The most-visited తెలుగు Wikipedia articles, updated daily. Learn more...
అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు.
బలగం 2023లో విడుదలైన తెలుగు సినిమా. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న విడుదలై, మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీల్లో విడుదలైంది.
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది. గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు) ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు) వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు) అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)ఉదాహరణ: Happy అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
చాట్‌జిపిటి (ChatGPT) (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్) అనేది నవంబర్ 2022లో ఒపెన్ఏఐ (OpenAI) ద్వారా ప్రారంభించబడిన చాట్‌బాట్. ఇది OpenAI యొక్క GPT-3 కుటుంబ పెద్ద భాషా నమూనాల పైన నిర్మించబడింది మరియు పర్యవేక్షించబడే మరియు ఉపబల అభ్యాస పద్ధతులతో చక్కగా ట్యూన్ చేయబడింది (ఇది బదిలీ లెర్నింగ్కి ఒక విధానం). ChatGPT నవంబర్ 30, 2022న ప్రోటోటైప్‌గా ప్రారంభించబడింది మరియు అనేక విజ్ఞాన డొమైన్లలో దాని వివరణాత్మక ప్రతిస్పందనలు మరియు స్పష్టమైన సమాధానాల కోసం త్వరగా దృష్టిని ఆకర్షించింది.
భారతదేశం ప్రపంచదేశాలలో నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది.
భారత జాతీయ పతాకం అన్నది దీర్ఘ చతురస్రాకారంలో కాషాయ రంగు, తెలుపు, పచ్చ రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది. 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది, 1947 ఆగస్టు 15న భారత డొమినియన్కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ భారత గణతంత్రానికి అధికారిక పతాకంగా స్వీకరించారు.
భారతదేశ చరిత్ర" లో భారత ఉపఖండంలోని చరిత్ర పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సింధు నాగరికత నుండి వేదసంస్కృతి రూపొందించిన ఇండో-ఆర్యన్ సంస్కృతి ఏర్పరచింది. హిందూయిజం, జైనమతం, బౌద్ధమతం అభివృద్ధి, హిందూ శక్తులతో ముడిపడిన మధ్యయుగ కాలంలో ముస్లింల ఆక్రమణల పెరుగుదలతో సహా భారత ఉపఖండంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాల పాటు రాజవంశాలు సామ్రాజ్యాలు; యూరోపియన్ వర్తకులుగా ప్రైవేట్ వ్యక్తుల ఆగమనం, బ్రిటీష్ ఇండియా; భారత స్వాతంత్ర ఉద్యమం, భారతదేశ విభజనకు దారితీసి భారత గణతంత్రం ఏర్పడింది.భారతీయ ఉపఖండంలో శారీరకంగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుల పురాతత్వ ఆధారాలు 73,000-55,000 సంవత్సరాల నాటిదిగా అంచనా వేయబడింది.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది.
జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట.ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి.
ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.తెలుగు సంవత్సరం,1674 సంవత్సరం, హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.
రోనాల్డ్ విల్సన్ రీగన్ (జననం: 1911 ఫిబ్రవరి 6, మరణం: 2004 జూన్ 5) అమెరికా దేశ 40 వ అధ్యక్షుడు. ఈయన 1981 నుండి 1989 వరకు రెండు విడతలు అమెరికా అధ్యక్షునిగా రిపబ్లికన్ పార్టీ తరఫున ఎన్నికైనారు. అమెరికా, రష్యా (ఒకప్పటి సోవియట్ యూనియన్) మధ్య దశాబ్దాల పాటు నడచిన శీతల సమరమును పరిష్కరించి, అమెరికన్ ప్రజల విశేషాభిమానాన్ని చూరగొన్న అధ్యక్షుడు రీగన్ .
