The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
ఝాన్సీ లక్ష్మీబాయి (ఆంగ్లం: Lakshmibai, Rani of Jhansi) pronunciation ; నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి (झान्सी की राणी) గ ప్రసిద్ధికెక్కినది.
పునీత్ రాజ్ కుమార్ (1975 మార్చి 17 - 2021 అక్టోబరు 29) కన్నడ సినిమా నటుడు. ఆయన ఆరు నెలల వయస్సులో 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి బాలనటుడిగా 13 సినిమాలు చేసి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. పునీత్ రాజ్‌కుమార్ 2002లో అప్పూ సినిమాతో హీరోగా పరిచయమై తన 45 ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించాడు.
సున్తీ లేదా సున్నతి (Male circumcision) పురుషాంగానికున్న పూర్వచర్మాన్ని తొలగించడం. The word "circumcision" comes from Latin circum (meaning "around") and cædere (meaning "to cut"). Early depictions of circumcision are found in cave paintings and Ancient Egyptian tombs, though some pictures are open to interpretation.
భారతదేశం యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభను శాసనమండలి (విధాన పరిషత్) అంటారు.అధికరణ 169 ప్రకారం రాష్ట్రంలలో శాసనమండలి ఏర్పాటు చేయవచ్చు.రద్దు చేయవచ్చు. శాసనమండలి కావాలి అని కోరుకుంటున్న రాష్ట్రంలోని శాసనసభ లో 2/3 మెజారిటీతో ఆమెదిచాలి.రాజ్యాంగంలోని 171 అధికరణం ద్వారా ఈ విధాన సభను ప్రారంభించవచ్చు. ప్రస్తుత భారతదేశంలోని 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉంది.అవి ఉత్తరప్రదేశ్(100), బీహార్(75), కర్ణాటక(75), మహారాష్ట్ర(78),ఆంధ్ర ప్రదేశ్(58), తెలంగాణ(40).
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897 ) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
ఐక్యరాజ్య సమితి (English: United Nations - UN) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి , మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
గ్లోబల్ వార్మింగ్ (global warming; "భూగోళ/ప్రపంచ కవోష్ణత") అంటే భూమి ఉష్ణోగ్రతలో దీర్ఘకాలికంగా జరిగే పెరుగుదల. శీతోష్ణస్థితి మార్పు (climate change; క్త్లెమేట్ చేంజ్) లో ఇది ప్రధాన అంశం. ప్రత్యక్షంగా ఉష్ణోగ్రతలు కొలవడం ద్వారా, భూమి వేడెక్కడం వల్ల కలిగే వివిధ ప్రభావాలను కొలవడం ద్వారా దీన్ని నిరూపించారు.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
నన్నయ భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం వారు పాల్కురికి సోమనాథుడిని ఆదికవిగా భావిస్తున్నారు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు.
డిస్నీ+ హాట్‌స్టార్ (దీనిని హాట్‌స్టార్ అని కూడా పిలుస్తారు) డిస్నీ స్టార్‌కి చెందిన నోవి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ యాజమాన్యంలోని సబ్స్క్రిప్షన్ వీడియో ఆన్-డిమాండ్ ఓవర్-ది-టాప్ స్ట్రీమింగ్ సర్వీస్. ఇది భారతీయ బ్రాండ్, డిస్నీ మీడియా, ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూషన్, రెండు విభాగాలచే నిర్వహించబడుతుంది.
చాట్‌జిపిటి (ChatGPT) (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్) అనేది నవంబర్ 2022లో ఒపెన్ఏఐ (OpenAI) ద్వారా ప్రారంభించబడిన చాట్‌బాట్. ఇది OpenAI యొక్క GPT-3 కుటుంబ పెద్ద భాషా నమూనాల పైన నిర్మించబడింది మరియు పర్యవేక్షించబడే మరియు ఉపబల అభ్యాస పద్ధతులతో చక్కగా ట్యూన్ చేయబడింది (ఇది బదిలీ లెర్నింగ్కి ఒక విధానం). ChatGPT నవంబర్ 30, 2022న ప్రోటోటైప్‌గా ప్రారంభించబడింది మరియు అనేక విజ్ఞాన డొమైన్లలో దాని వివరణాత్మక ప్రతిస్పందనలు మరియు స్పష్టమైన సమాధానాల కోసం త్వరగా దృష్టిని ఆకర్షించింది.
ఆటలమ్మ (Chicken pox) లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ (Varicella zoster) అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం. ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ వైరస్‌ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు (Right to Information). సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 13 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం (Right to Information Act) భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్పీఎస్సి), భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 315 ప్రకారం స్థాపించబడిన ఒక రాజ్యాంగ సంస్థ. ఇది 2014 ఆగస్టు 18న ఏర్పాటైంది. భారత రాష్ట్రమైన తెలంగాణలో సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు దరఖాస్తుదారుల యోగ్యత, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి (జననం: 10 అక్టోబరు 1973 ; వృత్తిపరంగా ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తారు) భారతీయ సినిమా దర్శకుడు మరియు సినీ రచయిత. అతను ప్రధానంగా తెలుగు సినిమారంగంలో పని చేస్తాడు. అమెరికన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో అలరించిన మగధీర (2009), టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్‌గా నిలిచిన ఈగ (2012), అమెరికన్ సాటర్న్ పురస్కారానికి నామినేట్ చేయబడిన బాహుబలి: ది బిగినింగ్ (2015), ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అమెరికన్ సాటర్న్ మరియు ఆస్ట్రేలియన్ టెల్స్ట్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డులనందుకున్న బాహుబలి 2: ది కంక్లూజన్ (2017) వంటి ఫాంటసీ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు అతను బాగా ప్రసిద్ది చెందాడు.