులనేవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు. ఈ వ్యాధి కారకాన్ని అస్కారియాసిస్ (ascariasis) అంటారు , ఇవి పేగుల్లో నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవుల ఇవి నెలల్లో గుడ్లు, లార్వాలుగా వృద్ది చెందుతాయి. వీటి ద్వారా శరీరంలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) భారత ప్రభుత్వ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శాసనసభకు రాష్ట్ర జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో నియోజకవర్గాలు ఉంటాయి. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో శాసనసభ నియోజకవర్గ ఓటర్లు ఎన్నుకున్న ప్రతినిధిని శాసన సభ్యుడు లేదా శాసనసభ సభ్యుడు (ఎంఎల్ఎ) అని అంటారు. ప్రతి శాసనసభ నియోజకవర్గం నుండి, ప్రజలు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు.ఎన్నికైన ప్రతినిధులు ఆరాష్ట్ర శాసనసభ సభ్యుడవుతారు.ఈ శాసనసభ్యుడు తను ఎన్నుకోబడిన శాసనససభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.
చాట్‌జిపిటి (ChatGPT) (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్) అనేది నవంబర్ 2022లో ఒపెన్ఏఐ (OpenAI) ద్వారా ప్రారంభించబడిన చాట్‌బాట్. ఇది OpenAI యొక్క GPT-3 కుటుంబ పెద్ద భాషా నమూనాల పైన నిర్మించబడింది మరియు పర్యవేక్షించబడే మరియు ఉపబల అభ్యాస పద్ధతులతో చక్కగా ట్యూన్ చేయబడింది (ఇది బదిలీ లెర్నింగ్కి ఒక విధానం). ChatGPT నవంబర్ 30, 2022న ప్రోటోటైప్‌గా ప్రారంభించబడింది మరియు అనేక విజ్ఞాన డొమైన్లలో దాని వివరణాత్మక ప్రతిస్పందనలు మరియు స్పష్టమైన సమాధానాల కోసం త్వరగా దృష్టిని ఆకర్షించింది.