మూస:భారత సంవిధానం.rk 1 వ భాగం: సమన్వయ భారతం: 1 వ అధికరణ: దేశనామము, సమన్వయ భారత పరధి 2 వ అధికరణ: నూతన రాష్ట్రాల స్థాపించుట, చేర్చుకొనుట 2 ఎ వ అధికరణ: ఉపసంహరింపబడింది. 3 వ అధికరణ: నూతన రాష్ట్రాల ఏర్పాటు, ఇప్పుడున్న రాష్ట్రా పరిధులు, విస్తీర్ణముల మార్పూ 4 వ అధికరణ: 2,3 లకు ఉపయుక్తమైనవి, ఆవశ్యకమైనవి, అనుసంబవమైన మార్పూలు; ఒకటి, నాలుగు షెడ్యూలులో మార్పులు. {{2 వ భాగం : పౌరసత్వం}} 5 వ అధికరణ: ఈ సంవిధానం ప్రారంభంనాటి పౌరసత్వం 6 వ అధికరణ: పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారి పౌరసత్వ హక్కులు.
మేరీ మాగ్డలిన్ "మార్లిన్" డీట్రిచ్ (, German: [maɐ̯ˈleːnə ˈdiːtʁɪç]; 1901 డిసెంబర్ 27 – 1992 మే 6) జర్మన్-అమెరికన్ నటి, గాయని. 1910ల నుంచి 1980ల వరకూ సాగిన ఆమె సుదీర్ఘ కెరీర్లో ఎప్పటికప్పుడు తనని తాను పునర్ అన్వేషించుకుంటూ ప్రాచుర్యాన్ని నిలబెట్టుకునేది.1920ల్లో మార్లిన్ బెర్లిన్‌లో రంగస్థలంపైనా, నిశ్శబ్ద చిత్రాల్లోనూ నటించింది. ద బ్లూ ఏంజెల్ (1930)లో లోలా-లోలా పాత్రలో ఆమె నటన ఆమెకు అంతర్జాతీయ ప్రాచుర్యం, పారామౌంట్ పిక్చర్స్‌తో ఒప్పందాన్ని సంపాదించిపెట్టింది.
భారతదేశంలో బహుళ-పార్టీ వ్యవస్థ ఉంది. భారత ఎన్నికల సంఘం (ECI) జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఆబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా గుర్తింపునిస్తుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ రిజర్వు చేయబడిన పార్టీ చిహ్నం, ప్రభుత్వ టెలివిజన్ మరియు రేడియోలో ఉచిత ప్రసార సమయం, ఎన్నికల తేదీల సెట్టింగ్‌లో సంప్రదింపులు మరియు ఎన్నికల నియమాలు మరియు నిబంధనలను సెట్ చేయడంలో ఇన్పుట్ ఇవ్వడం వంటి అధికారాలను పొందుతుంది.
పదం గోత్ర అంటే సంస్కృతం భాషలో "సంతతికి" అని అర్థం.గోత్రము లో" గో "అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.గోత్రము అంటే గోశాల అని కూడా మరో అర్థము. గోత్రము ఒక కుటుంబం పేరు కొంతవరకు సంబంధముగల, బంధుత్వముగల వంటిది. ఒక కుటుంబం యొక్క ఇచ్చిన (పెట్టిన) పేరు తరచుగా దాని గోత్రమునకు విభిన్నంగా ఉంటుంది, ఇచ్చిన (పెట్టిన) పేర్లు, సాంప్రదాయిక వృత్తిని ప్రతిబింబిస్తుంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ప్రధాన విశ్వవిద్యాలయం. దీని విస్తీర్ణం 3.90 హెక్టారులు.ఈ విశ్వవిద్యాలయం పరిధిని 2011 భారత జనాభా గణాంకాలలో ఒక జనగణన పట్టణంగా గుర్తించింది.ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసఫ్ జా VII చే 1917లో స్థాపించబడింది. దీని స్థాపనకు సంబంధించిన ఫర్మానాను 1917, ఏప్రిల్ 26న జారీ చేశారు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అనేది సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు, దీన్ని భారతీయ రైల్వేలు నిర్వహిస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ని డిజైన్ చేసి తయారు చేసింది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద మొదటి రైలు ₹97 కోట్లతో 18 నెలల్లో తయారు చేయబడింది.
రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు.
గాట్ఫ్రైడ్ విల్హెల్మ్ లెబ్నిజ్
గాట్ఫ్రైడ్ విల్హెమ్ (వాన్) లిబ్నిజ్ (/ laɪbnɪts /; [5] జర్మన్: [ɡɔtfʁiːt vɪlhɛlm fɔn laɪbnɪts] [లేదా] [laɪpnɪts]; [7] ఫ్రెంచ్: గోడ్ఫ్రోయ్ గిల్లాయ లీబ్నిట్జ్ ( 1646 జూలై 1 - 1716 నవంబరు 14 ) జర్మనీ దేశానికి చెండిన గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త. సర్ ఇజాక్ న్యూటన్ సృష్టించిన కలన గణిత శాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు. ఈయన 1685 లో ఒక పిన్‌వీల్ కాలిక్యులేటర్‌ను, లిబ్నిజ్ చక్రాన్ని కనిపెట్టాడు.
షిండ్లర్స్ ఆర్క్ అనే నవల ఆధారంగా స్టీవెన్ స్పీల్బర్గ్ 1993లో తీసిన చిత్రం ఇది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూదుల పైన జర్మనులు మారణహోమం సాగిస్తున్నపుడు జర్మన్ వ్యాపారవేత్త అయిన ఆస్కార్ షిండ్లర్ వెయ్యిమందికి పైగా యూదులను తన ఫ్యాక్టరీలో ఉద్యోగులుగా నియమించి వారి ప్రాణాలను కాపాడిన యథార్థ సంఘటన ఈ చిత్రానికి మూలం. 2007లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిటూట్ ఈ చిత్రాన్ని సినీ చరిత్రలో అత్యున్నత 100 చిత్రాలో ఎనిమిదవ చిత్రంగా ఎన్నుకున్నది.
ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసంతెలుగులో పోతన రచించిన గ్రంథాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి. భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత, ధర్మశాస్త్రం సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ.
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు
భారతదేశంలో ప్రాథమిక విధులు (ఆంగ్లం : Fundamental Duties) 1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి. 2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడింది.
పాఠశాలలలో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కలిపించే ప్రభుత్వ విధానాన్ని మధ్యాహ్న భోజన పథకము (Mid Day Meal Program) అంటారు. పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశంతో, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. ఇందులో అన్ని పని దినాలలో విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా భోజనం పెడతారు.
డాక్టర్ రవికుమార్ పనస తెలంగాణకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త, సినీ నిర్మాత. జర్నలిస్టుగా, పి.ఆర్.ఓ.గా తన జీవితాన్ని ప్రారంభించిన రవికుమార్ వ్యాపార వ్యూహకర్తగా, మాస్టర్ ఆఫ్ ఫిల్మ్ & మీడియా, పబ్లిక్ రిలేషన్స్ గీక్ గా, సినిమా నిర్మాతగా, రియల్ ఎస్టేట్ ప్రమోటర్ గా ఇటు వ్యాపారంగంలోనూ, అటు సినిమారంగంలోనూ రాణిస్తున్నాడు.ఒక సామాన్య మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చిన రవికుమార్, వ్యాపార ప్రపంచంలో ఎంతో అనుభవాన్ని సంపాదించడంతోపాటు, వ్యాపార నిర్వహణ, మీడియా ప్రమోషన్లలో యునెస్కో ఐఎస్సిఈడీ నుండి డాక్టరేట్ కూడా పొందాడు.
విరూపాక్ష 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నటుడు పవన్ కళ్యాణ్ మార్చి 2న విడుదల చేయగా, సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న విడుదల చేయనున్నారు.
మహేంద్ర సింగ్ ధోనీ ( ఎం ఎస్ ధోనీ) భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.ఇతను1981 జూలై 7 ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు, పరిమిత ఓవర్ల ఫార్మాట్లు భారత జాతీయ క్రికెట్ జట్టు మాజి సారథి. అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, వికెట్ -కీపర్, అతను విస్తృతంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఫినిషెర్ లో ఒక్కడిగా భావించబడుతాడు. అతను తన తొలి వన్ డే ఇంటర్నేషనల్ ( ఒడిఐ ) బంగ్లాదేశ్‌తో డిసెంబరు 2004 లో ఆడాడు.,, శ్రీలంకతో ఒక సంవత్సరం తరువాత తన తొలి టెస్ట్ ఆడాడు.